ఈ వారమే లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ బిల్లు..!  | Waqf Amendment Bill is expected to be introduced in Lok Sabha in this week | Sakshi
Sakshi News home page

ఈ వారమే లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ బిల్లు..! 

Mar 24 2025 4:33 AM | Updated on Mar 24 2025 7:30 AM

Waqf Amendment Bill is expected to be introduced in Lok Sabha in this week

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వక్ఫ్‌ సవరణ బిల్లు–2024ను ఈ వారంలోనే లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఏప్రిల్‌ 4వ తేదీతో పార్లమెంట్‌ సమావేశాలు ముగియనున్న దృష్ట్యా, అంతకుముందే ఈ వారంలోనే బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

వక్ఫ్‌ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికను ఇప్పటికే స్పీకర్‌ ఓం బిర్లాకు అందించింది. వక్ఫ్‌ బోర్డుల్లో కనీసం నలుగురు ముస్లిమేతరులను చేర్చుకోవచ్చని భూ వివాదాలపై దర్యాప్తు అధికారాన్ని కలెక్టర్ల నుంచి సీనియర్‌ రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు బదిలీ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ముస్లిమేతరులు వక్ఫ్‌ బోర్డుల్లో సభ్యులుగా ఉండేందుకు వీలు కల్పించడం, కలెక్టర్లకు అదనపు అధికారాల వంటివాటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement