‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్‌ తాగండి’ | Rahul Gandhi Asks Government Over China Occupied Indian Lands | Sakshi
Sakshi News home page

‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్‌ తాగండి’.. రాహుల్‌పై ఠాకూర్‌ సెటైర్లు

Apr 3 2025 3:29 PM | Updated on Apr 3 2025 4:07 PM

Rahul Gandhi Asks Government Over China Occupied Indian Lands

న్యూఢిల్లీ,సాక్షి: లోక్‌సభలో రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 4వేల స్కైర్‌ కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. మన భూముని మనం తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేయాలని డిమాండ్‌ చేశారు.  

పార్లమెంట్‌ దిగువ సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ‘భారత్‌ భూభాగంలో ఏం జరుగుతోంది నాకు అర్ధం కావడం లేదు. చైనా భారత్‌ భూభాగాన్ని ఆక్రమించింది. మన భూమి మనకు వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు .. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు లేఖ రాయాలి. 

చైనా 4వేల స్కైర్‌ కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించుకుంది. ఈ విషయం నన్ను మరింత షాక్‌కు గురిచేసింది. మన భూమిని మనం ఎలా తిరిగి స్వాధీనం చేసుకోవాలి? అని ఆలోచించాల్సి ఉంది. అలా చేయడం లేదు. భారత విదేశాంగ కార్యదర్శి చైనా రాయబారితో కలిసి కేక్ కట్ చేస్తున్నారు. చైనా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. చైనాను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై కేంద్రం సభలో ప్రకటన చేయాలి. భారత్‌పై అమెరికా 26శాతం సుంకాలు విధించింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి’ అని అన్నారు. 

అయితే రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఘాటుగా స్పందించారు. రాహుల్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎవరి కాలంలో ఈ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోకి తీసుకుంది? డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా అధికారులతో సూప్ తాగిన వ్యక్తులు ఎవరు? రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనీయుల నుండి డబ్బు ఎందుకు తీసుకుంది?’ అని అడిగారు. అలాంటి వారికి నేను ఒక్కటే చెబుతున్నా.. భారత్‌ భూభాగాన్ని చైనా ఒక్క అంగుళం కూడా తీసుకోలేదు. ఈ తరహా రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రాహుల్‌కు హితువు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement