NEET రూ. కోటి ఇవ్వండి : ప్రధానికి సీజేపీ అభిజీత్‌ బహిరంగ లేఖ | Abhijeet Dipke Seeks Rs 1 Cr Compensation For NEETVictims Writes Open Letter To PM Modi | Sakshi
Sakshi News home page

NEET రూ. కోటి ఇవ్వండి : ప్రధానికి సీజేపీ అభిజీత్‌ బహిరంగ లేఖ

Jun 19 2026 3:34 PM | Updated on Jun 19 2026 3:49 PM

Abhijeet Dipke Seeks Rs 1 Cr Compensation For NEETVictims Writes Open Letter To PM Modi

నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆత్మహత్యలకు పాల్పడిన నీట్ బాధితుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌తో శాంతియుత ఉద్యమాన్ని సాగిస్తున్న అభిజీత్‌ తన తాజా డిమాండ్‌తో ఒక లేఖను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 

నీట్‌ (NEET) 2026 పరీక్షా పేపర్ లీక్ వివాదం, పరీక్ష రద్దు మరియు రీ-టెస్ట్ నిర్ణయాల వల్ల కలిగిన తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశ కారణంగా దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని వారాలుగా 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో ఐదు మరణాలు గత 48 గంటల్లోనే సంభవించాయని దీప్కే లేఖలో పేర్కొన్నారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీ సంఘటనలు, రీ-టెస్ట్‌  ఒత్తిడికి తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఉసురు తీసుకుంటున్నవిద్యార్థల కుటుంబాలలో తీవ్ర మానసిక ఆందోళనను రేకెత్తిస్తోందని  వాదించారు. ఈ ఒత్తిడి  యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఘోరమైన ధోరణి తగ్గకపోగా, మరింత తీవ్రమవుతోంది. గత రెండు నెలల్లో, ఆత్మహత్యలకు పాల్పడిన పలువురు విద్యార్థుల శోకతప్త కుటుంబాలను తాను వ్యక్తిగతంగా కలుసుకున్నానంటూ అభిజీత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని తక్షణమే  జోక్యం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని  విజ్ఞప్తి చేశారు. విద్యాపరమైన నిరాశ కారణంగా ఇకపై ఏ యువ  విద్యార్థి బలికాకుండా ఉండేందుకు అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకు రావాలని ప్రధానికి సూచించారు.

ఇదీ చదవండి: షాకింగ్‌ : కట్టేసి, జుట్టు కత్తిరించి, పైశాచికంగా.. వీడియో వైరల్‌

పిల్లలను కోల్పోయిన భరించలేని మానసిక వేదనతో పాటు, ఈ కుటుంబాలు ఇప్పుడు ఆర్థికంగా కూడా భారీగా నష్టపోయాయని పేర్కొన్నారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం చాలా కుటుంబాలు పెద్ద మొత్తంలో విద్యా రుణాలు తీసుకున్నాయని, అయితే విద్యావ్యవస్థలోని లోపాలతో వారి  ఆశలు ఆడియాలయ్యాయని చెప్పారు.

ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు

అభిజీత్ దీప్కే డిమాండ్స్‌

  • తమ జీవితకాల పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి, విద్యా రుణాలు తీసుకున్న బాధిత కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలి.

  • పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని జవాబుదారీలను చేయాలి.

  • విద్యావ్యవస్థలో జరుగుతున్న వరుస లోపాలు, పేపర్ లీకేజీల వల్ల ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొంటూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.

 

జంతర్ మంతర్ వద్ద  జూన్ 21 నిరసన
మరో వైపు తమ డిమాండ్లను నెరవేర్చాలని , పోటీ పరీక్షలపై మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించేలా సంస్కరణలు తీసుకురావాలని  కోరుతూ ఇప్పటికే  ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ సహా, దేశంలో అనేక ప్రధాన  నగరాల్లో ఉద్యమాన్ని చేపట్టింది సీజేపీ ఆధ్వర్యంలో మరింత  ఒత్తిడి తెచ్చేందుకు జూన్ 20 నుండి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గుమిగూడనున్నట్లు దీప్కే ప్రకటించారు.  కాగా, నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న దేశవ్యాప్తంగా కేటాయించిన పరీక్షా కేంద్రాలలో జరగాల్సి ఉంది.

ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్‌, 75 రోజులకే పెళ్లి : నటి లవ్‌ స్టోరీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement