ప్రధాని పోస్ట్‌ను డిలీట్‌ చేయడంపై కేంద్రం సీరియస్‌? ఏం జరుగుతోంది? | Meta Executives to Meet Indian Government on August 5-6 Over PM Modi Video Row & AI Concerns | Sakshi
Sakshi News home page

ప్రధాని పోస్ట్‌ను డిలీట్‌ చేయడంపై కేంద్రం సీరియస్‌? ఏం జరుగుతోంది?

Aug 4 2026 3:17 PM | Updated on Aug 4 2026 3:53 PM

 Meta executives expected to meet govt on 5th and 6th August

న్యూఢిల్లీ: మెటా ప్రతినిధులు ఆగస్టు 5, 6 తేదీల్లో ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఈ సమావేశంలో చట్టపరమైన అంశాలు, నిబంధనల అమలు, కృత్రిమంగా సృష్టించిన సమాచారం, ప్రముఖులకు సంబంధించిన విషయాలను తొలగించే సందర్భాల్లో అనుసరించాల్సిన రక్షణ చర్యలపై చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పారు.

ఈ పరిణామం పరీక్ష ప్రశ్నపత్రాల లీకులపై తీసుకున్న చర్యలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్ట్‌ చేసిన వీడియోను ఫేస్‌బుక్‌లో కొద్దిసేపు తొలగించిన ఘటన తర్వాత చోటుచేసుకుంది. ఈ ఘటన సాంకేతిక లోపం వల్ల జరిగిందని మెటా తెలిపింది.

"మెటా ప్రతినిధులు ఆగస్టు 5, 6 తేదీల్లో ప్రభుత్వ ప్రతినిధులను కలుసుకునే అవకాశం ఉంది. భారత చట్టాలకు సంబంధించిన అంశాలు, నిబంధనల అమలు, కృత్రిమంగా సృష్టించిన సమాచారం, ప్రముఖులకు సంబంధించిన విషయాలను తొలగించే సమయంలో అనుసరించాల్సిన రక్షణ చర్యలు చర్చకు వచ్చే అవకాశం ఉంది" అని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి తెలిపారు.

మోదీ వీడియో డిలీట్‌ వివాదం 
జులై 28 తెల్లవారుజామున ఫేస్‌బుక్‌ ఆ వీడియోను కనపడకుండా చేసింది. ఆ తర్వాత తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. "దాన్ని పొరపాటున తొలగించాం. ఆ తర్వాత తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చాం" అని మెటా ప్రతినిధి ప్రకటనలో తెలిపారు.

ఆ వీడియోను తొలిసారి జులై 23న పోస్ట్‌ చేశారు. నీట్-యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు 36 రోజులపాటు చేపట్టిన ఆందోళన మధ్య జెన్‌ జీ విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ నేరుగా చేసిన తొలి ప్రసంగం అదే.

ఈ ఘటన తర్వాత జరిగిన పరిస్థితులపై వివరణ ఇవ్వాలని, విధాన పరంగా, సాంకేతిక పరంగా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం మెటాను కోరింది. ఇందుకు అత్యున్నత స్థాయి ప్రతినిధులను పంపాలని సూచించింది.

ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ మెటా ప్రభుత్వానికి లేఖ రాసిందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి తెలిపారు. "ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ మెటా ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇది ఎందుకు జరిగిందో తమ అవగాహనను కూడా వివరించింది. జులై 28 నుంచే ప్రముఖుల ఖాతాలకు సంబంధించిన కొత్త విధానాలు అమల్లోకి తెచ్చినట్లు తెలిపింది. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఆ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది" అని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement