పెట్రోల్‌ ఎగుమతులపై ట్యాక్స్‌ పెంపు! | Centre Hikes Windfall Tax on Petrol Diesel and ATF Exports | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ ఎగుమతులపై ట్యాక్స్‌ పెంపు!

Aug 4 2026 2:51 PM | Updated on Aug 4 2026 2:56 PM

Centre Hikes Windfall Tax on Petrol Diesel and ATF Exports

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌ల ఎగుమతులపై కేంద్రం విండ్‌ఫాల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ను పెంచింది. ఆగస్టు 3 (సోమవారం) నుంచి పక్షం రోజుల పాటు ఇది అమలవుతుంది. ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ ప్రకారం డీజిల్‌ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ (ఎస్‌ఏఈడీ)ని లీటరుకు రూ. 15.5 నుంచి రూ. 25.5కి పెంచారు. అలాగే ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 14.5 నుంచి రూ. 22కి, పెట్రోల్‌పై రూ. 2,5 నుంచి రూ. 3.5కి ఎస్‌ఏఈడీ పెరిగింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. దేశీయంగా ఇంధనాల లభ్యతను పెంచేందుకు మార్చి 27న డీజిల్, ఏటీఎఫ్‌పై ఆ తర్వాత మే 16 నుంచి పెట్రోల్‌ ఎగుమతులపైనా విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధిస్తున్నారు. అంతర్జాతీయ, దేశీయ రేట్ల మధ్య వ్యత్యాసాన్ని ఎగుమతిదారులు అనుచితంగా సొమ్ము చేసుకోకుండా నివారించేందుకు కేంద్రం ఈ ట్యాక్స్‌ను విధిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement