మంగళవారం ఉదయం మిశ్రమ ఫలితాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 210.08 పాయింట్లు లేదా 0.27 నష్టంతో 78,428.95 వద్ద, నిఫ్టీ 159.40 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో 24,614.90 వద్ద నిలిచాయి.
ఏథర్ ఎనర్జీ లిమిటెడ్, కేఈఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఎల్ లిమిటెడ్, సీఈ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


