‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ని చూస్తుంటే జాలేస్తోంది : కేంద్ర మం‍త్రి కిరణ్ రిజిజు | Kiren Rijiju comments on Cockroach Janata Party | Sakshi
Sakshi News home page

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ని చూస్తుంటే జాలేస్తోంది : కేంద్ర మం‍త్రి కిరణ్ రిజిజు

May 24 2026 12:03 PM | Updated on May 24 2026 12:16 PM

Kiren Rijiju comments on Cockroach Janata Party

సాక్షి,ఢిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల జరిగిన సభలో మాట్లాడుతూ..‘కాక్రోచ్ జనతా పార్టీ’కి పాకిస్థాన్‌, బిలియనీర్ జార్జ్ సోరోస్ నెట్‌వర్క్‌ల నుంచి మద్దతు లభిస్తోంది అని వ్యాఖ్యానించారు.

అయితే, ఈ ఆరోపణలను కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. మా పార్టీకి పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధం లేదు. రిజిజు చేసిన ఆరోపణలు అసత్యం, నిరాధారం. మా పార్టీ ఉద్దేశ్యం భారతీయ ప్రజల సమస్యలను వినిపించడం, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడమే” అని స్పష్టం చేశారు. అభిజీత్ దిప్కే తమ పార్టీకి భారత్‌లోనే 94 శాతం మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారని గుర్తు చేశారు.

దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పాకిస్థాన్, జార్జ్ సోరోస్ నెట్‌వర్క్‌ల నుండి ఫాలోవర్స్ సంపాదించుకునే వారిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. మన దేశంలో తగినంత జనాభా, అత్యంత చురుకైన యువత ఉన్నారు. వారు నిజమైన, విలువైన ఫాలోవర్స్‌. భారత్ వ్యతిరేక నెట్‌వర్క్‌ల నుంచి గుర్తింపు కోరాల్సిన అవసరం లేదు” అని అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement