ఇస్లామాబాద్: తాను తీసిన గొయ్యిలో తానే పడుతాడు అని సొమెత మన వాడుక భాషలో బాగ వాడుతుంటాం.. ఈ పదం ఇప్పుడు పాకిస్థాన్‌కు సరిగ్గా సరిపోతుంది. భారత్‌పై దురాక్రమణ చేసి భూమిని స్వాధీనం చేసుకొని దానిని ఆజాద్ కశ్మీర్ అంటూ తప్పుడు ప్రచారాలు చేసిన పాక్ ఇప్పుడు ఆప్రాంత ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తోంది. పీవోకేలో జరుగుతున్న నిరసనలను నియంత్రించడం ఇప్పుడు ఆ దేశానికి తలకు మించిన పనిగా మారింది. దీంతో వారిని కంట్రోల్ చేయలేక ఆ దేశం తలపట్టుకుంటుంది.
"పాక్ ఆక్రమిత కశ్మీర్" ఈ పేరు వింటే చాలు ప్రతి భారతీయుని గుండె రగులుతుంది. మన దేశానికి ఏ విధంగా సరితూగని దాయాది పాకిస్థాన్... అక్రమణ జరిపి తన దేశ నియంత్రణలో ఉంచుకున్న ప్రాంతం ఇది.. ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్‌కు అంత కష్టమైన పని కాకపోయినా అంతర్జాతీయ ఒత్తిడి దృష్ట్యా మౌనంగా ఉండాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం ప్రజలే ఆ దేశానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన నిరసనలు తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకతతో నిరసనలు చేస్తున్న ప్రజలపై అధికారులు ఇష్టారీతిన కాల్పులు జరిపారు. ఈ ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల తిరుగుబాటును అణిచివేయడం ఇప్పుడు ఆ దేశానికి పెద్దసమస్యగా మారింది. గత 78 ఏళ్లుగా ఇది ఆజాద్ కశ్మీర్ అని పాకిస్థాన్ చెబుతోందని కానీ ఇది ఆజాద్ కశ్మీర్ కాదని ఆక్రమిత కశ్మీర్ అని అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత చెప్పింది అదే..!
PoKలో జరిగిన నిరసనలకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అందుకు సంబంధించిన ఒక వీడియోలో JAAC నాయకుడు మాట్లాడుతూ "గత 78 సంవత్సరాలుగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌ను 'ఆజాద్ కాశ్మీర్' అని పిలుస్తోంది. కానీ ఇప్పుడు 80,000 మందికి పైగా హాజరైన ఒక ర్యాలీలో PoK ప్రజలు ఈ వాదనను సవాలు చేశారు. కశ్మీర్ వివాదాస్పద భూభాగం కాదు. అది ఆక్రమిత భూభాగం. దానికి ఎన్నడూ స్వాతంత్ర్యం లేదు. గత 78 ఏళ్లుగా భారత్ ఇదే చెబుతుండగా, పాకిస్థాన్ దానిని ప్రచారం అని కొట్టిపారేస్తోంది. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలే తమ ర్యాలీలలో అదే విషయాన్ని చెబుతున్నారు. అని వీడియోలో మాట్లాడుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న రావల్ కోట్ ర్యాలీలో 80 వేల మందికి పైగా పాల్గొన్నారు. మరి ఈ విషయంపై పాక్ ఏం చేస్తోంది. ఈ ఎనబై వేల మందిని సైతం భారత్ పంపిందని ప్రచారం చేస్తోందా అని అక్కడి నాయకులు నిలదీశారు. ఈ నిరసనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. PoKలోని ప్రజల ఆగ్రహం ఆకస్మికంగా తలెత్తినది కాదని, ఇది పాకిస్తాన్ సంవత్సరాలుగా సాగిస్తున్న దోపిడీ, హక్కుల ఉల్లంఘనలు, అక్రమ ఆక్రమణల ఫలితమేనని తెలిపింది.
Pakistan has spent 78 years calling PoJK "Azad Kashmir." 🇮🇳
The people of PoJK just corrected that in front of 80,000 people.
JAAC leader Sardar Aman Khan said it straight.
"Kashmir is not disputed territory. It is occupied territory. And it was never truly Azad."
India has… pic.twitter.com/jb50aHVSQE— Aviator Anil Chopra (@Chopsyturvey) July 15, 2026


