రూ. 6 లక్షల కోట్లు ఆవిరి : 58 ఏళ్ల చరిత్రలో ఇంత పతనం ఎన్నడూ లేదు! | What Went Wrong IBM Loses USD 70 Billion After Worst Stock Crash In 58 Years | Sakshi
Sakshi News home page

రూ. 6 లక్షల కోట్లు ఆవిరి : 58 ఏళ్ల చరిత్రలో ఇంత పతనం ఎన్నడూ లేదు!

Jul 15 2026 11:07 AM | Updated on Jul 15 2026 12:24 PM

What Went Wrong IBM Loses USD 70 Billion After Worst Stock Crash In 58 Years

ఐబీఎం (IBM) చరిత్రలోనే అతిపెద్ద స్టాక్ పతనం

యూఎస్ టెక్ దిగ్గజం ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్, IBM) రెండో త్రైమాసిక ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో, మంగళవారం ఆ కంపెనీ షేర్లు ఏకంగా 25 శాతం పడిపోయాయి. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, గత 58 ఏళ్లలో ఐబీఎం చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన స్టాక్ పతనం. ఈ ఒకే ఒక్క రోజు క్రాష్ వల్ల కంపెనీ దాదాపు 67 బిలియన్ల నుండి 70 బిలియన్ల డాలర్లమేర మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను (మార్కెట్ విలువను) కోల్పోయింది. అంటే దీని విలువ భారతీయ రూపాయలలో సుమారు  రూ. 6,73,228 కోట్లు (ఆరు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు).

1911లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక కంపెనీ జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి కేవలం 1 శాతం వృద్ధితో  17.2 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని మాత్రమే నమోదు చేసింది. "మేము తడబడ్డాము... మార్కెట్‌కు అనుగుణంగా తగినంత వేగంగా మారలేకపోయాము," అని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ పెట్టుబడిదారులకు రాసిన లేఖలో అంగీకరించారు.

స్టాక్ పతనానికి ప్రధాన కారణాలు
పరిశ్రమ అంతటా సరఫరా కొరత : ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించు కోవడానికి కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నడుస్తోంది. దీనివల్ల సర్వర్లు, మెమరీ చిప్స్, స్టోరేజ్ పరికరాలకు డిమాండ్ భారీగా పెరిగి, ధరలు ఎక్కువయ్యాయి. మార్కెట్లో వీటి కొరత కూడా ఏర్పడింది.

బడ్జెట్ మళ్ళింపు: జూన్ చివరి నాటికి, ధరలు మరింత పెరుగుతాయనే భయంతో ఐబీఎం కార్పొరేట్ క్లయింట్లు తమ బడ్జెట్‌ను సర్వర్లు, మెమరీ చిప్స్ కొనుగోలు చేయడానికి మళ్లించారు.

మెయిన్‌ఫ్రేమ్ బిజినెస్‌పై దెబ్బ: దీనివల్ల ఐబీఎంకు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే 'మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్లు' వాటి సాఫ్ట్‌వేర్ కొనుగోళ్లను క్లయింట్లు వాయిదా వేశారు. ఫలితంగా ఐబీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపార ఆదాయం 7 శాతం పడిపోయింది.

 సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు (Cybersecurity Concerns)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సైబర్ దాడులు మరింత అధునాతనంగా మారుతుండటంతో, కంపెనీలు తమ బడ్జెట్‌ను సైబర్ సెక్యూరిటీ వైపు మళ్లిస్తున్నాయి. ముఖ్యంగా యాంత్రోపిక్ (Anthropic) సంస్థ విడుదల చేసిన 'మైథోస్ ఏఐ' (Mythos AI) మోడల్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోని లోపాలను సులభంగా గుర్తిస్తోందని, దీనివల్ల హ్యాకర్లకు అవకాశం దొరుకుతుందని టెక్ పరిశ్రమ భయాందోళనలకు గురైంది. దీంతో క్లయింట్లు తమ మునుపటి ప్రాజెక్ట్‌లను పక్కన పెట్టి, సైబర్ రక్షణను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. ఈ పరిణామంతో క్రౌడ్‌స్ట్రైక్ (CrowdStrike), ఆక్టా (Okta), నెట్‌స్కోప్ (Netskope) వంటి సైబర్ సెక్యూరిటీ కంపెనీల షేర్లు 11 నుండి 12 శాతం వరకు పెరిగాయి.

భవిష్యత్తుపై ప్రశ్నలు
ఐబీఎం షేర్ల పతనం సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ సంస్థల (SaaS - Software as a Service) భవిష్యత్తుపై సరికొత్త చర్చకు దారి తీసింది. ఐబీఎంతో పాటు సేల్స్‌ఫోర్స్ (Salesforce), అడోబ్ (Adobe), ఇంటూయిట్ (Intuit) కంపెనీల షేర్లు కూడా మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఏఐ మోడల్స్ సాధారణ వినియోగదారులకు కూడా సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలను అందించగలవని, దీనివల్ల ఈ రకమైన సాఫ్ట్‌వేర్ రంగానికి ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు (దీనిని వాల్ స్ట్రీట్ 'సాస్-పోకలిప్స్'గా పిలుస్తుంది) మళ్లీ తెరపైకి వచ్చాయి.

ఇదీ చదవండి: "హలో..నేను దివ్య మాట్లాడుతున్నాను": కట్‌ చేస్తే..రూ. 21 కోట్ల స్కాం

ఐబీఎంకు ఆశాజనకమైన అంశాలు
ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్ విక్రయించే ఐబీఎం అనుబంధ సంస్థ రెడ్ హ్యాట్ (Red Hat) 11 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.మెయిన్‌ఫ్రేమ్‌లు మినహా, కంపెనీకి చెందిన ఇతర సర్వర్ మరియు స్టోరేజ్ వ్యాపారం 37 శాతం వృద్ధి చెందింది. ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్‌లలోని లోపాలను సరిదిద్దడానికి ఐబీఎం  5 బిలియన్‌ డాలర్ల వ్యయంతో 'లైట్‌వెల్' (Lightwell) అనే కొత్త చొరవను ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీమోర్గాన్ చేజ్, గోల్డ్‌మన్ శాక్స్ వంటి ప్రముఖ బ్యాంకులు  దీనికి మద్దతు ఇస్తున్నాయి.

ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement