సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party - CJP) గురించే చర్చ నడుస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే వేగంగా దూసుకుపోతున్న ఈ సరికొత్త వ్యంగ్య (Satirical) ఉద్యమం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వైరల్ ట్రెండ్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు తెలుసా?
భారతదేశ యువతను అనూహ్యంగా ఆకట్టుకున్న సీజేపీ వెనుక ఉన్న ఆ సంచలనం పేరు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke).30 ఏళ్ల ఈ రాజకీయ ప్రచార వ్యూహకర్త, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన ఉద్యోగాలు లేక, సమాజంలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియా, ఆర్‌టీఐ (RTI) యాక్టివిస్టులుగా మారి వ్యవస్థపై దాడి చేసే కొంతమంది నిరుద్యోగ యువతను "బొద్దింకలు" (Cockroaches), "సమాజానికి పట్టిన పరాన్నజీవులు" (Parasites) అన్న వ్యాఖ్యలకు ఆన్‌లైన్‌లో ప్రతిస్పందనగా ప్రారంభమై, సునామీలా చుట్టేస్తున్నాడు. ఆ తరువాత ఆయన వివరణ ఇచ్చుకున్నప్పటికీ .. ‘బొద్దింక’ అనే పదాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు అభిజీత్.
యువతను అవమానించిన ఆ పదంతోనే సరికొత్త వ్యంగ్య రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. ఫలితంగా సీజేపీ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ వెబ్ సైట్ అండ్ అజెండా తమను తాను "సోమరులు, నిరుద్యోగ యువత పక్షపాతి" (Voice of the lazy and unemployed youth) గా ప్రకటించుకుంది. 'Secular, Socialist, Democratic, and Lazy' అనే ట్యాగ్‌లైన్‌తో నడుస్తున్న ఈ డిజిటల్ పార్టీకి కేవలం ఐదు రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల (1.2 కోట్లు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు వచ్చారు. ఇది దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. దీని ఆవిర్భావం కేవలం జోక్ కాదు.. యువత ఆక్రోశం! ఇంటర్నెట్ జోక్ లాగా మొదలైనప్పటికీ, దేశంలోని నిరుద్యోగం, నీట్ (NEET) పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలపై యువతలో ఉన్న అసంతృప్తిని ఈ వేదిక ప్రతిబింబిస్తోంది.
పార్టీలో చేరడానికి వింత నియమాలు:కచ్చితంగా నిరుద్యోగి అయి ఉండాలి (బలవంతంగానైనా, స్వచ్ఛందంగానైనా). విపరీతమైన సోమరితనం ఉండాలి (శారీరక శ్రమ పరంగా మాత్రమే). రోజుకు కనీసం 11 గంటలు ఆన్‌లైన్‌లోనే గడపాలి (Chronically Online). ప్రొఫెషనల్‌గా, లాజికల్‌గా వ్యవస్థపై విమర్శలు (Rant) గుప్పించగలిగే నైపుణ్యం ఉండాలి.
ఇంతకీ ఎవరీ అభిజీత్ దిప్కే?
పూణేలో జర్నలిజం చదివిన అభిజీత్, ఆ తర్వాత అమెరికాలోని ప్రముఖ బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ (PR) లో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నిరుద్యోగి.
Now attempts being made to hack Instagram pic.twitter.com/doFskK9D7Z
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026
ఆమ్ ఆద్మీ నేపథ్యం
సీజేపీని ప్రారంభించడానికి ముందు, దీప్కే 2020 - 2023 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. సోషల్ మీడియా విభాగంలో పనిచేశారు 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ విజయం సాధించినప్పుడు, దీప్కే రాజకీయ సందేశాలు మరియు యువతను చేరుకోవడంపై దృష్టి సారించిన మీమ్-ఆధారిత డిజిటల్ ప్రచారంపై పనిచేశారు.2024లో తన వ్యక్తిగత ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం కోసం ఆప్ నుండి బయటకు వచ్చి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు.
మేనిఫెస్టో
కేవలం మీమ్స్ కే పరిమితం కాకుండా 5 అంశాలతో కూడిన ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. జడ్జీలకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు వంటి రాజకీయ ప్రయోజనాలు కల్పించకూడదు.పార్టీ ఫిరాయింపులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.తాము కూడా ఆర్‌టీఐ (RTI) పరిధిలోకి వస్తామని, ఎలాంటి అజ్ఞాత విరాళాలు (Electoral Bonds) తీసుకోబోమని స్పష్టం చేయడం. మహువా మోయిత్రా, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖులు సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. సంప్రదాయ రాజకీయాల్లో డబ్బు, అంగబలం ఉన్నవారే రాజ్యమేలుతున్న తరుణంలో.. ఈ జెన్ జెడ్ (Gen Z) యువత కేవలం మీమ్స్, రీల్స్ ద్వారా డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తూ దేశంలోనే సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది.
As expected Cockroach Janta Party’s account has been withheld in India. pic.twitter.com/44ymllnSMJ
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026
ఇంతలోనే భారీ షాక్
మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ అభిజీత్ ట్వీట్ చేశారు. మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ అభిజీత్ ట్వీట్ చేశారు. ఊహించినట్టే, ' కాక్రోచ్ జనతా పార్టీని ఇండియాలో నిలిపివేశారని పేర్కొన్నారు.


