Sports News : Former Cricketer son bags Silver in Tokyo Olympics- Sakshi
Sakshi News home page

Tokyo Olympics: తండ్రి మాజీ క్రికెటర్‌; కొడుకు ఇవాళ ఒలింపిక్‌ చాంపియన్‌

Aug 3 2021 6:50 PM | Updated on Aug 4 2021 12:45 PM

Former Cricketer Son Bags Silver Medal 400m Hurdles Event Tokyo Olympics - Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ విన్‌స్టన్‌ బెంజమిన్‌ కుమారుడు రాయ్‌ బెంజమిన్‌ ఒలింపిక్స్‌లో  పతకం సాధించాడు. విషయంలోకి వెళితే.. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన 400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్స్‌లో రాయ్‌​ బెంజమిన్‌ 46.17 సెకండ్లలో గమ్యాన్ని చేరుకొని రజతం అందుకున్నాడు. ఒలింపిక్స్‌ చరిత్రలో 400 మీటర్ల హార్డిల్స్‌ను వేగంగా పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రాయ్‌ బెంజమిన్‌ నిలిచాడు. ఇప్పుడు బెంజమిన్‌ ఒలింపిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాడు.

ఇక రాయ్‌ బెంజమిన్‌ తండ్రి విన్‌స్టన్‌ బెంజమిన్‌ తన తొమ్మిదేళ్ల కెరీర్‌లో వెస్టిండీస్‌ తరపున 21 టెస్టులు, 85 వన్డేలు ఆడాడు. ఇక ఇదే హార్డిల్స్‌లో స్వర్ణం అందుకున్న నార్వే అథ్లెట్‌ కార్‌స్టెన్‌ వార్లోమ్‌ ప్రపంచరికార్డు సాధించాడు. 400 మీ హార్డిల్స్‌ను 45.94 సెకన్లలో చేరుకొని చరిత్ర సృష్టించాడు. బ్రెజిల్‌కు చెందిన అలిసన్‌ దాస్‌ సాంటోస్‌ 46.72 సెకండ్లతో కాంస్యం దక్కించుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్‌ మిచెల్‌ స్టార్క్‌ సోదరుడు బ్రెండన్‌ స్టార్క్‌ మెన్స్‌ హై జంప్‌ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్నా ఆరో స్థానంలో నిలిచాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement