Indian Mixed Relay Team Wins Silver At U-20 World Athletics Championship 2022 - Sakshi
Sakshi News home page

U-20 Athletics Championship 2022: భారత రిలే జట్టుకు రజతం

Aug 4 2022 1:52 PM | Updated on Aug 4 2022 3:24 PM

Indian Mixed Relay Team Wins Silver U-20 World Athletics Championship - Sakshi

కలి (కొలంబియా): ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత మిక్స్‌డ్‌ రిలే జట్టు 4X400 మీటర్ల పరుగులో రజత పతకం సాధించింది. శ్రీధర్, ప్రియా మోహన్, కపిల్, రూపల్‌ చౌదరీలతో కూడిన భారత జట్టు రేసును 3 నిమిషాల 17.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్‌ అండర్‌–20 అథ్లెటిక్స్‌లో భారత మిక్స్‌డ్‌ టీమ్‌ మెరుగైన ప్రదర్శనతో పతకంతో నిలబెట్టుకుంది. గతేడాది నైరోబీలో మొదటిసారిగా నిర్వహించిన ప్రపంచ అండర్‌ –20 అథ్లెటిక్స్‌లో మిక్స్‌డ్‌ జట్టు కాంస్యం గెలిచింది. అప్పుడు రూపల్‌ మినహా భరత్, ప్రియా, కపిల్‌ ముగ్గురు కాంస్యం గెలిచిన బృందంలో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement