
గ్వాటెమాల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి రూహి రాజు సత్తా చాటింది. ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన 22 ఏళ్ల రూహి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో కొలంబియాకు చెందిన జూలియానా గిరాల్డో చేతిలో 10-21, 15-21 తేడాతో ఆమె ఓటమి చవిచూసింది.
అన్‌సీడెడ్ ప్లేయర్‌గా ఈ ఈవెంట్‌లోకి అడుగుపెట్టిన రూహి రాజు.. క్వార్టర్ ఫైనల్‌లో గ్వాటెమాలకు చెందిన టాప్ సీడ్ నైక్ సోటోమేయర్‌ను 21-23, 21-19, 21-16 తేడాతో ఓడించింది. ఆతర్వాత హైదరాబాద్ అమ్మాయి సెమీఫైనల్లో పెరూ స్టార్ మియాహిరాపై 21-18, 21-17 తేడాతో విజయం సాధించింది.
కానీ టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన రూహి రాజు.. ఆఖరి మొట్టుపై మాత్రం బోల్తా పడింది. రూహి రాజు గతంలో సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ ప్రధాన కోచ్, వ్యవస్థాపకుడు ప్రదీప్ రాజు వద్ద శిక్షణ తీసుకుంది.