ప్రథమేశ్‌ ‘రజత’ గురి  | Indian player Prathamesh Jakar won silver medal | Sakshi
Sakshi News home page

ప్రథమేశ్‌ ‘రజత’ గురి 

Sep 11 2023 2:18 AM | Updated on Sep 11 2023 2:18 AM

Indian player Prathamesh Jakar won silver medal - Sakshi

హెర్మెసిలో (మెక్సికో): ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్స్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ ప్రథమేశ్‌ జాకర్‌ రజత పతకంతో మెరిశాడు. ఆదివారం జరిగిన కాంపౌండ్‌ ఈవెంట్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ప్రథమేశ్, మథియాస్‌ ఫులెర్టన్‌ (డెన్మార్క్‌) నిర్ణీత 15 బాణాల తర్వాత 148–148 పాయింట్లతో సమంగా నిలిచారు. ‘షూట్‌ ఆఫ్‌’లో ఇద్దరు 10 పాయింట్ల షాట్‌ కొట్టారు. అయితే మథియాస్‌ కొట్టిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంలో ఉండటంతో అతనికి స్వర్ణ పతకం దక్కింది.

ప్రథమేశ్‌కు 15 వేల స్విస్‌ ఫ్రాంక్‌లు (రూ. 13 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. భారత్‌కే చెందిన అభిషేక్‌ వర్మ ఒక పాయింట్‌ తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. మహిళల వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ, అదితి క్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement