
జాతీయ సీనియర్ మహిళల ఎలైట్ బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) రజత పతకం సాధించింది. హైదరాబాద్‌లో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో గాయం కారణంగా నిఖత్ ఫైనల్ బౌట్‌లో బరిలోకి దిగలేదు. దాంతో నిఖత్ ప్రత్యర్థి జ్యోతి (రైల్వేస్) రింగ్‌లోకి దిగకుండానే స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. రైల్వేస్ బాక్సర్లు మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 9 పతకాలను గెల్చుకున్నారు.