breaking news
womens teams
-
భారత మహిళా జట్టుకు పలువురు ప్రముఖుల ప్రశంస
ఐసిసి మహిళల ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కి చేరిన భారత మహిళా జట్టుకు పలువురు ప్రముఖులు ప్రశంసించారు. భారత మహిళా జట్టు 2025 ప్రపంచకప్ సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శనకు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. జట్టు పోరాటం, ఆత్మవిశ్వాసం, కీలక విజయాలపై సెలబ్రిటీల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. Fabulous victory! 🇮🇳Well done @JemiRodrigues and @ImHarmanpreet for leading from the front. Shree Charani and @Deepti_Sharma06, you kept the game alive with the ball.Keep the tricolour flying high. 💙 🇮🇳 pic.twitter.com/cUfEPwcQXn— Sachin Tendulkar (@sachin_rt) October 30, 2025There are wins that go beyond numbers on a scoreboard. This was one of them.Under pressure, with the world watching @ImHarmanpreet played with the calm and conviction of a true leader while @JemiRodrigues brought pure focus and intent to play an innings of a lifetime! This… pic.twitter.com/CdAwK07sCT— Yuvraj Singh (@YUVSTRONG12) October 30, 2025Australia soch rahi thi ek aur semi-final hai, aaram se jeeto aur pahuncho Final- hamari ladkiyon ne socha yeh to mauka hai asli dhamaka karne ka! Saare criticism ko dho daala. Kya khel dikhaya. Proud of our women in blue. pic.twitter.com/oX5BfWK3PM— Virrender Sehwag (@virendersehwag) October 30, 2025 अद्भुत जीतऐतिहासिक प्रदर्शनभारत की बेटियों ने दिखाया हम नहीं किसी से कम। #WomensWorldCup2025 के सेमीफाइनल मुकाबले में भारतीय महिला क्रिकेट टीम ने ऑस्ट्रेलिया को 5 विकेट से धूल चटाई।जेमिमा रोड्रिगेज और हरमनप्रीत कौर के जज़्बे को सलाम। पूरी टीम को बधाई,बहुत-बहुत शुभकामनाएं!… pic.twitter.com/szNYRJnirP— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) October 30, 2025Emotions run high 🥹🥹Historic win for India 🇮🇳 as they overpower an unbeaten Australian side to storm into the World Cup Final #CWC25 #WomensWorldCup2025 #INDWvsAUSW #JemimahRodrigues pic.twitter.com/EXghDmHFnu— Cricbuzz (@cricbuzz) October 30, 2025𝙏𝙚𝙖𝙧𝙨 𝙊𝙛 𝙅𝙤𝙮 💙Absolute scenes from Navi Mumbai 🇮🇳#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvAUS | @JemiRodrigues | @mandhana_smriti | @ImHarmanpreet pic.twitter.com/Mw6DahFmz2— BCCI Women (@BCCIWomen) October 30, 2025 Take a bow, Team India! 🇮🇳🏏Brilliant performance by our women's cricket team, @BCCIWomen, in the semifinal of the ICC #WomensWorldCup2025 beating the formidable Australia.An exceptional display of perseverance and teamwork to secure a well-deserved spot in the finals. A… pic.twitter.com/hytIOUcsod— Piyush Goyal (@PiyushGoyal) October 30, 2025 -
భారత జట్ల శుభారంభం
బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు అలవోక విజయాలతో శుభారంభం చేశాయి. బుధవారం మొదలైన ఈ మెగా టోర్నీలో మొరాకోతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 4–0తో గెలుపొందింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్, మహారాష్ట్ర గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొరాకో బలహీన ప్రత్యర్థి కావడంతో భారత బృందం ఈ మ్యాచ్‌లో గుకేశ్‌కు విశ్రాంతి ఇచ్చింది. తొలి రౌండ్ గేముల్లో ప్రజ్ఞానంద 30 ఎత్తుల్లో మొహమ్మద్ తిసిర్‌పై, అర్జున్ 40 ఎత్తుల్లో ఎల్బియా జాక్వెస్‌పై, విదిత్ 28 ఎత్తుల్లో మెహదీ పియరీపై, హరికృష్ణ 33 ఎత్తుల్లో అనస్ మొయాద్‌పై విజయం సాధించారు. మరోవైపు జమైకా జట్టుతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3.5–0.5తో గెలుపొందింది. తొలి రౌండ్ గేముల్లో వైశాలి 29 ఎత్తుల్లో క్లార్క్ అడానిపై, తానియా సచ్దేవ్ 41 ఎత్తుల్లో గాబ్రియేలా వాట్సన్‌పై, దివ్య దేశ్‌ముఖ్ 76 ఎత్తుల్లో రాచెల్ మిల్లర్‌పై విజయం సాధించగా... రెహానా బ్రౌన్‌తో జరిగిన గేమ్‌ను వంతిక అగర్వాల్ 53 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. భారత స్టార్ ద్రోణవల్లి హారికకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. రెండేళ్ల క్రితం చెన్నై ఆతిథ్యమిచి్చన చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు కాంస్య పతకాలు సాధించాయి. -
కాట్రావత్ శాంతకుమారి: తండా నుంచి థాయ్‌లాండ్‌కు
నాలుగోసారీ ఆడపిల్ల పుట్టింది. భారమవుతుందేమో అమ్మాలనుకుంటే అయిదొందలకు బేరమూ కుదిరింది. మళ్లీ వద్దనుకున్నారు అమ్మానాన్న. ఎంత కష్టమైనా తామే సాకాలనుకున్నారు. ఐదో క్లాసు నుంచే కూలిపనులకెళ్లింది. మిల్లులో కూలిపనుల కోసం సంచుల్లో తవుడు ఎత్తిన ఆ చేయి... ఇప్పుడు అంతర్జాతీయ ఆటస్థలాల్లో వాలీబాల్ ఎత్తుతోంది. బంతిని బాదినంత తేలిగ్గా బీదరికాన్నీ బాదడానికి ప్రయత్నిస్తోంది. నెట్ అవతలికి బంతిని పంపినట్టుగా తన నైపుణ్యాలను దేశం బయటా చూపుతోంది. ఎక్కడో గిరిజనతండాల్లో పుట్టిన ఆ యువతి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపడానికి ఇప్పుడు మరోసారి సమాయత్తమవుతోంది. ఆల్ ద బెస్ట్... శాంతకుమారి. ఉమ్మడి పాలమూరులోని ప్రస్తుత వనపర్తి జిల్లా చిట్యాల మండలం తూర్పుతండాకు చెందిన క్రీడా ఆణిముత్యం కాట్రావత్ శాంతకుమారి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత వాలీబాల్ క్రీడలో మహిళల కేటగిరిలో జాతీయ జూనియర్ జట్టుకు ఎంపికైన మొట్టమొదటి బాలిక ఆమె. ఈ నెల ఆరు నుంచి 13వ తేదీ వరకు థాయిలాండ్‌లో జరిగిన 14వ ఏషియన్ వాలీబాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ఇటీవలే రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక్కపూట తిండికీ కష్టమే.. మా అమ్మ పేరు భామిని, నాన్న అమృనాయక్, మేము మొత్తం ఆరుగురు సంతానం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు అయ్యాయి. మూడో అక్క మంజుల ఇంటర్ సెకండియర్, తమ్ముళ్లు కుమార్ తొమ్మిది, రాహుల్ ఏడో తరగతి చదువుతున్నారు. మా అమ్మానాన్న అందరినీ సమానంగా చూస్తారు. పెద్ద కుటుంబం కావడం.. అమ్మానాన్నలకు ఉపాధి దొరక్కపోవడంతో ఒక్క పూట తిండి కూడా కష్టమయ్యేది. మేమందరం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోనే చదువుతున్నాం. కరోనాకు ముందు వరకు అమ్మానాన్న ముంబాయికి వలస వెళ్లారు. కరోనా కాలంలో తిరిగి వచ్చాక ఉపాధి దొరకడం కష్టమైంది. ప్రస్తుతం హైదరాబాద్ షేక్‌పేట (నాలా)లో మేస్త్రీ వద్ద పనిచేస్తున్నారు. వారు కష్టం చేసి సంపాదించిన దాంతోపాటు అప్పులు చేసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశారు. మిల్లులో కూలి పనులకు వెళ్లా.. నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు చిట్యాల ప్రైమరీ స్కూల్లో చదువుకున్నా. ఐదు నుంచి పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు)లో చదువుతున్నా. నేను ఐదో తరగతి నుంచి మా అక్కలతో కలిసి సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేదాన్ని. రైస్‌మిల్లులో సంచులు కుట్టడం, తవుడు ఎత్తడం వంటి పనులు చేశాను. పీడీ మేడం చొరవతో ... నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఎవరైనా ఆటలాడుతుంటే అక్కడే ఉండిపోయేదాన్ని. గురుకుల పాఠశాలకు వచ్చిన తర్వాత మా సీనియర్స్ ఖో ఖో అడుతుంటే.. ఒక్కొక్కరి ఆటను దగ్గరుండి గమనించేదాన్ని. ఒకరోజు మా పీడీ మేడమ్ అరుణారెడ్డి వచ్చి ‘ఏం చూస్తావ్.. నీవు ఆడవా’ అని అడిగారు. ఆ తర్వాత నుంచి మేడమ్‌తో మంచి చనువు ఏర్పడింది. మెల్లమెల్లగా నా దృష్టిని వాలీబాల్ వైపు మళ్లించారామె. ఉదయం ఐదు నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టేవారు. ఓటమితో మొదలు.. 2016లో మండల స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత ఆటపై మరింత దృష్టి సారించా. మహబూబ్‌నగర్‌లో అండర్ 14 విభాగంలో జరిగిన ఎస్జీఎఫ్ ఎంపికల్లో జిల్లా జట్టుకు ఎంపికయ్యా. ఆ తర్వాత భద్రాచలంలో అసోసియేషన్ మీట్ జరిగింది. ఇందులో సెలెక్ట్ కాలేకపోయా. నాలో నిరుత్సాహం అలుముకుంది. అక్కడి నుంచే మేడంకి ఫోన్ చేశా. ఇక నేను వాలీబాల్ ఆడనని! కానీ.. ఆమె నాకు ఎక్కడలేని ధైర్యాన్ని నూరిపోశారు. ఆమె సూచనతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. అప్పటి నుంచి నేను మానసికంగా బలంగా తయారయ్యా. మెళకువలు నేర్చుకున్నా. అనంతరం సబ్ జూనియర్స్ విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచా. చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో సెమీఫైనల్ వరకు వెళ్లాం. అలా టెన్నిస్, వాలీబాల్, బీచ్ వాలీబాల్‌తోపాటు రగ్బీ క్రీడలో సైతం రాణించా. అయితే కోవిడ్ విజృంభణతో రెండేళ్లుగా ఆటల పోటీలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మా మేడమ్ ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌పై ఆన్లైన్ ద్వారా క్లాస్ తీసుకునే వారు. వాలీబాల్ ఆట నుంచి నా దృష్టి మరలకుండా శిక్షణ ఇచ్చేవారు. పాస్‌పోర్టు ఇతరత్రా ఖర్చులు కూడా ఆమే భరించారు. మా పీడీ మేడమ్ చొరవ, ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయుల ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయి వరకు వచ్చాను. నేను వారిని ఎన్నటికీ మరిచిపోలేను. ఏషియన్ పోటీలకు ప్రాతినిధ్యం మరువలేను.. ప్రస్తుతం నేను ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. వార్షిక పరీక్షల సమయంలోనే జాతీయ స్థాయి ఎంపికలు జరిగాయి. ఏప్రిల్ 6న భువనేశ్వర్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 225 మందికి ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో 32 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత ఇందులో నుంచి 20 మందిని ఎంపిక చేసి జూన్ రెండో తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఇందులో నుంచి 12 మందిని ఎంపిక చేశారు. ప్రధాన జట్టు ఆరుగురిలో నేను ఒకరిగా నిలవడం.. మనదేశం తరఫున అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా జన్మలో మరచిపోలేని సంఘటన. థాయిలాండ్ లో 14వ ఏషియన్ జూనియర్ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పూల్–బీలో పటిష్ట జట్లు అయిన జపాన్, చైనాతోపాటు భారత్ ఉంది. మేము గెలిచింది ఒక మ్యాచ్‌లోనే అయినా... వివిధ జట్ల క్రీడాకారిణుల ఆటను దగ్గరుండి చూశాను. ఆటను మరింత మెరుగుపరుచుకుని జాతీయ స్థాయి సీనియర్స్ జట్టుకు ఎంపిక కావడమే తొలి లక్ష్యంగా పెట్టుకున్నా. ఐపీఎస్ సాధించడమే నా ఆశయం’’ అన్నారు శాంతకుమారి. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే.. బాలానగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) విద్యార్థినులు మొదటి నుంచి చదువుతోపాటు ఆటల్లోనూ ముందున్నారు. రగ్బీలో రాష్ట్ర స్థాయిలో మా స్కూల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. జట్టు గోల్డ్‌మెడల్ గెలుచుకుంది. కాట్రావత్ శాంతకుమారికి క్రీడలంటే చాలా ఇష్టం. వాలీబాల్‌లో ఆమె రాణిస్తుందనే నమ్మకంతో ఆ క్రీడవైపు మళ్లించా. ఎలాంటి ఆధునిక వసతులు లేని చోటు నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణం. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే ఆమె ఈ స్థాయికి వచ్చింది. – ఎం.అరుణారెడ్డి, పీడీ, బాలానగర్ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) ఐదు వందలకు అమ్మాలనుకున్నాం! మాకు మొదటి ముగ్గురూ ఆడపిల్లలే. నాలుగో సంతానం కూడా ఆడ పిల్లే. అప్పుడే మా గుడిసెలు తగలబడ్డాయి. దీంతో నాలుగో కూతుర్ని అమ్మాలని మా పెద్దలు నిర్ణయానికి వచ్చారు. రూ.500కు గిరాకీ కూడా తీసుకొచ్చారు. కానీ మాకు మనసు ఒప్పలే. ఏ కష్టం చేసైనా సరే. మా బిడ్డల్ని మేమే సాకుతాం అని చెప్పినం. ఉన్న దాంట్లో తింటున్నం. సదివిస్తున్నం. పెళ్లిళ్లు చేసినం.. మా బిడ్డ గొప్ప క్రీడాకారిణిగా ఎదుగుతాంటే గర్వంగా ఉంది. – కె. భామిని, అమృనాయక్, శాంతకుమారి తల్లిదండ్రులు – కిషోర్ కుమార్, పెరుమాండ్ల, (సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్) ఫొటోలు: భాస్కరాచారి, (సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్) -
కొమ్ముల్ని కనిపెట్టలేకపోవడం.. నాట్ ఎ గుడ్ లీడర్షిప్
ఉమన్ లీడర్స్ స్ట్రాంగ్‌గా ఉంటారు కానీ స్ట్రాంగ్‌గా కనిపించాలని అనుకోరు. పరిచయాలు ఉంటాయి కానీ ప్రయోజనాలకు ఉపయోగించుకోరు. నేనెంత ఇస్తున్నాను అనే కానీ నాకెంత వస్తోందన్నది చూసుకోరు. అయితే ఈ ధోరణిని కాస్తయినా మార్చుకోవాలని యూరోపియన్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు సలహా ఇస్తున్నారు! టీమ్‌వర్క్‌లో ‘నడిపించడం’ మెయిన్ వర్క్. నెట్‌వర్క్‌లో ‘కలుపుకుంటూ నడిపించడం’ మేజర్ వర్క్. నడిపించడానికైనా, కలుపుకుంటూ నడిపించడానికైనా ఒక హెడ్డు ఉండాలి. ఆ హెడ్డుకు రెండు కొమ్ములు ఉండాలి. అవొచ్చేం కుమ్మేయవు. కుమ్మేయకపోయినా, కుమ్మేస్తాయేమోనన్న భయం టీమ్ మెంబర్స్ కడుపులో ఉండాలి. అందుకోసమైనా ఆ హెడ్డు తలపై కొమ్ములుండాలి.చిన్నపాటి టీమ్‌నైనా మేనేజ్ చెయ్యడం పెద్ద పని. నలుగురు సభ్యులున్న టీమ్‌లో కూడా ఒక డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు. ఒక కిమ్‌జోంగ్ ఉన్ ఉంటాడు. ఒక లష్కరే తోయిబన్ ఉంటాడు. పైకి కనిపించని ఒక ముష్కరుడు ఉంటాడు. వీళ్లతో పని చేయించాలి. వీళ్ల వల్ల çపని చెడకుండానూ చూసుకోవాలి. కొమ్ములుంటేనే ఇది సాధ్యం. మరి కొమ్ముల్లేని మనిషైతే? లేకపోవడం ఉండదు. కొమ్ములున్న మనిషే దేవుడి ఆఫీస్‌లోనైనా టీమ్ లీడర్ అవుతాడు. ఒకవేళ కొమ్ముల్తో పనేముందని ఎవరైనా చిరునవ్వుతో వచ్చి చైర్లో కూర్చుంటే, వెంటనే టీమ్‌లోని వాళ్లకు కొమ్ములొచ్చి, చైర్లో ఉన్న చిరునవ్వును పొడవడానికి వస్తాయి. కనుక కొమ్ములున్న హెడ్డునే కంపెనీలు ప్రిఫర్ చేస్తుంటాయి. టీమ్నంతటినీ పూటకోసారైనా గుంపుగా నిలబెట్టి పెద్దగా అరిచేయడం, ఫైర్ చేసి పడేస్తానని ఫైల్స్, వాటర్ బాటిల్స్ విసిరిగొట్టడం, గాజుబల్ల మీద దబీదబీమని పిడిగుద్దులు గుద్దడం, పైవాళ్ల నిఘా నీడలో ఉన్నారని బెదరించడం, టీమ్‌లోనే ఒకరి మీద ఒకర్ని నిఘాకు పెట్టడం.. ఇంత ఉంటుంది ఒక టాస్క్ పూర్తవడానికి! టాస్క్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయ్యాక హెడ్డుకు పేరొస్తుంది. టీమ్‌వర్క్ నుంచి.. టీమ్‌లను నడిపించే నెట్వర్క్ హెడ్డుగా కొమ్ముల కీర్తి కిరీటం లభిస్తుంది. టీమ్ చేత తిన్నగా ఒక చిన్న పనినైనా చేయించడం వెనుక ఇంత కృషి, క్రుంగుబాటు ఉంటాయి కనుకే ఈ కొమ్ముల ఫీల్డులో కీర్తి కిరీటధారణ వరకు ఎదుగుతూ వెళ్లే మహిళా టీమ్ లీడర్స్ చాలా తక్కువమంది కనిపిస్తుంటారు. ఏ? అంటే.. కొమ్ములు పెట్టుకునొచ్చి క్యాబిన్లో కూర్చోవడం వాళ్లకు ఇష్టం ఉండదు. ఏ? అంటే.. కొమ్ములు మనుషులక్కాదు కదా ఉండేది అని వారి సందేహం. ‘మరి ఎప్పుడు ఎదుగుతావ్ మహిళా?’ అంటే.. వర్క్ కదా ఎదగాల్సింది. ఉమన్‌గా నేను కాదు కదా’ అని ఆమె సమాధానం! ‘ఓకే దెన్. వర్క్ ఎదగాలన్నా, రెండు పెట్టుడు కొమ్ములైనా ఉండాలి కదా’.. అంటే.. ‘నేనూ వారితో కలిసి పనిచేస్తాను. కలిసి పనిచేసేటప్పుడు కొమ్ములు అడ్డుపడకూడదు కదా’ అని ఆమె స్కూల్ ఆఫ్ థాట్. జర్మనీలోని ‘యూరోపియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఈఎస్‌బీ) ఇటీవల 37 మంది హై–ప్రొఫైల్ ఉమన్ లీడర్స్‌ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలాగే.. ‘కొమ్ములెందుకు?’ అని ఆ లీడర్స్ క్వశ్చన్ చేశారు. వాళ్లంతా జర్మనీలోని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలలో పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నవారు. పెద్ద పొజిషనే కానీ, పెద్ద సంఖ్యేం కాదు. మగ సీఈవోలు, సీఎఫ్‌వోలతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువ.. ఎంత పెద్ద దేశంలోనైనా. ఉన్న ఈ కొద్దిమందికైనా కొమ్ములెందుకు లేవని ఈఎస్‌బీ ఎనలైజ్ చేసింది. ఆ ముప్పై ఏడు మంది ఇచ్చిన సమాధానాలను బట్టి జరిగిన ఎనాలిసిస్ అది. ఉమన్ లీడర్స్ స్ట్రాంగ్‌గా ఉంటారు కానీ స్ట్రాంగ్‌గా కనిపించాలని అనుకోరు. పరిచయాలు ఉంటాయి కానీ ప్రయోజనాలకు ఉపయోగించుకోరు. ముందున్న పని మీదే ధ్యాస ఉంటుంది తప్ప, వెనకేం జరుగుతోందన్నది పట్టించుకోరు. ప్రొఫెషనల్‌గా గొప్ప టాలెంట్ ఉంటుంది కానీ, ఉందని చెప్పుకోరు. ఎబౌ ఆల్.. నేనెంత ఇస్తున్నాను అనే కానీ, నాకెంత వస్తోందన్నది చూసుకోరు. ఇదీ ఈఎస్‌బీ రిపోర్ట్. అందుకే వాళ్లు పెద్దగా అరిచి ఫైల్స్ విసిరికొట్టడం లేదు. వాటర్ బాటిల్స్‌ని ఎత్తిపడేయడం లేదు. బల్లలపై పిడికిళ్లు బిగించడం లేదు. ట్రంప్‌లు, కిమ్‌లు, లష్కరేలు, ముష్కరేలు.. టీమ్‌లో ఎవరున్నా.. పనిని సాఫ్ట్‌గా నడిపించేస్తున్నారు. ‘అయినప్పటికీ మహిళలు కొంచెం మారాలి’ అని ఈఎస్‌బీ రిపోర్ట్ సజెస్ట్ చేస్తోంది. మారడం అంటే.. టీమ్‌ని నడిపిస్తున్నప్పుడు.. ముందే కాదు, కాస్త వెనుకా చూసుకుంటూ ఉండటం. లేకుంటే ఏ కొమ్మో వచ్చి పొడిచేస్తే ఎలా అని. ఇండియ ఉమన్ క్రికెట్ టీమ్‌లో ఇప్పుడు జరిగిందదే! రెండు మ్యాచుల్లో టీమ్‌లోంచి స్టార్ ప్లేయర్ మిథాలీరాజ్‌ని డ్రాప్ చేసిన తర్వాత ఆ మహిళా టీమ్‌లో ఎవరూ ప్రశాంతంగా లేరు. టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. ఆమెకేం గొడవ లేదు మిథాలీతో. సెలక్టర్ సుధా షా. ఆమెకేం గొడవలేదు మిథాలీతో. టీమ్ మేనేజర్ తృప్తి భట్టాచార్య. ఆమెకేం గొడవలేదు మిథాలీతో. బి.సి.సి.ఐ. సభ్యురాలు డయానా ఎడుల్జీ. ఆమెకేం గొడవ లేదు మిథాలీతో. మరి మిడిల్ ఆఫ్ ది రోడ్.. మిథాలీ ఎందుకు డ్రాప్ కావలసి వచ్చింది? ఎందుకంటే వెనుక నుంచి రెండు కొమ్ములొచ్చి పొడిచాయి. ఆ కొమ్ములు కోచ్ రమేశ్ పొవార్వి! పొడిచింది కోచ్ అయినా, డీఫేమ్ అయింది టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్. అందుకే ఉమన్ టీమ్ లీడర్స్ క్రికెట్లోనే కాదు, కార్పొరేట్ వరల్డ్‌లోనూ కొమ్ముల్ని కనిపెట్టి ఉండాలి. లీడర్‌కి కొమ్ములు లేకపోవడం మంచి విషయమే. కొమ్ముల్ని కనిపెట్టలేకపోవడం మాత్రం.. నాట్ ఎ గుడ్ లీడర్షిప్. - మాధవ్ శింగరాజు -
అబ్బాయిలకు నాలుగు.. అమ్మాయిలకు ఐదు
ముగిసిన చెస్ ఒలింపియాడ్ * హరికృష్ణ, విదిత్, తానియాలకు చేజారిన కాంస్యాలు * ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌కు అమ్మాయిల జట్టు అర్హత బాకు (అజర్బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఈసారి భారత పురుషుల, మహిళల జట్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశాయి. అయితే మూడు కాంస్య పతకాలు గెల్చుకునే అవకాశాన్ని భారత క్రీడాకారులు త్రుటిలో చేజార్చుకున్నారు. పురుషుల విభాగంలో పెంటేల హరికృష్ణ, ఆధిబన్, సేతురామన్, విదిత్ సంతోష్ గుజరాతి, మురళీ కార్తికేయన్‌లతో కూడిన భారత జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానాన్ని సంపాదించింది. ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, బొడ్డ ప్రత్యూషలతో కూడిన భారత మహిళల జట్టు 16 పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. టాప్-5లో నిలిచినందున భారత మహిళల జట్టు వచ్చే ఏడాది మేలో రష్యాలో జరిగే ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. 2014లో జరిగిన ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు తొలిసారి కాంస్య పతకాన్ని సాధించింది. కార్ల్‌సన్‌ను నిలువరించిన హరికృష్ణ నార్వే జట్టుతో జరిగిన చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ను భారత్ 2-2తో ‘డ్రా’ చేసుకుంది. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో జరిగిన గేమ్‌ను హైదరాబాద్ ప్లేయర్ హరికృష్ణ 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోవడం విశేషం. హ్యామర్‌తో జరిగిన గేమ్‌ను ఆధిబన్ 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించగా... విదిత్ 45 ఎత్తుల్లో ఆర్యన్ తారిని ఓడించాడు. అయితే ఫ్రోడ్ ఉర్కెడాల్‌తో జరిగిన గేమ్‌లో సేతురామన్ 25 ఎత్తుల్లో ఓడిపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఓవరాల్‌గా భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో రెండింటిలో ఓడిపోయింది. ‘డ్రా’తో ముగించిన అమ్మాయిలు అమెరికా జట్టుతో జరిగిన చివరిదైన 11వ రౌండ్ మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2-2తో ‘డ్రా’గా ముగించింది. ఇరీనా క్రుష్‌తో జరిగిన గేమ్‌ను హారిక 38 ఎత్తుల్లో... కాటరీనా నెమ్‌కోవాతో జరిగిన గేమ్‌ను సౌమ్య 94 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. తానియా 78 ఎత్తుల్లో అనా జటోన్‌స్కీని ఓడించగా... పద్మిని రౌత్ 40 ఎత్తుల్లో నాజి పైకిడ్‌జి చేతిలో ఓడిపోవడంతో భారత్ ‘డ్రా’తో సంతృప్తి పడింది. ఓవరాల్‌గా భారత్ ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని, అజర్బైజాన్ చేతిలో మాత్రమే ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయింది. చేరువై... దూరమై... ఇక వ్యక్తిగత విభాగాల ప్రదర్శను పరిగణనలోకి తీసుకుంటే... పురుషుల విభాగంలో పెంటేల హరికృష్ణ బోర్డు-1పై 5.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, బోర్డు-3పై విదిత్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో... మహిళల విభాగంలో తానియా బోర్డు-3పై 7 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను త్రుటిలో కోల్పోయారు. టాప్-3లో నిలిచినవారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. అమెరికా, చైనాలకు స్వర్ణాలు పురుషుల విభాగంలో అమెరికా జట్టు 20 పాయింట్లతో స్వర్ణం సాధించగా...ఉక్రెయిన్, రష్యా, రజత కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. మహిళల విభాగంలో చైనా 20 పాయింట్లతో పసిడి పతకాన్ని కై వసం చేసుకోగా... పోలాండ్, ఉక్రెయిన్ రజత, కాంస్య పతకాలను సంపాదించాయి. 2018 చెస్ ఒలింపియాడ్‌కు జార్జియా ఆతిథ్యం ఇస్తుంది.


