ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు. తద్వారా టీమిండియాకు కీలక వికెట్ దక్కడంలో తన వంతు పాత్ర పోషించాడు.
అయితే, బంతిని ఒడిసిపట్టే క్రమంలో శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. దీంతో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువైతే అయ్యర్ రూపంలో కీలక బ్యాటర్ సేవలను టీమిండియా కోల్పోతుంది.
మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా.. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా శనివారం నాటి నామమాత్రపు మూడో వన్డేలోనూ టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్‌కు దిగింది.
ఆసీస్ ఓపెనర్లు కెప్టెన్ మిచెల్ మార్ష్ (41), ట్రవిస్ హెడ్ (29) రాణించగా.. మాథ్యూ షార్ట్ 30 పరుగులు చేయగలిగాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా అర్ధ శతకం (56)తో మెరవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో ఆసీస్ 34వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన భారత పేసర్ హర్షిత్ రాణా.. గంటకు 134.1 కిలోమీటర్ల వేగంతో అవుట్ సైడాఫ్ దిశగా నాలుగో బంతిని సంధించగా.. క్యారీ మిడాఫ్/ ఎక్స్‌ట్రా కవర్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.
ఇంతలో బ్యాక్‌వర్డ్ పాయింగ్ నుంచి పరిగెత్తుకు వచ్చిన శ్రేయస్ అయ్యర్ డైవ్ కొట్టి మరీ సూపర్‌మేన్‌లా క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు గాయపడ్డాడు. నడుముకు ఎడమవైపు కిందిభాగంలో నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలోనే పడుకుండిపోయాడు.
సహచర ఆటగాళ్లు వచ్చి శ్రేయస్‌ను పరామర్శించగా.. ఫిజియో వచ్చి తీసుకువెళ్లాడు. ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో ఆసీస్ 236 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఆసీస్‌తో రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకం (61)తో మెరిసిన విషయం తెలిసిందే.
Shreyas SUPERMAN Iyer! 💪
Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy— Star Sports (@StarSportsIndia) October 25, 2025


