
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి వెన్ను గాయం మళ్లీ తిరగబెట్టింది. ఫిట్‌నెస్ సమస్యలతో దాదాపు 12 నెలలు పాటు జట్టుకు దూరంగా ఉన్న గ్రీన్.. ఈ ఏడాది ఆగస్టులో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో పునరాగమనం చేశాడు.
తన రీ ఎంట్రీలో కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే అతడు కొనసాగాడు. అయితే వైట్‌బాల్ క్రికెట్‌లో మళ్లీ బౌలింగ్ ప్రారంభించడానికి గ్రీన్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతడికి వెన్ను నొప్పి తిరగబెట్టింది. దీంతో టీమిండియాతో వన్డే సిరీస్‌కు అతడిని సెలక్టర్లు పక్కన పెట్టారు.
మార్నస్ వచ్చేశాడు..
ఇక గ్రీన్ స్ధానాన్ని స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత్‌తో వన్డేలకు తొలుత లబుషేన్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే ఇటీవల షెఫీల్డ్ షీల్డ్, డొమెస్టిక్ వన్డే టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ప్రదర్శన కనబరుస్తుండంతో ఆసీస్ సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.
లబుషేన్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా వన్డే కప్‌లో ఇప్పటి వరకు 3 మూడు మ్యాచ్‌లు ఆడిన లబుషేన్.. 237 పరుగులు సాధించాడు. అందులో 2 శతకాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కుడిచేతి బ్యాటర్ ఇప్పటివరకు 66 వన్డేలు ఆడి, 1,871 పరుగులు సాధించాడు. అయితే గతేడాది నుంచి అతడు వన్డేల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
2024 నుంచి లబుషేన్ 12 ఇన్నింగ్స్‌లలో కేవలం 241 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. భారత్‌తో తొలి వన్డేకు జంపా, ఇంగ్లిష్ కూడా దూరమయ్యారు. అయితే వీరిద్దరూ ఆఖరి రెండు వన్డేల్లో ఆడే అవకాశముంది. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ఆసీస్-భారత్ జట్లు తలపడనున్నాయి.
భారత్‌తో వన్డేలకు ఆసీస్ జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, లబుషేన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్
చదవండి: అఫ్గాన్ చేతిలో వైట్ వాష్.. బంగ్లాదేశ్ క్రికెటర్ల వాహనాలపై దాడి!