
తూముకుంటలోని నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ఢిల్లీ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 529 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 256/3తో ఆట కొనసాగించిన జట్టు గురువారం మరో 68 ఓవర్లు ఆడి 273 పరుగులు జోడించింది.
సీవీ మిలింద్ 3 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ బ్యాటర్లలో సనత్ సాంగ్వాన్ (470 బంతుల్లో 211 నాటౌట్; 21 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుశ్ దొసెజా (279 బంతుల్లో 209; 25 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతమైన డబుల్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ హైదరాబాద్ బౌలర్లను ఉతికారేశారు. ఆయుశ్ ఔటైనప్పటికి సనత్ మాత్రం ఆజేయంగా నిలిచాడు.
అనంతరం హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు సాధించింది. రాహుల్ సింగ్ (35) అవుట్ కాగా... తన్మయ్ అగర్వాల్ (27 బ్యాటింగ్), అనికేత్ రెడ్డి (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్