
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. తొలి బ్యాచ్‌లో భాగంగా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తదితరులు కంగారూ దేశానికి బయల్దేరారు.
వీరితో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ కూడా ఢిల్లీ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. ఆ సమయంలో కొంత మంది సహాయక సిబ్బంది కూడా ఆటగాళ్ల వెంట ఉన్నారు.
Team India off to Australia ✈️ pic.twitter.com/FCpqxYjTSI
— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025
గంభీర్ లేకుండానే..
అయితే, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ లేకుండానే తొలి బ్యాచ్‌తో వెళ్లడం లేదు. రెండో బ్యాచ్‌తో కలిసి అతడు సాయంత్రం ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నట్లు సమాచారం. ఇక టీమ్ బస్‌లో రోహిత్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో కూర్చోగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Virat Kohli with Team India at Airport left for Australia. pic.twitter.com/ZJ6Wb80hPC
— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025
కాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టులను 2-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. అక్టోబరు 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ మొదలుపెట్టనుంది. ఈ సిరీస్‌కు ముందే వన్డే సారథిగా రోహిత్‌ను తప్పించిన బీసీసీఐ.. గిల్‌కు కెప్టెన్సీ అప్పగించింది.
కెప్టెన్సీ మార్పు వెనుక
ఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు వెనుక గంభీర్ హస్తం ఉందనే విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్- కోహ్లి చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడారు. ఈ మెగా టోర్నీలో టీమిండియాను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు.
ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత టీమిండియా తరఫున రో- కో తొలిసారి ఆస్ట్రేలియాతో వన్డేల సందర్భంగా బరిలోకి దిగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న ఈ ఇద్దరు కంగారూ గడ్డపై సత్తా చాటాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడతారా?
కాగా 37 ఏళ్ల రోహిత్, 36 ఏళ్ల కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2027లో ఆడతారో లేదోనని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే, పూర్తి ఫిట్‌గా ఉన్న ఈ ఇద్దరు తప్పక మెగా టోర్నీ ఆడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అదే సమయంలో.. వీరిద్దరి విషయంలో మేనేజ్‌మెంట్ వైఖరిపైనా సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ
— Ro³ (@45__rohan) October 15, 2025