
ఇటీవలే ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) గెలిచిన టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపనుంది. అక్టోబరు నెల మొత్తం భారత క్రికెట్ జట్టు ఆటలో తలమునకలు కానుంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ మొదలుపెట్టిన టీమిండియా.. తొలి మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించి జయభేరి మెగించింది.
ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టుకు అక్టోబరు 10- 14 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు బయల్దేరనుంది. అక్టోబరు 15వ తేదీనే గిల్ సేన భారత్ నుంచి ఆసీస్‌కు పయనం కానున్నట్లు సమాచారం.
టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!
అయితే, అంతకంటే ముందు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) టీమిండియాకు తన నివాసంలో డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసీస్ టూర్‌కు ముందు... వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుబ్‌మన్ గిల్‌ను కొత్త సారథిగా ఎంపిక చేసింది.
అయితే, రోహిత్‌ను ఓపెనర్‌గా జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్- హెడ్‌కోచ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసే దిగ్గజ కెప్టెన్‌పై వేటు వేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..
ఈ నేపథ్యంలో భారత జట్టు కంటే ముందే రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఓ రోజు ముందుగానే ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో గంభీర్.. గిల్ సేనకు ఢిల్లీలోని తన ఇంట్లో పార్టీ ఇచ్చేందుకు సిద్ధం కావడం మరోసారి సందేహాలకు తావిచ్చింది. రో-కోలకు గంభీర్‌తో సఖ్యత చెడిందనే గుసగుసలు మరోసారి గుప్పుమంటున్నాయి.
కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తొలుత మూడు వన్డేల సిరీస్.. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత్- ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు టీమిండియా
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.