
ఏడాది విరామం తర్వాత వన్డేల్లో బరిలోకి
లబుషేన్‌పై వేటు
భారత్‌తో సిరీస్‌లకు ఆస్ట్రేలియా జట్ల ప్రకటన
మెల్‌బోర్న్: ఆ్రస్టేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్... టీమిండియాతో జరిగే వన్డే సిరీస్ బరిలో దిగనున్నాడు. ఇటీవల అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్క్... దాదాపు ఏడాది తర్వాత వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. గతేడాది నవంబర్‌లో పాకిస్తాన్‌తో చివరిసారి వన్డే ఆడిన స్టార్క్... తిరిగి ఇప్పుడు టీమిండియాతో సిరీస్‌లో పాల్గొననున్నాడు. యాషెస్ సిరీస్‌కు ముందు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా స్టార్క్ పలు అప్ర«దాన్య మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.
ఈ నెల 19 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుండగా... దీంతో పాటు టి20 సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల కోసం మంగళవారం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) జట్లను ప్రకటించింది. గత పది ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయని లబుషేన్‌పై వేటు పడగా... అతని స్థానంలో రెన్‌షాకు తొలిసారి చోటు దక్కింది. 29 ఏళ్ల రెన్‌షా 14 టెస్టుల్లో ఆ్రస్టేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని కలిసొస్తే భారత్‌పై రెన్‌షా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశముంది.
మరోవైపు రెగ్యులర్ సారథి ప్యాట్ కమిన్స్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో మిచెల్ మార్ష్ సారథిగా కొనసాగనున్నాడు. ఈ నెల 19న జరగనున్న తొలి వన్డేకు పెర్త్ ఆతిథ్యమిస్తుండగా... ఆ తర్వాత 23న అడిలైడ్‌లో, 25న సిడ్నీలో రెండో, మూడో మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 మధ్య టి20 సిరీస్ జరుగుతుంది.
ఆ్రస్టేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), బార్ట్‌లెట్, కేరీ, కొనొల్లీ, డ్వార్‌షుయ్, ఎలీస్, గ్రీన్, జోష్ హాజల్‌వుడ్, హెడ్, ఇన్‌గ్లిస్, ఓవెన్, రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
టి20 జట్టు (తొలి రెండు మ్యాచ్‌లకు): మిచెల్ మార్ష్ (కెప్టెన్), అబాట్, బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, డ్వార్‌షుయ్, ఎలీస్, హాజల్‌వుడ్, హెడ్, ఇన్‌గ్లిస్, కూనెమన్, ఓవెన్, షార్ట్, స్టొయినిస్, జంపా.