ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) చరిత్ర సృష్టించాడు. ఆసీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. టీమిండియాతో శనివారం నాటి మూడో వన్డే (IND vs AUS 3rd ODI) సందర్భంగా హెడ్ ఈ ఘనత సాధించాడు.
స్వదేశంలో ఆస్ట్రేలియా భారత్‌తో మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న కంగారూలు.. సిడ్నీ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనూ శుభారంభం అందుకున్నారు.
వన్డేల్లో మూడు వేల పరుగుల క్లబ్‌లో
సిడ్నీ గ్రౌండ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. కెప్టెన్, ఓపెనర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh)తో కలిసి ట్రావిస్ హెడ్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 22 పరుగుల (20 బంతుల్లో) వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ వన్డేల్లో మూడు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.
స్మిత్ రికార్డు బ్రేక్
కాగా ఆసీస్ తరఫున హెడ్‌కు ఇది 76వ ఇన్నింగ్స్. తద్వారా తక్కువ ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆసీస్ క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ సాధించిన రికార్డును హెడ్ తాజాగా బద్దలు కొట్టాడు. స్మిత్ 79 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధిస్తే.. హెడ్ 76 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.
అంతేకాదు.. అతితక్కువ బంతుల్లో వన్డేల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ల జాబితాలో హెడ్ ఈ సందర్భంగా చోటు సంపాదించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 2839 బంతుల్లో మూడువేల పరుగుల మార్కును అందుకున్నాడు.
సిరాజ్ బౌలింగ్‌లో..
ఇక ఆసీస్ ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ బంతితో రంగంలోకి దిగగా.. హెడ్.. ఫోర్‌తో అతడికి స్వాగతం పలికాడు. అయితే, రెండో బంతికే సిరాజ్ అతడిని పెవిలియన్‌కు పంపి ప్రతీకారం తీర్చుకున్నాడు.
సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన హెడ్.. బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. ఈ క్రమంలో ప్రసిద్ కృష్ణ క్యాచ్ అందుకోవడంతో టీమిండియాకు ‘హెడేక్’ తప్పింది.
Much needed! 💪
Just as the opening stand was starting to look dangerous, #MohammadSiraj gets #TravisHead! 👏🇮🇳#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/Kimj8efFnZ— Star Sports (@StarSportsIndia) October 25, 2025
25 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసిన హెడ్ మరో బౌండరీ బాదే క్రమంలో అవుటయ్యాడు. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. 15 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. మార్ష్ 41, మాథ్యూ షార్ట్ 10 పరుగులతో క్రీజులో నిలిచారు.
ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో మూడు వేల పరుగులు సాధించిన క్రికెటర్లు
🏏ట్రావిస్ హెడ్- 76 ఇన్నింగ్స్‌లో
🏏స్టీవ్ స్మిత్- 79 ఇన్నింగ్స్‌లో
🏏మైఖేల్ బేవాన్/జార్జ్ బెయిలీ- 80 ఇన్నింగ్స్‌లో
🏏డేవిడ్ వార్నర్- 81 ఇన్నింగ్స్‌లో
వన్డేల్లో తక్కువ బంతుల్లోనే 3 వేల పరుగుల క్లబ్‌లో చేరిన క్రికెటర్లు
🏏గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)- 2440 బంతుల్లో
🏏జోస్ బట్లర్ (ఇంగ్లండ్)- 2533 బంతుల్లో
🏏జేసన్ రాయ్ (ఇంగ్లండ్)- 2820 బంతుల్లో
🏏ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)- 2839 బంతుల్లో
🏏జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్)- 2842 బంతుల్లో.
చదవండి: అవమాన భారంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్


