అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లి (Virat Kohli) తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) తర్వాత యాభై ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.
ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా.. కుమార్ సంగక్కరను అధిగమించి కోహ్లి ఈ ఘనత సాధించాడు. అంతేకాదు అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే పద్నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించిన ఆటగాడిగానూ కోహ్లి నిలిచాడు.
వరుసగా డకౌట్లు
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో డకౌట్ అయిన ఈ దిగ్గజ బ్యాటర్.. అడిలైడ్ వన్డేలోనూ ఇదే పునరావృతం చేశాడు.
ఈ క్రమంలో భారీ అంచనాలు, ఒత్తిడి నడుమ సిడ్నీ వన్డే బరిలో దిగిన కోహ్లి వింటేజ్ కింగ్‌ను గుర్తు చేశాడు. నెమ్మదిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా ఆ తర్వాత జోరు పెంచరీ అర్ధ శతకం సాధించాడు. వన్డే కెరీర్‌లో 75 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో కోహ్లి 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.
తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ గెలుపు
శతకధీరుడు ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్)తో కలిసి 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సిడ్నీ వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకుంది.
అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు
🏏సచిన్ టెండుల్కర్ (ఇండియా)- 452 ఇన్నింగ్స్‌లో 18426 పరుగులు
🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 293* ఇన్నింగ్స్‌లో 14235 పరుగులు
🏏కుమార్ సంగక్కర (శ్రీలంక)- 380 ఇన్నింగ్స్‌లో 14234 పరుగులు
🏏రిక్కీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 365 ఇన్నింగ్స్‌లో 13704 పరుగులు
🏏సనత్ జయసూర్య (శ్రీలంక)- 433 ఇన్నింగ్స్‌లో 13430 పరుగులు
Hence proved: 𝘚𝘢𝘣𝘳 𝘬𝘢 𝘱𝘩𝘢𝘭 𝘩𝘶𝘮𝘦𝘴𝘩𝘢 𝘮𝘦𝘦𝘵𝘩𝘢 𝘩𝘰𝘵𝘢 𝘩𝘢𝘪! 🙌
👉 Virat Kohli's 75th ODI fifty
👉 His 70th 50+ score in ODI run chases - most by any batter
👉 Completes 2500 runs against AUS in ODIs#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉… pic.twitter.com/Mw6oU1cNzk— Star Sports (@StarSportsIndia) October 25, 2025


