టీమిండియాతో మూడో వన్డేకు ముందు ఆస్ట్రేలియా జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను జట్టు నుంచి సెలక్టర్లు రిలీజ్ చేశారు. కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరం కావడంతో లబుషేన్‌ను ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ రెండు వన్డేలకు కూడా అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు.
ఇప్పుడు నామమాత్రపు మ్యాచ్‌కు మందుకు జట్టు నుంచి తప్పించడంతో.. లబుషేన్ తిరిగి డొమాస్టిక్ క్రికెట్‌లో క్వీన్స్‌ల్యాండ్ తరపున ఆడేందుకు వెళ్లనున్నాడు. ఇక ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్, స్పిన్నర్ మాట్ కుహ్నెమాన్‌లను జట్టులోకి చేర్చారు. మూడో వన్డేకు స్టార్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.
మాక్సీ వచ్చేశాడు..
ఇక భారత్‌తో ఆఖరి మూడు టీ20లకు కూడా తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. తొలి రెండు టీ20లకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోపోయిన స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్.. రీ ఎంట్రీకి సిద్దమయ్యాడు. ఆసీస్ సెలక్టర్లు తాజాగా ప్రకటించిన జట్టులో మాక్సీ ఉన్నాడు. అదేవిధంగా యువ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మహ్లి బియర్డ్‌మాన్‌కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.
20 ఏళ్ల మహ్లి బియర్డ్‌మాన్ గతేడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో అతడు 10 వికెట్లు పడగొట్టి.. ఆసీస్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌తో జరిగిన ఫైనల్‌లో అతడు మూడు వికెట్లు సాధించాడు. అంతేకాకుండా దేశీయ క్రికెట్‌లో మెరుగ్గా రాణించాడు. ఈ క్రమంలోనే అతడికి తొలిసారి ఆసీస్ జట్టులో చోటు దక్కింది. ఇక చివరి మూడు టీ20లకు సీనియర్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్దానంలోనే బియర్డ్‌మాన్ ఛాన్స్ లభించింది.
భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్ (గేమ్స్ 1-3), జేవియర్ బార్ట్‌లెట్, మహ్లి బియర్డ్‌మాన్ (గేమ్స్ 3-5), టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్ (గేమ్స్ 4-5), నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్ (గేమ్స్ 1-2), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్ (గేమ్స్ 3-5), మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
ఆస్ట్రేలియా వన్డే జట్టు (మూడవ మ్యాచ్): మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కోనోలీ, జాక్ ఎడ్వర్డ్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
చదవండి: IND vs AUS: అతడే ఉంటే కథ వేరేలా ఉండేది.. గంభీర్ ఇకనైనా మారవా?


