breaking news
ananth singh
-
'బాహుబలి' కూతురి పెళ్లి.. నాలుగు లక్షల మందికి అతిథి భోజనం!
పాట్నా: బిహార్ రాజకీయాలు, వివాదాస్పదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ‘బాహుబలి’ నాయకుడు, ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఆయన కూతురు శివాంగి సింగ్ వివాహం అత్యంత వైభవంగా, భారీ ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వివాహ వేడుకకు వచ్చే అతిథుల సంఖ్య ఏకంగా నాలుగు లక్షలు దాటనుందని అంచనా వేస్తుండటంతో ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.అనంత్ సింగ్ చిన్న కుమార్తె శివాంగి సింగ్ వివాహం రిషికేష్ కుమార్‌తో నవంబర్ 25వ తేదీన జరగనుంది. వీరి వివాహం బిహార్‌లోని పాట్నా జిల్లాలోని వారి సొంత గ్రామమైన లద్మా (నద్వాన్) లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పెళ్లి వేడుకల కోసం దాదాపు 10 బిగాల విశాలమైన స్థలంలో భారీ టెంట్లు, విదేశీ పూలతో కూడిన అలంకరణలు సిద్ధం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణులైన డిజైనర్లతో ఈ భారీ పందిళ్లను నిర్మిస్తున్నారు.నాలుగు లక్షల మందికి భోజన ఏర్పాట్లు.. 150 రకాల వంటకాలుఈ పెళ్లి వేడుకకు వచ్చే అతిథుల కోసం భారీ స్థాయిలో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకంగా 4 లక్షల మందికి పైగా అతిథులు హాజరవుతారని అంచనా వేస్తూ ఆ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అతిథుల కోసం బిహారీ సాంప్రదాయ వంటకాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 150 రకాల రుచికరమైన వంటకాలు, ప్రసిద్ధ నలంద సిలావో ఖాజా వంటి ప్రత్యేక మిఠాయిలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పీఎం మోదీ నుంచి లాలూ వరకు ఈ వివాహ వేడుకను రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్నట్లు అనంత్ సింగ్ స్పష్టం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ వంటి దిగ్గజ రాజకీయ నాయకులందరికీ ఈ పెళ్లికి ఆహ్వానాలు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, ఈ వివాహానికి భారత్ -పాకిస్థాన్ ఎక్కడి నుంచైనా సరే ఎవరైనా అతిథులుగా రావచ్చునని, అందరికీ సాదర స్వాగతం అని అనంత్ సింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం.సినీ తారలు దిగి వచ్చిన వేళ రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్, భోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం ఈ వివాహ వేడుకలో సందడి చేయనున్నారు. భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్, అక్షరా సింగ్, మనోజ్ తివారీ, మోస్ట్ పాపులర్ సింగర్ మైథిలీ ఠాకూర్‌తో పాటు బాలీవుడ్ నటుడు సోనూ సూద్, ఉదిత్ నారాయణ్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే వివాహ వేడుకలో భాగంగా ప్రత్యేకంగా గుర్పు పందెం నిర్వహించనుండగా, విజేతలకు లగ్జరీ ఎస్యూవీ కార్లు, బైక్‌లను బహుమతులుగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.మరోవైపు, ఈ భారీ పెళ్లి వేడుకల వెనుక కొన్ని సీరియస్ లీగల్ సవాళ్లు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూతురి పెళ్లి ముగిసిన వెంటనే ఆయన కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతున్న ఈ వెడ్డింగ్ బిహార్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. -
జేడీయూలో కలకలం.. ఎమ్మెల్యే దంపతులపై వేటు
పట్నా: పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే ఎంతటి నేతలైనా చర్యలు ఎదుర్కోవాల్సిందేనని బీహార్‌లోని జేడీయూ స్పష్టం చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే అనంత్ సింగ్, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే నీలమ్ దేవిలను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి జన్‌సురాజ్ పార్టీ తరఫున ప్రచారం చేయడం, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, పార్టీ ఆదేశాలను ఉల్లంఘించడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేడీయూ బీహార్ విభాగం అధ్యక్షుడు ఉమేశ్ సింగ్ కుష్వాహా వెల్లడించారు.అనంత్ సింగ్, నీలమ్ దేవిల ప్రాథమిక సభ్యత్వాలను తక్షణమే రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. అంతటితో ఆగకుండా అనంత్ సింగ్ శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. దీంతో పార్టీ నుంచి బహిష్కరణతోపాటు ఎమ్మెల్యే పదవిపై కూడా చర్చ మొదలైంది. ఈ పరిణామం నితీశ్ కుమార్ సైతం తలనొప్పిగా మారినట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంతో వివాదంఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అనంత్ సింగ్ దంపతులు ప్రత్యర్థి జన్‌సురాజ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని జేడీయూ నాయకత్వం ఆరోపిస్తోంది. అదే సమయంలో పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అధిష్ఠానం ఆదేశాలను పాటించకపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించినట్లు ఉమేశ్ సింగ్ కుష్వాహా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారిద్దరిపై ఆరేళ్ల బహిష్కరణ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. ముకామా అసెంబ్లీ నియోజకవర్గంలో అనంత్ సింగ్ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. 1990 నుంచి ఈ నియోజకవర్గంలో ఆయన కుటుంబం దాదాపుగా వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. దీంతో స్థానిక రాజకీయాల్లో ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. అలాంటి నేపథ్యం ఉన్న ఎమ్మెల్యే అనంత్ సింగ్, ఆయన భార్య నీలమ్ దేవిలను జేడీయూ ఆరేళ్లపాటు బహిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: పాక్ వల్లే ‘కశ్మీర్’ సజీవం -
ఎమ్మెల్యే ఇంట్లో సీబీఐ సోదాలు
బీహార్‌కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంట్లో సీబీఐ బృందం సోదాలు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం అనంత సింగ్ అధికారిక నివాసంలో సోదాలు చేసిందని పోలీసులు చెప్పారు. ఆయన ప్రస్తుతం ఓ కిడ్నాప్ - హత్య కేసులో జైల్లో ఉన్నారు. ఆయన ఇంట్లో సోదాలకు వచ్చేముందు సీబీఐ బృందం అనంత్ సింగ్‌ను జైల్లో ప్రశ్నించింది. సీబీఐ బృందం స్థానిక పోలీసులను సాయం కోరడంతో.. సీనియర్ ఎస్పీ వికాస్ వైభవ్ ఆ బృందానికి తమ సిబ్బందిని తోడుగా పంపారు. అయితే.. కిడ్నాప్ - హత్య కేసుకు, సీబీఐ సోదాలకు సంబంధం లేదు. అక్రమంగా కాంట్రాక్టులు ఇప్పించడంలోను, దోపిడీ రాకెట్ నడిపించడంలోను ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల మీద సీబీఐ విచారణ జరుపుతోంది. బీహార్‌లో శక్తిమంతమైన భూమిహార్ వర్గానికి చెందిన అనంత్ సింగ్.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితుడని చెబుతారు. ఆయనపై డజన్లకొద్దీ క్రిమినల్ కేసులున్నాయి. వాటిలో చాలా హత్య, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి.


