జ్ఞానేశ్ కుమార్‌తో భేటీ.. కాంగ్రెస్‌ను నిలదీసిన బీజేపీ | CEC Gyanesh Kumars photo with Congress MLA Ajay Singh sparks row | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్ కుమార్‌తో భేటీ.. కాంగ్రెస్‌ను నిలదీసిన బీజేపీ

Nov 26 2026 9:01 AM | Updated on Nov 26 2026 9:01 AM

CEC Gyanesh Kumars photo with Congress MLA Ajay Singh sparks row

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే అజయ్ సింగ్ దిగిన ఫొటోలు రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించింది. నవంబర్ 23న భోపాల్‌లో జరిగిన ఓ ప్రైవేటు వివాహ వేడుకకు జ్ఞానేశ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ సింగ్ ఆయనను కలిశారు. అనంతరం ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను అజయ్ సింగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ బహిరంగంగా విమర్శలు చేస్తున్న సమయంలో, అదే పార్టీకి చెందిన సీనియర్ నేత ఆయనతో కలిసి ఫొటోలు దిగడాన్ని బీజేపీ ప్రశ్నించింది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర స్థాయి నాయకులకు మధ్య వైఖరిలో వ్యత్యాసం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి దుర్గేశ్ కేస్వానీ విమర్శించారు. 
రాహుల్ గాంధీ సీఈసీని విమర్శిస్తుంటే, ఆయన పార్టీ నేతలు మాత్రం జ్ఞానేశ్ కుమార్‌తో సమావేశమై ఫొటోలు సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఈ ఫొటోలతో వాస్తవాలు స్పష్టమయ్యాయని వ్యాఖ్యానించారు.

అజయ్ సింగ్ మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అర్జున్ సింగ్ కుమారుడైన ఆయన 'రాహుల్ భయ్యా'గా ప్రసిద్ధి చెందారు. అయితే, వివాహ వేడుకలో సీఈసీతో ఆయన భేటీ మర్యాదపూర్వకమైనదేనని, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని తెలియవచ్చింది.

ఇదీ చదవండి: 2027 యూపీ ఎన్నికలు: మాయావతివైపు కాంగ్రెస్ చూపు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement