రాజమౌళి సినిమాలో చేయాలని ఉంది‌: మానస వారణాసి | Sakshi Interview With Femina Miss India World 2020 Manasa Varanasi | Sakshi
Sakshi News home page

ఐ లవ్‌ ఛాలెంజెస్‌: మానసా వారణాసి

Feb 19 2021 12:39 AM | Updated on Feb 19 2021 7:06 PM

Sakshi Interview With Femina Miss India World 2020 Manasa Varanasi

మానసా వారణాసి

ఫెమినా మిస్‌ ఇండియా కిరీటంతో అందరి హృదయాలను గెలుచుకొని మిస్‌ వరల్డ్‌ కోసం అడుగులు వేస్తున్న తెలుగమ్మాయి మానస వారణాసి. నగరానికి విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించిన మానస తనకంటూ ఉన్న కొన్ని ప్రత్యేకమైన అభిరుచులు, ఇష్టాలను షేర్‌ చేసుకున్నారు.

► ముందుగా మీలో మీకు బాగా నచ్చే లక్షణం?
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ప్రశాంతంగా ఉంటేనే ఎదైనా సాధించగలం.

► మీలో నచ్చనిది..?
లేజీనెస్‌...! చేయవలసిన పనులను ఎక్కు వగా వాయిదా వేస్తుంటాను.

► ఇష్టమైన ఫుడ్‌..?
పూర్తిగా వెజిటేరియన్‌ని. వెజిటేరియన్‌లో ఎదైనా సరే ఇష్టంగా తింటాను. ముఖ్యంగా పులిహోరా నా ఫేవరెట్‌.

► నచ్చిన సినిమాలు..?
తెలుగులో బాహుబలి, వేరే బాషల్లో అయితే ఇంటర్‌స్టెల్లర్‌.

► ఇష్టపడే ఫిల్మ్‌ స్టార్స్‌...?
ఆయుష్‌ ఖురానా, ప్రియాంక చోప్రా.

► నచ్చిన కలర్‌..?
ఫైర్‌ రెడ్‌.

► ఎలాంటి డ్రెస్సింగ్‌ని ఇష్టపడతారు...?
ఇండియన్‌ వేర్‌.  

► పెర్‌ఫ్యూమ్స్‌...?
కొరియాండర్, లావెండర్‌ ఫ్లేవర్స్‌..

► నచ్చే పుస్తకం..?
లిటిల్‌ ప్రిన్స్‌

► ఎలాంటి గేమ్స్‌ ఇష్టం..?
మెదడుకు పనిపెట్టేవి.

► నచ్చిన ప్లేస్‌?
ఎవ్వరినైనా ఆహ్వానించే సుగుణం ఉన్న హైదరాబాద్‌ నగరం.

► ఇష్టమైన వాహనం?
కంఫర్ట్‌గా ఉండే ఏ కారైనా ఇష్టమే.

► ఇష్టమైన పనులు...?
సేవ చేయడం. ఆల్రెడీ కొన్ని ఎన్‌జీవోలతో కలిసి వాలంటీర్‌గా పని చేసాను.

► మోడలింగ్‌లోకి రాకుండా ఉంటే..?
యోగా ట్రైనర్‌ని అయ్యేదానిని.

► హబీస్‌...?
పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. పాటలు కూడా పాడతాను.

► ఫిట్‌నెస్‌కు సంబంధించిని నియమాలు?
రెండేళ్లుగా క్రమం తప్పకుండా యెగా చేస్తున్నాను. కానీ డైట్‌ మాత్రం పాటించను. మా అమ్మమ్మ చేసిన వంటకాలేవీ వదలను.

► మీ సక్సెస్‌ మంత్ర?
ఎమోషనల్‌గా, స్ప్రిచ్యువల్‌గా బ్యాలెన్స్‌డ్‌ గా ఉంటాను. అప్పుడే జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయని నమ్ముతాను. ఎప్పుడూ కొత్తదనాన్ని ఆస్వాదిస్తాను. ప్రతి పనిలో గతం కంటే ఉన్నతంగా ఉండేలా కష్టపడుతాను. గోల్స్‌ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. అప్పుడే మనం చేసే పనులు ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఐ లవ్‌ చాలెంజెస్‌.

► సినిమాల్లో అవకాకాశాలు వస్తే ..?
ప్రస్తుతం నా ధ్యాస అంతా మిస్‌ వరల్డ్‌ పైనే. రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేయాలని ఉంది.

– హనుమాద్రి శ్రీకాంత్, సాక్షి, హైదరాబాద్‌
ఫొటో: ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement