మానస మనసులో మాటలు | Actress Manasa Varanasi about lifestyle | Sakshi
Sakshi News home page

మానస మనసులో మాటలు

Mar 29 2026 2:03 AM | Updated on Mar 29 2026 2:03 AM

Actress Manasa Varanasi about lifestyle

హైదరాబాద్‌ మట్టిలో మొదలైన నటి మానస వారణాసి అడుగు ప్రపంచ వేదికపై నడిచే వరకు చేరుకుంది. అలా కోడింగ్‌ నుంచి మిస్‌ ఇండియా కిరీటం వరకూ సాగిన ప్రయాణంలోని మెరుపు వెనుక ఉన్న విశేషాలు ఆమె మాటల్లోనే...

నా ప్రపంచం రెండు దేశాల మధ్య
నేను హైదరాబాద్‌ అమ్మాయినే. అయితే నా బాల్యం అంతా మలేషియాలో గడిచింది. కౌలాలంపూర్‌లో గ్లోబల్‌ ఇండియన్  ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదివాను. నేనొక యావరేజ్‌ స్టూడెంట్‌నే కాని, ఫ్రెంచ్‌లో మాత్రం ఎప్పుడూ టాప్‌.

కోడింగ్‌ నుంచి కిరీటం
ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత నేను ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌గా పని చేశాను. ఒకవైపు సాఫ్ట్‌వేర్‌ కోడింగ్, మరోవైపు మోడలింగ్‌ అలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే అందాల పోటీలో విజయం సాధించాను.

కళ్లతో వింటాను
సైన్  లాంగ్వేజ్‌ అంటే నాకు ఆసక్తి. అలా నేనే ఇండియన్  సైన్  లాంగ్వేజ్‌ నేర్చుకున్నాను. ‘వినడం’ అంటే కేవలం చెవులతోనే కాదు, కళ్లతో కూడా వినొచ్చని అప్పుడు అర్థమైంది. అలాగే, లాక్‌డౌన్ లో నేర్చుకున్న  ఎంబ్రాయిడరీ నాకు ఓపికను నేర్పింది.

నా బలం నా కుటుంబం
మా అమ్మ, నాయనమ్మ, నా చెల్లి మేఘనా ఈ ముగ్గురు మహిళలే నా బలం. వాళ్లే నాకు నిజమైన ప్రేరణ. సినిమాల్లో అయితే హాలీవుడ్‌లో ఎమ్మా స్టోన్, ప్రియాంక చోప్రా నాకు ఇన్ స్పిరేషన్ .

అభిరుచులు! 
రోజులో ఒక్క పూటైనా అన్నం లేకపోతే నాకు కడుపు నిండదు. స్వీట్స్‌లో తిరామిసు, ఫ్రూట్‌ పుడ్డింగ్‌ అంటే ఇష్టం. దుస్తుల్లో ఫైరీ రెడ్‌ రంగు నాకు బాగా నప్పుతుంది. సెంట్స్‌లో చెర్రీ బ్లోసమ్, పెస్టో వాసనలు నన్ను రిఫ్రెష్‌ చేస్తాయి.

సెల్ఫ్‌ బిలీఫ్‌
మిస్‌ ఇండియా 2020 సమయంలో పాండమిక్‌ కారణంగా చాలా భాగం ఆన్‌లైన్ లో జరిగింది. అప్పుడు నాకు నేనే మేకప్‌ ఆర్టిస్ట్, కెమెరాపర్సన్ , కోచ్‌. నాపై నాకు ఉన్న నమ్మకంతో ఆ సమయంలో నా సేవింగ్స్‌ అంతా ఖర్చు చేశాను. అదే నన్ను సినిమాల్లోకి తీసుకువచ్చింది.

సంగీతం నా మరో స్వరం
ఫ్రీ టైమ్‌ దొరికితే నేను సంగీతంలో మునిగిపోతాను. కాలేజీలో ‘నైన్  డేస్‌’ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌లో మెంబర్‌ని. స్టేజ్‌పై పాడడం నాకు మరో ఎనర్జీ ఇస్తుంది. అలాగే, యోగా, మ్యూజిక్, పేజెంట్స్‌ ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ నా భయాలను నేనే ఓడించాను.

‘మీన్  గర్ల్‌’ మోడ్‌లోకి మారుతున్నా
ఇప్పుడిప్పుడే  కొంచెం ‘మీన్  గర్ల్‌’లా ఉండడం ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ఎందుకంటే ‘నో’ అనడం కూడా జీవితంలో చాలా అవసరం.

Advertisement
 
Advertisement
Advertisement