హీరోయిన్లు సినిమాలు చేయడం కాదు అదృష్టం కూడా కలిసి రావాలి.
అలా హీరోయిన్‌గా పరిచయమైన మానస వారణాసికి.. లక్ అందినట్లే చేజారిపోయింది.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మానస వారణాసి.. తాజాగా 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో వచ్చింది.
ఈ శుక్రవారం (నవంబర్ 22) థియేటర్లలో మూవీ రిలీజ్ కాగా.. పాజిటివ్ టాక్ రాలేదు.
దీంతో హిట్ కోసం మానస.. మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పని పరిస్థితి.
ఎందుకంటే 2020లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచింది.
ఎన్నో ఆశలతో టాలీవుడ్‌లోకి వచ్చింది. తొలి అవకాశం దక్కించుకుంది.
అయితే తొలి సినిమాలో అభినయం, గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. కానీ అది సరిపోలేదు.
ప్రస్తుతం 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ చేస్తోంది. సంతోశ్ శోభన్ హీరో. మరి దీనితోనైనా హిట్ దక్కుతుందేమో చూడాలి?


