దీప్‌వీర్‌ బిడ్డను చూసేందుకు తరలివెళ్లిన అంబానీ | Mukesh Ambani went to meet Deepika and Ranveer newborn daughter | Sakshi
Sakshi News home page

దీప్‌వీర్‌ బిడ్డను చూసేందుకు తరలివెళ్లిన అంబానీ

Sep 10 2024 5:15 PM | Updated on Sep 10 2024 5:15 PM

Mukesh Ambani went to meet Deepika and Ranveer newborn daughter

బాలీవుడ్‌ నటులు రణ్‌వీర్‌ సింగ్‌,  దీపికా పదుకోన్‌ దంపతులకు  ఇటీవల (సెప్టెంబర్ 8)న ఆడబిడ్డ  పుట్టింది. ఈ నేపథ్యంలో పలువురుబాలీవుడ్‌ పెద్దలు, ఇతర సెలబ్రిటీలకు ఈజంటకు అభినందనలు అందించారు. మరికొంతమంది స్వయంగా హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి వెళ్లి రణ్‌వీర్‌, దీపిక తొలి సంతానాన్ని ఆశీర్వదించారు. 

అలాగే దీపికా, రణ్‌వీర్‌ దంపతులతో సన్నిహిత సంబంధాలున్న, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భారీ భద్రత  మధ్య  దక్షిణ ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. రణ్‌వీర్‌, దీపికకు అభినందనలు తెలిపారు. వారి ముద్దుల తనయను ఆశీర్వదించారు.

 కాగా  బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ బాలీవుడ్‌తో  సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు.  అంబానీ ఇంట ఏ పండుగ, ఏ వేడుక జరిగిన బాలీవుడ్‌ పెద్దలంతా అక్కడ హాజరు కావాల్సిందే.  అనంత్‌, రాధిక  ఎంగేజ్‌మెంట్‌,  ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు మొదలు, మొన్న అంగరంగ  వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో బాలీవుడ్‌ అతిరథ మహారథులంతా తరలి వచ్చారు. అయితే గర్భంతో ఉన్న నేపథ్యంలో దీపికా రాలేకపోయినప్పటికీ,  రణ్‌వీర్‌   అనంత్ , రాధిక  వివాహ వేడుకల్లో ప్రత్యేక  డ్యాన్స్‌తో అలరించారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement