
‘రామ్-లీలా’ సినిమాలో ప్రియాంక చోప్రా ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ‘రామ్ చాహే లీలా’ అంటూ సాగే ఆ పాట అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సినిమా విజయంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ క్లిప్‌ని షేర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అప్పటి జ్ఞాపకాలను పంచుకుంది.
‘ఈ ప్రత్యేక పాట కోసం దర్శకుడు సంజయ్ లీలా నన్ను సంప్రదించినప్పుడు ‘నేను చేయగలనా’ అనుకున్నాను. కష్టంగానే ఆ పాటకు ఓకే చెప్పాను. సెట్‌లో దర్శకుడు నాకు బాగా ధైర్యం చెప్పాడు. పాటలోని ప్రతి పదానికి అర్థం వివరిస్తూ..హావభావాల దగ్గర నుంచి డ్యాన్స్ మూమెంట్స్ వరకూ సలహాలిచ్చారు. కొరియోగ్రాఫర్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. లంచ్ బ్రేక్ టైంలో కూడా డ్యాన్స్ మూమెంట్స్ గురించి వివరించేవాడు. కష్టంగా ఒకే చెప్పినా..నాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ గుర్తుంటాయి’ అని ప్రియాంక ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
రామ్-లీలా సినిమా విషయానికొస్తే.. 2013లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రణ్‌వీర్-దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వం వహించాడు. గ్యాంగ్‌స్టర్ కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రేమికుల చుట్టు తిరిగే కథ ఇది.