'ధురందర్' లాంటి హిట్ తర్వాత శంకర్ తోనా? | After Dhurandhar Success Is Ranveer Singh Team Up With Director Shankar For Velpari Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Ranveer Singh: ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్.. ఇదైనా సెట్ అవుతుందా?

Jan 31 2026 7:23 AM | Updated on Jan 31 2026 10:23 AM

Is Ranveer Singh Opts Director Shankar Velpari Movie

రీసెంట్ టైంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా 'ధురందర్'. రణ్‌వీర్ సింగ్ ఇమేజీని అమాంతం పెంచేసింది. ఇతడికి తొలిసారి వందల కోట్ల కలెక్షన్స్ అంటే ఏంటో చూపించింది. ఇప్పటివరకు ఓ లెక్క ఇకనుంచి ఓ లెక్క. దీంతో తర్వాత చేసే సినిమాల విషయంలో రణ్‌వీర్ ఆచితూచి వ్యవహరించబోతున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. కానీ డైరెక్టర్ శంకర్ కొత్త మూవీలో ఇతడు ఓ హీరోగా నటించనున్నాడనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దర్శకుడు శంకర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు. జెంటిల్మెన్‌, బాయ్స్‌, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, రోబో, రోబో 2, ఐ, ఇండియన్‌ 2, గేమ్ ఛేంజర్ తదితర సినిమాలు చేశాడు. అయితే గత రెండు మూడు మూవీస్ చూస్తే.. ఈయన ట్రాక్ రికార్డ్ ఘోరంగా మారింది. చేసిన సినిమాలు చేసినట్లు ఘోరంగా ఫ్లాప్ అ‍య్యాయి. దీంతో శంకర్ నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేస్తాడా అని అందరూ అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ)

గతంలో శంకర్ మాట్లాడుతూ.. తనకు వేల్పరి అనే డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందని చెప్పుకొచ్చాడు. చారిత్రక నేపథ్య కథాంశంతో దీన్ని తెరకెక్కించాల్సి ఉంది. ఇప్పుడు దాన్ని తీయబోతున్నాడని సమాచారం వినిపిస్తోంది. ముంబైకి చెందిన పెన్‌ స్టూడియో సంస్థ దీన్ని నిర్మించనున్నట్లు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని, ఇందులో తమిళ హీరో చియాన్‌ విక్రమ్‌, బాలీవుడ్‌ నటుడు రణవీర్‌సింగ్‌ నటించే అవకాశం ఉన్నట్లు రూమర్ అయితే వినిపిస్తుంది. ఇది ఎంత నిజమో చూడాలి?

రణ్‌వీర్ సింగ్‌తో 'అపరిచితుడు'ని హిందీలో రీమేక్ చేయాలని శంకర్ గతంలో అనుకున్నాడు. ప్రకటన కూడా చేశారు. అది అది అక్కడి వరకే పరిమితమైంది. ఇప‍్పుడు దాన్ని తీయకపోవచ్చు. మరోవైపు 'ధురందర్'తో రణ్‌వీర్ ఇమేజ్ పెరగ్గా.. వరస ఫ‍్లాపులతో శంకర్ గుర్తింపు బాగా పడిపోయింది. మరి వీరిద్దరూ ఇప్పుడు కలిసి పనిచేస్తారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement