
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) నటిస్తున్న చిత్రం 'ధురంధర్'.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లడఖ్ ప్రాంతంలో జరుగుతుంది. అయితే, తాజాగా ఈ చిత్ర యూనిట్ నుంచి సుమారు 100 మందకి పైగా ఆసుపత్రిపాలయ్యారు. వారందరూ లేహ్‌లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.
లడఖ్‌లోని లేహ్ జిల్లాలో కొద్దిరోజులుగా ధురంధర్ సినిమా షూటింగ్ జరుగుతుంది. సెట్స్‌లో పనిచేస్తున్న కార్మికులు ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. అకస్మాత్తుగా సెట్‌లోని చాలా మందికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వచ్చింది. వారిని లేహ్‌లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స అందించిన వైద్యులు ఇది సామూహిక ఫుడ్ పాయిజనింగ్ కేసుగా గుర్తించారు. సినిమా సెట్స్‌లో దాదాపు 600 మంది భోజనం చేశారని అక్కడి వారు చెబుతున్నారు. అయితే, కొందరు మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుని విచారిస్తున్నారు.

దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ‘ధురంధర్’ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇదే ఏడాది డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.