రణ్‌వీర్‌ దశావతార్‌ | Sakshi
Sakshi News home page

రణ్‌వీర్‌ దశావతార్‌

Published Sun, Mar 3 2024 12:22 AM

Artist Paumil Khatri Draws Ranveer Singh Multiple Film Characters Simultaneously - Sakshi

వైరల్‌

తమ అభిమాన హీరో బొమ్మ గీసి ముచ్చటపడే అభిమానులు మనకు కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ అభిమాని పౌమిల్‌ కత్రి వినూత్న  శైలితో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రకరకాల స్కెచ్‌లు ఉన్న పరికరంతో కాన్వాస్‌పై ఒకే సమయంలో వివిధ సినిమాలలోని రణ్‌వీర్‌ క్యారెక్టర్లను గీసి నెటిజనులను ఆశ్చర్యచకితుల్ని చేశాడు.

‘మేడ్‌ 10 స్కెచెస్‌ ఆఫ్‌ రణ్‌వీర్‌సింగ్‌ ఎట్‌ ఏ సేమ్‌ టైమ్‌’ కాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ఎనిమిది మిలియన్‌లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసి  ముచ్చటపడిన రణ్‌వీర్‌సింగ్‌ పౌమిల్‌ను ప్రశంసిస్తూ  కామెంట్‌ పెట్టడం మరో విశేషం. ఇక టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌  పౌమిల్‌ కత్రి విషయానికి వస్తే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన కత్రికి ఇన్‌స్టాగ్రామ్‌లో వందలాదిమంది ఫాల్‌వర్స్‌ ఉన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement