breaking news
multiple
-
తారాపథంలో కాసుల వేట
సినిమా స్టార్స్‌కి ఆదాయం ఎలా వస్తుంది? అంటే వెంటనే రెమ్యూనరేషన్ ద్వారా అని ఠక్కున చెప్పేసే రోజులు కావివి. యాడ్స్, ప్రమోషన్స్, ఈవెంట్స్... అంటూ వరుసపెట్టి లెక్కించే రోజులు. ‘ఇందుగల దందు లేదను సందేహంబు వలదు ఎందెందు చూసినా అందందే కలదు’ అన్నట్టుగా తారలకు ఆదాయ మార్గాలు ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలోనైతే కాదేదీ కాసుల వేటకు అనర్హం అన్నట్టుగా అది తారా స్థాయికి చేరుకుంది. వరుసగా ‘యాడ్’ చేసుకుంటూ... ఒకప్పుడు హీరో, హీరోయిన్‌కి సినిమా ఒప్పందం కుదిరితే అందులోనే పారితోషికం ప్రధానంగా ఉండేది. ఏడాదికి కొన్ని సినిమాలు.. వాటి ద్వారా వచ్చే రెమ్యూనరేషన్‌ను మాత్రమే ప్రధాన ఆదాయంగా భావించేవారు. కానీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ షారుక్‌ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, దీపికా పదుకోన్ వంటి వారు రూ. 5 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ వసూలు చేస్తున్నారు. ఇలా సినిమాలు దాటి అడ్వర్టయిజ్మెంట్లలోకి తారలు రావడంతో సినిమాలకు ఆవల తారలకు ఆదాయం మొదలైంది. అక్కడ నుంచి ఒక్కొక్కటిగా ఆదాయ మార్గాలు పెరుగుతూ పోయాయి. ఈవెంట్... స్టార్ వెంటే... ‘‘ఐదేళ్ల పాటు ఒక సినిమాకు సైన్ చేయడం వల్ల అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈవెంట్లు నాకు బాగా ఉపయోగపడ్డాయి’’ అంటూ ఇటీవల ఒక టాలీవుడ్ నటి మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే... ఇప్పుడు స్టార్స్ జీవితంలో ఈవెంట్స్ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓ మోస్తరు స్థాయి కలిగిన నటి/నటుడికైనా సరే షోరూమ్స్ ఓపెనింగ్స్ అనేవి రూ.లక్షల్లో ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ వంటి వారైతే రూ .3 కోట్లకు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారట. స్టార్... అంబాసిడర్... సాధారణ ప్రకటనలతో పాటు ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాలు కూడా తారలకు పెద్ద ఆదాయ మార్గంగా మారాయి. దుస్తులు, నగలు, వాచీలు, కార్లు, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్, ఫుడ్ బ్రాండ్లు.. ప్రతీ ఉత్పత్తీ స్టార్ ఇమేజ్ను ఉపయోగించుకోవాలని ఆరాటపడడం తారలకు పైసా వసూల్‌గా మారింది. కేవలం ప్రకటనలో నటించడం మాత్రమే కాదు. కంపెనీ కార్యక్రమానికి హాజరవడం, కొత్త షోరూమ్ ప్రారంభించడం, ఉత్పత్తిని సోషల్ మీడియాలో చూపించడం, బ్రాండ్ ఈవెంట్లో మాట్లాడటం... ఇలా ఒప్పందం ఆధారంగా అంబాసిడర్ సేవలకు తగ్గట్టుగా స్టార్స్‌కు పారితోషికం అందుతోంది. ఇది ఓ రకంగా ఏడాదికోసారి అందే జీతం లాంటిదని చెప్పోచ్చు. ఈ తరహా ఒప్పందాల కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ రూ. 15 కోట్ల వరకూ వసూలు చేస్తారని సమాచారం. హోస్ట్... ఆదాయానికి బెస్ట్... సినిమా కాకుండా టెలివిజన్, ఓటీటీ కూడా తారలకు మరో ఆదాయ వేదికగా అమరిపోయింది. కౌన్ బనేగా కరోర్ పతి అంటూ అమితాబ్ అరంగేట్రం చేయించిన స్టార్ ఆధారిత గేమ్ షోలు ఇప్పుడు స్టార్స్‌ని కోటీశ్వరుల్ని చేస్తున్నాయి. టాక్ షోలు, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించడం, వెబ్ సిరీస్‌లకు హోస్టింగ్ చేయడం... ఒక్కో కార్యక్రమానికి వేర్వేరుగా ప్రత్యేక పారితోషికం అందుతోంది. ప్రస్తుతం అన్ని భాషల్లో హల్ చల్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఈ తరహా స్టార్ ఆధారిత కార్యక్రమాలకు బెస్ట్ ఎగ్జాంపుల్. హిందీ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ ఒక్క ఎపిసోడ్‌కే రూ. 10 నుంచి 15 కోట్ల వరకూ అందుకుంటున్నారని అంచనా. స్టార్ కనిపిస్తే చాలు సినిమా షూటింగ్లో కాకుండా ఒక వివాహ వేడుకలో, కార్పొరేట్ ఈవెంట్లో, షోరూమ్ ప్రారంభోత్సవంలో లేదా అవార్డు కార్యక్రమంలో కనిపించడం కూడా ఇప్పుడు స్టార్లకు పెద్ద ఆదాయమే. టాప్ బాలీవుడ్ స్టార్స్ ప్రైవేట్ ఈవెంట్లలో కనిపించడానికి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారు. అక్కడ ఆ స్టార్ ఉండటం వల్ల ఆ కార్యక్రమానికి వచ్చే ప్రచారం, సోషల్ మీడియా రీచ్, ఫొటోలు, వీడియోలు, బ్రాండ్‌కు లభించే గుర్తింపు కూడా ΄్యాకేజీలో భాగమే. పలువురు సంపన్నుల వివాహ వేడుకల్లో కనిపించడానికి ఇంత, నర్తించడానికి ఇంత, గెస్ట్‌లతో పిచ్చాపాటీకి ఇంత... చొప్పున కూడా స్టార్స్ అందుకుంటున్నారు. సోషల్ మీడియా... సెలబ్రిటీకి వేరయా... అనేక మందిని సెలబ్రిటీలుగా మార్చిన ఘనత సోషల్ మీడియాదే అనడం నిస్సందేహం. అలాగే సెలబ్రిటీలను మరింత ధనవంతులుగా మారుస్తోన్న పుణ్యం కూడా దానిదే అని చెప్పాలి. తారలకు అందే ఆదాయ అవకాశాలకు ఆకాశమే హద్దు అన్నట్టుగా అన్ని రకాల బం«ధనాల్ని తెంచేసింది డిజిటల్ ప్రపంచం. సోషల్ మీడియా విప్లవంతో స్టార్‌కి ఉన్న ఫాలోయింగ్ ఒక ఆస్తిగా మారింది. ఒక ప్రముఖ సెలబ్రిటీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బ్రాండ్‌ను ప్రస్తావిస్తే లక్షలాది మంది కళ్లముందు ఆ ఉత్పత్తి కనిపిస్తుంది. స్టార్‌కి ఉన్న ‘రీచ్’ను కంపెనీలు భారీగా కొనుగోలు చేస్తున్నాయి.కొన్ని మార్కెట్ అంచనాల ప్రకారం టాప్ సెలబ్రిటీల ఒక్కో స్పాన్సర్డ్ ఇన్స్టాగ్రామ్ పోస్టుకు కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటో, రీల్ లేదా బ్రాండ్ ప్రస్తావన చేయడం ద్వారా స్టార్ కొన్ని కోట్లు సంపాదించవచ్చు. స్టాటిక్ పోస్టు, స్టోరీ, రీల్, బ్రాండ్‌తో కొలాబరేషన్... ఒక్కో ఫార్మాట్‌కి ఒక్కో రేటు ఉంటుంది.పెద్ద ఫాలోయింగ్‌తో పాటు ఎంగేజ్మెంట్ ఎక్కువగా ఉన్న సెలబ్రిటీకి మరింత విలువ ఉంటుంది. కేవలం ఒక్క ఇన్‌స్టా పోస్ట్ ద్వారానే ప్రియాంక చో ప్రా రూ .3 నుంచి 4 కోట్ల వరకూ అందుకుంటుందని సమాచారం. ఒక స్టార్‌కి 5 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే, ఆ సంఖ్యను కంపెనీ తన ఉత్పత్తిని ప్రచారం చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా డిజిటల్ రీచ్, ఎంగేజ్మెంట్, అభిమానుల ఆదరణ కూడా స్టార్ పారితోషికాన్ని నిర్ణయించే అంశాలుగా మారాయి.ఎడ్వర్టయిజ్మెంట్ నుంచి ఎమోషన్ దాకా... ‘‘మీ అభిమాన హీరో/హీరోయిన్‌తో మీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించుకోవాలనుకుంటున్నారా?’’ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు వ్యాపారంగా మారింది. ట్రూ ఫ్యాన్, సెలెవిష్, ఫ్యాన్ బజ్ వంటి ΄్లాట్ఫామ్ల ద్వారా సెలబ్రిటీల నుంచి వ్యక్తిగత వీడియో సందేశాలు, బర్త్‌డే విషెస్, యానివర్సరీ విషెస్, షౌట్ఔట్స్ వంటివి బుక్ చేసుకునే అవకాశం వచ్చేసింది. అంటే... కూర్చున్న చోట్నుంచి కదలకుండా స్టార్ అభిమానికి నేరుగా కనిపించడమే ఒక మోనిటైజేషన్ మోడల్‌గా మారింది. దీంతో ‘ఫ్యాన్ ఫాలోయింగ్’ అనే పదానికి కొత్త అర్థం వచ్చింది. ఒకప్పుడు అభిమానులు స్టార్ ఫొటోను కొనేవారు. ఇప్పుడు స్టార్ తమ పేరు చెప్పే వీడియోను కొనుగోలు చేస్తున్నారన్నమాట. ఆట చూడడం కూడా ఆదాయమే... తాజా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీకి మద్దతుగా మ్యాచ్‌కి వెళ్లిన బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ... ఆమె సాధారణంగా కనిపించే దుస్తులతో ఉన్నప్పటికీ ఆమె వైరల్ అయింది. దానికి కారణం ఆమె చేతికి పెట్టుకున్న అంతర్జాతీయ బ్రాండ్ కార్టియర్ పాంథేర్ వాచ్. ఆమె పెట్టుకున్న వాచ్‌కి సోషల్ మీడియాలో, ఫ్యాషన్ మీడియాలో విపరీతమైన ఆసక్తి వచ్చింది. ఆ వాచ్ విలువను కొన్ని నివేదికలు సుమారు రూ. 28 లక్షలుగా పేర్కొన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... అనుష్క ఈ వాచీ గురించి ఏ ప్రకటన కూడా చేయలేదు. కానీ ఆమె ధరించిన వస్తువు వార్తగా మారింది. ఇదే స్టార్ పవర్. ఒక సెలబ్రిటీ ఏం ధరిస్తే అది ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారుతుంది. అందుకే బ్రాండ్లు సెలబ్రిటీల ‘ఆర్గానిక్ విజిబిలిటీ’ కోసం కూడా పోటీ పడుతున్నాయి.పెళ్లి వీడియోలకూ ‘రేట్’ ఉంది... సెలబ్రిటీల పెళ్లిళ్లు, ఎంగేజ్మెంట్లు, హనీమూన్లు, కుటుంబ వేడుకలు ఇప్పుడు కేవలం వ్యక్తిగత వ్యవహారాలు మాత్రమే కావు. వాటికి భారీ ప్రేక్షక విలువ ఏర్పడింది. నయనతార–విఘ్నేష్ శివన్ పెళ్లికి సంబంధించిన చిత్రీకరణ హక్కులను ఓ ఓటీటీ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ మొత్తం సుమారు రూ. 25 కోట్లుగా ఉండొచ్చట. అదే క్రమంలో అనేకమంది సెలబ్రిటీలు తమ వివాహ వేడుకల ప్రసార హక్కుల్ని విక్రయిస్తున్నారు. అంటే ఒకప్పుడు ‘ఇది మా వ్యక్తిగత జీవితం’ అంటూ మీడియాకు దూరంగా ఉంచే విషయాలు కూడా ఇప్పుడు డాక్యుమెంటరీ, వెబ్ సిరీస్ లేదా ప్రత్యేక కంటెంట్‌గా మారి కోట్ల రూపాయల విలువను సంతరించుకుంటున్నాయి. స్టార్ అంటే... ఒక బ్రాండ్ ఇప్పటి స్టార్ కేవలం నటుడు కాదు. యాక్టర్ + ఇన్ఫ్లుయెన్సర్ + బ్రాండ్ అంబాసిడర్ + ఈవెంట్ గెస్ట్ + కంటెంట్ క్రియేటర్ + బిజినెస్ బ్రాండ్. సినిమా నుంచి వచ్చే పారితోషికం ఇప్పటికీ ప్రధాన ఆదాయమే. కానీ దాని చుట్టూ ఏర్పడిన ఈ కొత్త ఆదాయ మార్గాలు స్టార్ సంపాదనను మరింత విస్తరించాయి. అందుకే నేటి సినిమా మార్కెట్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మారిపోయింది. ‘ఈ స్టార్ ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారు?’ అనేది మాత్రమే కాదు... ‘ఈ స్టార్ పేరు, ఇమేజ్, ఫాలోయింగ్, వ్యక్తిగత జీవితానికి మార్కెట్లో ఎంత విలువ ఉంది?’ అనేదే అసలు ప్రశ్న. నిన్నటి వరకు స్టార్ తెరపై కనిపిస్తే నిర్మాత డబ్బు చెల్లించేవాడు. నేడు స్టార్ ఎక్కడ కనిపించినా.. ఆ కనిపించడానికే ఒక ధర చెల్లించడానికి నిర్మాతల్ని మించి ఎందరో ఉన్నారు..స్టార్... స్టార్టప్స్... సినిమా తారలు కేవలం నటులుగా కాకుండా తెలివైన పెట్టుబడిదారులుగా కూడా కనిపించాలని కోరుకుంటున్నారని పరిశ్రమ పరిశీలకులు చెబుతున్నారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఎదగడంతో బాలీవుడ్ తారలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే ధోరణి మరింత ఊపందుకుంది. ఈ ట్రెండ్ కొత్తది కాదు. 2010ల ప్రారంభంలోనే ఇది మొదలైంది. అప్పట్లో భారత స్టార్టప్ రంగం వేగంగా ఎదగడం ప్రారంభించింది.బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలి తరం సెలబ్రిటీ ఇన్వెస్టర్లలో ఒకరు. 2012లో ఆయన ట్రావెల్ పోర్టల్ యాత్రాలో మైనారిటీ వాటాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత పలువురు తారలు ఈ మార్గాన్ని అనుసరించారు. 2022లో ఒక్క ఏడాదిలోనే 14 మంది భారతీయ నటులు 18 స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. వీటిలో ఎక్కువ భాగం డైరెక్ట్–టు–కన్సూ్యమర్ (డి2సి) బ్రాండ్లే. మిగిలిన పెట్టుబడులు ఎడ్టెక్, ఈ–కామర్స్, ఫుడ్‌టెక్ వంటి రంగాల్లోకి వెళ్లాయి.సినిమాల్లో పెట్టుబడుల కన్నా... గతంలో చాలామంది నటులు తమ సంపాదనను ప్రధానంగా సినిమాలు, సినిమా నిర్మాణం వంటి రంగాల్లోనే పెట్టేవారు. అయితే సినిమా నిర్మాణం అధిక రిస్క్‌తో కూడిన వ్యాపారం కావడంతో కొందరు తారలు ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఈ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటున్న ఇప్పటి తరం సెలబ్రిటీలు మాత్రం తమ సంపదను ఒకే రంగంలో పెట్టకుండా విభజిస్తున్నారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సంప్రదాయ పెట్టుబడులతో పాటు స్టార్టప్ల్లోనూ డబ్బు పెడుతున్నారు. పెట్టుబడి నిపుణుల అభి ప్రాయం ప్రకారం, స్టార్టప్‌ల్లో పెట్టుబడి పెట్టడం అనేది సెలబ్రిటీలకు తమ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను విభిన్నంగా ఉంచుకునే ఒక మార్గంగా మారింది.ఇందులో రెండు వైపులా ప్రయోజనం ఉంది.. స్టార్‌కు: కొత్త వ్యాపారాల్లో వాటా లభిస్తుంది. కంపెనీ విజయవంతమైతే పెట్టుబడి విలువ పెరుగుతుంది. తన సినిమాలపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. స్టార్టప్‌కు: డబ్బుతో పాటు సెలబ్రిటీ పేరు, సోషల్ మీడియా ఫాలోయింగ్, ప్రచారం, బ్రాండ్ గుర్తింపు లభిస్తాయి. అందుకే నేటి సెలబ్రిటీ ఎకానమీలో ‘స్టార్ పెట్టుబడి పెట్టాడు’ అనేది కేవలం పెట్టుబడి వార్త కాదు.. ఆ స్టార్టప్‌కు మార్కెటింగ్ వ్యూహం కూడాఉపసంహారం... రాస్తే ఆకాశమంత కొలిస్తే కొండంత అన్నట్టుగా ప్రస్తుతం స్టార్స్‌కి ఉన్న ఆదాయావకాశాల జాబితా సాగిపోతూనే ఉంటుంది. రోజుకొకటిగా పుట్టుకొస్తున్న డిజిటల్ వ్యూహాలు తారలకు కాసుల పంట పండిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం తప్పుకాదనడం ఎంత నిజమో... అలాగే ఆ ఇంటికి పునాది లాంటి సమాజాన్ని చక్కదిద్దడంలోనూ తమ వంతు పాత్ర పోషించాలి అన్నదీ అంతే నిజం. సొంత బ్రాండ్... సొంత వ్యాపారంఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు తమ సొంత బ్రాండ్లను కూడా సెలబ్రిటీలు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ తార ఆలియా భట్ పర్యావరణహిత, స్వదేశీ బ్రాండ్‌ను విజయవంతమైన వ్యాపారంగా తీర్చిదిద్దిన వైనం దీనికో ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక దీపికా పదుకోన్ స్వయంగా 82నిఇ పేరుతో స్కిన్‌కేర్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఆమె భర్త రణ్వీర్ సింగ్ బ్యూటీ బ్రాండ్ షుగర్ కాస్మొటిక్స్‌లో వాటా కొనుగోలు చేశారు. నటి అనుష్కా శర్మ తన భర్త టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ప్లాంట్–బేస్డ్ మీట్ కంపెనీ బ్లూ ట్రైబ్ ఫుడ్జ్లో పెట్టుబడి పెట్టారు.ఈ పెట్టుబడి ద్వారా ఆ కంపెనీకి కేవలం ఆర్థిక మద్దతే కాకుండా భారీ స్థాయిలో ప్రచారం కూడా లభించింది. కంపెనీ వర్గాల ప్రకారం, వారి మద్దతుతో ప్లాంట్–బేస్డ్ మీట్ గురించి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలకు అవగాహన ఏర్పడింది. ఈ వైవిధ్యం సెలబ్రిటీల సంపాదన, పెట్టుబడి వ్యూహాల్లో వచ్చిన గణనీయమైన మార్పును సూచిస్తోంది. ఇప్పటి తారలు తమ స్టార్డమ్, సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను కేవలం సినిమా ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకోవడం లేదు. స్టార్టప్‌లకు పెట్టుబడి పెట్టడంతో పాటు తమకున్న భారీ మీడియా ప్రెజెన్స్‌ను ఆ బ్రాండ్ల ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. ఒక సెలబ్రిటీకి ఉన్న ప్రజాదరణ కొత్త బ్రాండ్‌కు తక్షణ గుర్తింపును తీసుకురావడమే కాకుండా, వినియోగదారుల్లో ఆ బ్రాండ్‌పై నమ్మకాన్ని కూడా పెంచుతుంది. అందుకే స్టార్టప్‌లకు సెలబ్రిటీ పెట్టుబడులు కేవలం డబ్బు సమకూర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడవు. ఆ స్టార్ ఇమేజ్, సోషల్ మీడియా రీచ్, అభిమానుల నమ్మకం కూడా కంపెనీకి అదనపు ఆస్తులుగా మారతాయి. – సత్యబాబు -
ఎన్నెన్నో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా?
ఒక అసెస్సీకి ఎన్నెన్నో బ్యాంకు అకౌంట్లు ఉండవచ్చు. ఎవరి దాకానో ఎందుకు మన రాంబాబు గారి సంగతే తీసుకోండి. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఆఫీసు నిబంధనల ప్రకారం వారు నిర్దేశించిన బ్యాంకులో అకౌంటు తెరిచారు. ఇందులో కేవలం జీతం మాత్రమే క్రెడిట్ అవుతుంది. పెళ్లయ్యాక, మావగారి ప్రోద్బలంతో, కట్టుకున్న భార్యతో మరో అకౌంటు.. ఇది జాయింట్ అకౌంటు. మామగారు, బావమరుదులు ఇచ్చిన మొత్తాలను ఇందులో డిపాజిట్ చేస్తున్నారు. ఇంటి లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే, వాళ్లు లోన్ ఇచ్చారు కానీ, మరో అకౌంటును ఆ బ్యాంకులో తెరవమన్నారు.ఆ తర్వాత ఎదిగిన పిల్లలు, వారి చదువులు, విద్యా రుణం నిమిత్తం బ్యాంకులో అకౌంటు, పిల్లల అవసరాలరీత్యా పంపే నెలసరి మొత్తానికి అబ్బాయికి అనువైన బ్యాంకు అకౌంటు, విదేశీ చదువుల కోసం అప్పు.. ఫలితంగా ఒక బ్యాంకు అకౌంటులు, షేర్లలో పెట్టుబడుల కోసం మొదటి నుంచి ప్రత్యేకంగా షేర్ల క్రయవిక్రయాల కోసం ఒక అకౌంటు.. ఇంట్లో అద్దెకు ఉన్నాయన బ్యాంకరు కావడంతో మొహమాటానికి ఆ బ్యాంకులో ఓ అకౌంటు.. ఈలోపల రిటైర్మెంటుతో ఇంటి పక్కనే ఉన్న బ్యాంకులో అకౌంటు.. ఇలా ఒక రాంబాబుకే పది బ్యాంకు అకౌంట్లు ఏర్పడ్డాయి. అన్నట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం ఓపెన్ చేసిన అకౌంటు.. ఈ జాబితాలో కలపలేదండోయ్.ఇలా ఎన్నెన్నో బ్యాంకు అకౌంట్లు.. ప్రతి అకౌంటులో ఎంతో కొంత మొత్తం ఉండటం, దాని మీద వడ్డీ ఆయా బ్యాంకుల్లోనే జమ కావడం.. అయితే ఒకటి రెండు అకౌంట్లు మినహా మిగతా అన్నింటిలోనూ చిన్న చిన్న మొత్తాలే.రెండు, మూడు ఖాతాలకే పరిమితం..అవగాహన లోపమే అనుకోండి.. ఆచరణాత్మక విషయమే అనుకోండి. అశ్రద్ధ..బద్ధకం.. అవసరం లేకపోవడం.. ఇలా ఏదైనా అనుకోండి.. కానీ రెండు మూడు అకౌంట్లలో వ్యవహారాలకు మాత్రమే రాంబాబు పరిమితమైపోయాడు. మిగతా అకౌంట్లను పట్టించుకోలేదు. ఫారం 15 కొన్నింటికి ఇవ్వలేదు. ఇవ్వని వాళ్లు .. ఇచ్చిన వాళ్లు టీడీఎస్ చేశారు. కొందరితో ఎటువంటి టచ్ లేకపోవడం వల్ల ఏం జరిగిందో తెలియదు.‘‘టీడీఎస్ ఉంటేనే ఆదాయం చెప్పు .. లేదంటే గప్‌చుప్,’’ అని ‘‘ఫారం 16ఏ ఇచ్చిన వాడే కరెక్టు వాడు,’’ అని ఇలాంటి ఎన్నెన్నో పిచ్చి సలహాలు వచ్చాయి రాంబాబుకి. అవి తప్పు. గుర్తు పెట్టుకోండి. టీడీఎస్ చేయడం, రికవర్ చేసిన మొత్తాన్ని గవర్నమెంటు ఖజానాలో జమ చేయడం ఇవన్నీ బ్యాంకు వారి డ్యూటీలు. చేయకపోతే వాటి మీద పెనాల్టీ విధిస్తారు. కానీ వడ్డీ మనదే. అది ట్యాక్సబుల్. టీడీఎస్ ఉన్నా లేకపోయినా వడ్డీని ఆదాయంగా గుర్తించాలి. మీ మొత్తం ఆదాయం ట్యాక్సబుల్ ఇన్‌కం దాటితే మీరు పన్ను చెల్లించాలి. పన్ను చెల్లించేటప్పుడు టీడీఎస్ వరకు సర్దుబాటు చేస్తారు.ఫారం 15 జీ/హెచ్ ఇవ్వడం, సీనియర్ సిటిజన్లకు కొంత వడ్డీ ఆదాయం దాటితేనే టీడీఎస్ అమలుపరచడం, ఇవన్నీ టీడీఎస్‌కి సంబంధించిన అంశాలు. మీ ఆదాయం ‘మినహాయింపు కాదు’. ప్రతి వడ్డీని, అది ఎంత చిన్న మొత్తమైనా, ఆదాయంలో లెక్క వేసుకోవాల్సిందే. అలా అన్నీ కలిపినా ట్యాక్సబుల్ ఇన్‌కం పరిధికి లోపే ఉంటే, పన్ను కట్టక్కర్లేదు.ఫారం 16ఎ మీద ఆధారపడొద్దు..ఫారం 16ని యజమాని ఇస్తాడు. మిగతా అందరూ 16ఎ ఇస్తారు. 16లో జీతం ఒకటే ఉంటుంది. 16ఎలో ఇతర ఆదాయాలూ వస్తాయి. అయితే, అన్ని వడ్డీలు రాకపోవచ్చు కాబట్టి 16, 16ఎ మీద ఆధారపడొద్దు.డిడక్షన్లు – డిస్క్లోజర్లు.. 80 టీటీఏ, 80– టీటీబీ ప్రకారం వచ్చిన డిడక్షన్ క్లెయిమ్ చెయ్యాలంటే, ముందుగా వాటి గురించి డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చేయకుండా డిడక్షన్ చెయ్యకూడదు. డిడక్షన్లు వస్తాయని డిస్క్లోజ్ మానకూడదు. అది లాజిక్. ఈ లాజిక్ మిస్సయి చాలా మంది వితండ వాదాలు చేస్తారు.మీరేం తెలుసుకోవాలి..‘నో టీడీఎస్’ అంటే ‘నో ట్యాక్స్’ కాదు ఫారం 16/16 ఎ అనేది ఫూల్ ప్రూఫ్ కాదు. డిస్క్లోజ్ చేసిన తర్వాత డిడక్షన్ చేయాలి ఫారం ఏఐఎస్, 26ఏఎస్‌లలో పడకపోయినా అన్ని ఎంట్రీలు తీసుకోండి.మీరేం చేయాలి.. ఎస్బీ, ఎఫ్డీ, ఆర్డీ, అన్ని రకాల బ్యాంకు అకౌంట్లు, జాయింట్ అకౌంట్లు, ఖాతాలు మూసినవి, ఇలా అన్నింటి పద్దులు వేసుకోండి. అన్నీ అప్డేట్ చేయండి. జ్ఞాపకం తెచ్చుకోండి. మీ రికార్డులు అప్డేట్ చేసుకున్న తర్వాత ఫారం 26ఏఎస్, ఏఐఎస్‌లో తప్పులుంటే సర్దుబాటు చేయొచ్చు. స్థూలంగా చెప్పాలంటే, అన్ని బ్యాంకు అకౌంట్లలోనూ వచ్చిన/ఉన్న వడ్డీలు ఆదాయమే! - డా. కందాళ సత్యనారాయణ మూర్తి, ట్యాక్సేషన్ నిపుణులు- కె.వి.ఎన్. లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
జెన్ జెడ్ పారిశ్రామికవేత్తలు చాలా స్మార్ట్
యువ పారిశ్రామికవేత్తలు ఎంతో స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక్క విభాగానికి పరిమితం కాకుండా ఒకటికి మించిన ఆదాయ మార్గాలతో విజయాల మోత మోగిస్తున్నారు. దాదాపు 75 శాతం మంది జెన్ జెడ్ పారిశ్రామికవేత్తలు (1997–2012 మధ్య జన్మించిన వారు) ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులను కలిగి ఉన్నట్టు లింక్డ్ఇన్ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. పాత తరంతో పోలిస్తే నేటి యువత మరింత సరళతర పని నమూనాల వైపు అడుగులు వేస్తున్నారు. జెన్ జెడ్‌లో ప్రతీ నలుగురిలో ముగ్గురు (75 శాతం) తమకు ఒకటికి మించి ఆదాయ వనరులున్నట్టు చెప్పారు. జెన్ ఎక్స్ (1965–1980 కాలంలో జన్మించిన వారు)లో కేవలం 62 శాతం మందికి మాత్రమే ఒకటికి మించిన ఆదాయ వనరులు ఉన్నాయి. వృత్తిపై పూర్తి నియంత్రణ సాధించడంతో పాటు, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ తరం తమ కెరీర్‌ను మలుచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వ్యాపార ధోరణులకు భారత్ నిదర్శనంగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. గడిచిన ఏడాది కాలంలో భారత్‌లో తమ ప్రొఫైల్‌లో ‘వ్యవస్థాపకుడు’ అని జోడించుకున్న వారి సంఖ్య 104 శాతం పెరిగింది. ఏ ఇతర దేశంతో పోల్చినా భారత్‌లోనే ఇది అధికమని ఈ నివేదిక తెలిపింది. 500 మంది చిన్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధిలోని వారిని ప్రశ్నించి లింక్డ్ఇన్ ఈ వివరాలు రూపొందించింది. వ్యయాలు, అనుభవం లేకపోవడం వంటి సంప్రదాయ అవరోధాలను ఏఐ, డిజిటల్ టూల్స్ తగ్గిస్తున్నాయి. దీని వల్ల వ్యాపారం ప్రారంభించడం కొత్త తరానికి సులభతరంగా మారింది. 85 శాతం మంది యువ వ్యవస్థాపకులు తమ వ్యాపార వృద్ధికి ఏఐ ఎంతో కీలకమని భావిస్తున్నారు. తమ నేపథ్యంతో సంబంధం లేకుండా పారిశ్రామికేవేత్తలుగా అవతరించే అవకాశాలు ప్రస్తుం ఉన్నట్టు 80 శాతం మంది చెప్పారు. గతంతో పోలి్చతే నేడు మరింత సులభతరం అయినట్టు 81 శాతం మంది తెలిపారు. భారత్‌లో జెన్‌జెడ్ విజయం అంటే కేవలం డబ్బు అనుకోవడం లేదు. 64 శాతం మంది స్వేచ్ఛ, సౌలభ్యం, 56 శాతం వ్యక్తిగత అభివృద్ధి, 55 శాతం మంది ఆర్థిక సంపదను నిజమైన విజయంగా భావిస్తున్నారు. వీటిని సాధించేందుకు రిస్క్ తీసుకునేందుకూ వెనుకాడడం లేదు. ఏఐతో అందరికీ అవకాశాలు..‘‘ఒకప్పుడు అసాధ్యం అనుకున్న వ్యాపార కలలను నేడు ఏఐ నిజం చేస్తోంది. ఒకే ఉద్యోగానికి పరిమితం కాకుండా, రకరకాల ఆదాయ మార్గాలను సృష్టించుకునేందుకు, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది’’ అని లింక్డ్ఇన్ భారత మేనేజర్ కుమారేష్ పట్టాభిరామన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన -
Telangana: ఒక అధికారి.. ఐదు కీలక బాధ్యతలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చాహత్ బాజ్‌పాయ్ ప్రస్తుతం ఐదు కీలక పదవులను ఒకేసారి నిర్వర్తిస్తూ పరిపాలనలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. కలెక్టర్ హోదాతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (ఎఫ్ఏసీ), జిల్లా పరిషత్ సీఈఓ, డీసీసీ బ్యాంక్ చైర్మన్, ‘కుడా’ వైస్ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తృతమైన పనుల్లో బిజీగా గడుపుతున్నారు.క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కలెక్టరేట్లో అన్ని శాఖల పనులపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ శాఖల సమావేశాలు, సమీక్షలతో పాటు మున్సిపల్, డీసీసీ బ్యాంకు కార్యక్రమాలకు హాజరవుతూ.. బాధ్యతలను సమన్వయం చేస్తున్నారు.ప్రతీ సోమవారం గ్రీవెన్స్ సెల్లో ప్రజల నుంచి వచ్చే వినతులను స్వయంగా స్వీకరించి, వారికి తగిన సమాధానాలిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పనులు వే గంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకే అధికారి ఇన్ని బాధ్యతలు నిర్వర్తించడం సవాలుతో కూడుకున్నది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని మిగతా ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే, కలెక్టర్‌గా మరింత సమర్థవంతమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
Priyanka Chopra: బాలీవుడ్ ఆఫర్లను రిజెక్ట్ చేస్తోందట..
-
Delhi: భారీ ఎన్కౌంటర్: రూ. లక్ష రివార్డు గ్యాంగ్‌స్టర్ హతం
న్యూఢిల్లీ: పలు ఘోరమైన నేరాలకు పాల్పడుతూ, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ నేపాలీ గ్యాంగ్‌స్టర్ ఎట్టకేలకు హతమయ్యాడు. ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసులు సోమవారం రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో భీమ్ మహాబహదూర్ జోరా (30) అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రాణాలు కోల్పోయాడు. అతడి తలపై పోలీసులు లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు.గత రాత్రి నెహ్రూ ప్లేస్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్క్‌లో జోరా తన అనుచరుడితో కలిసి ఉన్నాడన్న పక్కా సమాచారంతో గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ పోలీసుల స్పెషల్ బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పోలీసులను గమనించిన జోరా, వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నరేంద్ర శర్మ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌కు తగలడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.లొంగిపోవాలని పోలీసులు పదేపదే హెచ్చరించినా జోరా వినకుండా కాల్పులు కొనసాగించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ గందరగోళంలో జోరా అనుచరుడు చీకట్లో తప్పించుకున్నాడు.వైద్యుడి హత్య కేసులో ప్రధాన నిందితుడుజోరా అనేక హత్యలు, దోపిడీలు, దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ముఖ్యంగా 2024 మే నెలలో ఢిల్లీలోని జంగ్‌పురాలో డాక్టర్ యోగేష్ చంద్ర పాల్ (63) హత్య కేసులో ఇతనే ప్రధాన సూత్రధారి. ఆ దోపిడీ యత్నంలో డాక్టర్‌ను దారుణంగా హత్య చేసి 17 నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. ఇటీవల గురుగ్రామ్‌లో ఓ బీజేపీ నేత ఇంట్లో జరిగిన రూ. 20 లక్షల దొంగతనం కేసులో కూడా జోరా ప్రమేయం ఉన్నట్లు అధికారులు తెలిపారు.పనివాళ్ల రూపంలో దోపిడీలుజోరా నేపాల్ కేంద్రంగా ఓ పెద్ద అంతర్జాతీయ దొంగల ముఠాను నడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ముఠా సభ్యులు నకిలీ ఆధార్ కార్డులతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లోని సంపన్నుల ఇళ్లలో పనివాళ్లుగా చేరతారు. యజమానుల నమ్మకం చూరగొన్న తర్వాత, వారికి మత్తుమందు ఇచ్చి లేదా బంధించి ఇళ్లలోని నగదు, బంగారం, విలువైన వస్తువులతో నేపాల్‌కు పారిపోవడం వీరి పద్ధతి. ఘటనా స్థలం నుంచి ఒక ఆటోమేటిక్ పిస్టల్, బుల్లెట్లు, దొంగతనానికి ఉపయోగించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసుల మధ్య బలమైన సమన్వయం వల్లే ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఉన్నతాధికారులు తెలిపారు. -
ఒకరికి రెండు పాలసీలు.. క్లెయిమ్ ఎలా?
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలి కాలంలో వేతన జీవుల్లో చాలా మంది రెండు హెల్త్ పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స వ్యయం బీమా కవరేజీని మించిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలను ఒకటికి మించిన పాలసీలతో సులభంగా గట్టెక్కొచ్చు. కానీ, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉంటే క్లెయిమ్ ఎలా చేయాలనే విషయంలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విషయంలో నిపుణుల సూచనలు అందించే కథనమిది.గతంలో వేరు.. ఒక వ్యక్తికి ఒకటికి మించిన బీమా సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, క్లెయిమ్ మొత్తాన్ని ఆయా సంస్థలు సమానంగా భరించాలనే నిబంధన లోగడ ఉండేది. 2013లో దీన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. దీంతో ఇప్పుడు ఒకటికి మించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్నా కానీ, పాలసీదారు తనకు నచ్చిన చోట లేదంటే రెండు సంస్థల వద్దా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. క్లెయిమ్ ఎలా? రెండు ప్లాన్లు కలిగిన వారు ఆస్పత్రిలో చేరిన తర్వాత రెండు బీమా సంస్థలకు తప్పనిసరిగా సమాచారం అందించాలి. ఒకటికి మించిన సంస్థల నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కలిగి ఉంటే, అప్పుడు ముందుగా ఒక బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తే సరిపోతుంది. నగదు రహిత, రీయింబర్స్మెంట్ మార్గాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం ఒక హెల్త్ ప్లాన్ కవరేజీ దాటనప్పుడు ఒక బీమా సంస్థ వద్దే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ, ఒక పాలసీ కవరేజీకి మించి ఆస్పత్రి బిల్లు వచి్చనప్పుడు, రెండో బీమా సంస్థ వద్ద మిగిలిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంతే కానీ, ఒకేసారి ఒకే క్లెయిమ్‌ను రెండు సంస్థల వద్ద దాఖలు చేసేందుకు అవకాశం లేదు. ఉదాహరణకు రూ.5 లక్షల చొప్పున రెండు ప్లాన్లు ఉన్నాయని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు రూ.7 లక్షలు వచి్చంది. అప్పుడు తొలుత ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాలి. అక్కడి నుంచి వచి్చన చెల్లింపులు మినహాయించి, అప్పుడు మిగిలిన మొత్తానికి రెండో బీమా సంస్థ నుంచి పరిహారం కోరాలి. ఒక పాలసీలో రూమ్‌రెంట్ పరంగా పరిమితులు ఉండి, దానివల్ల క్లెయిమ్ పూర్తిగా రాని సందర్భాల్లోనూ.. మిగిలిన మొత్తాన్ని రూమ్‌రెంట్ పరిమితులు లేని మరో పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. కొన్ని పాలసీల్లో రూమ్ రెంట్, కొన్ని చికిత్సలకు పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా గ్రూప్ హెల్త్ ప్లాన్లలో ఇవి చూడొచ్చు. అలాంటప్పుడు రూ.5 లక్షల కవరేజీ ఉన్నప్పటికీ పూర్తి మొత్తం రాకపోవచ్చు. ఉదాహరణకు రూ.7లక్షల ఆస్పత్రి బిల్లుకు సంబంధించి రూ. 5 లక్షల గ్రూప్ పాలసీలో రూ.4 లక్షలే క్లెయిమ్ కింద వచి్చందని అనుకుంటే.. అప్పుడు మిగిలిన రూ. 3 లక్షలను రెండో పాలసీ కింద రీయింబర్స్మెంట్ కోరవచ్చు. ఒక బీమా సంస్థ క్లెయిమ్ దరఖాస్తును తిరస్కరించినా, రెండో బీమా సంస్థను సంప్రదించవచ్చు. వేతన జీవులు పనిచేసే సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ ప్లాన్, వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్లోటర్ లేదా ఇండివిడ్యు వల్ ప్లాన్ కలిగి ఉన్నప్పుడు.. మొదట గ్రూప్ హెల్త్ ప్లాన్ నుంచి క్లెయిమ్‌కు వెళ్లడం మంచి ఆప్షన్. గ్రూప్ హెల్త్ ప్లాన్‌లో క్లెయిమ్ సెటిల్మెంట్ సులభంగా ఉంటుంది. క్లెయిమ్ మొత్తం ఒక బీమా పాలసీ కవరేజీ పరిధిలోనే ఉంటే ఒక్క సంస్థ వద్దే క్లెయిమ్‌కు పరిమితం కావాలి. దీనివల్ల రెండో ప్లాన్‌లో నో క్లెయిమ్ బోనస్ నష్టపోకుండా చూసుకోవచ్చు.నగదు రహిత చికిత్సబీమా సంస్థ నెట్వర్క్ పరిధిలోని అన్ని ఆస్పత్రుల నుంచి నగదు రహిత చికిత్స తీసుకోవచ్చు. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత చికిత్సకు బీమా సంస్థలు నేడు అవకాశం కలి్పస్తున్నాయి. కాకపోతే ఆస్పత్రి నిషేధిత జాబితాలో లేని వాటికే ఈ సదుపాయం పరిమితమని గుర్తుంచుకోవాలి. రెండు ప్లాన్లలోనూ నగదు రహిత చికిత్సకు వెళ్లొచ్చు. కానీ, ఒక సంస్థ నుంచే నగదు రహిత క్లెయిమ్‌కు ఆస్పత్రులు ప్రాధాన్యం ఇస్తుంటాయి. మిగిలిన మొత్తం కోసం రీయింబర్స్మెంట్ విధానానికి వెళ్లాలని సూచిస్తుంటాయి. అలాంటప్పుడు నగదు రహిత విధానంలో గరిష్ట పరిమితి మేరకే ఒక బీమా సంస్థ నుంచి చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని సొంతంగా చెల్లించి, దాన్ని రాబట్టుకునేందుకు రెండో బీమా సంస్థను సంప్రదించాలి. దీనికోసం మొదట క్లెయిమ్ చేసిన బీమా సంస్థ నుంచి ‘క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ’ తీసుకోవాలి. అలాగే, హాస్పిటల్ బిల్లులు, చికిత్సకు సంబంధించి అన్ని పత్రాల ఫొటో కాపీలను సరి్టఫై (అటెస్టేషన్) చేసి ఇవ్వాలని మొదటి బీమా సంస్థను కోరాలి. వీటితో రెండో బీమా సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దరఖాస్తు దాఖలు చేసుకోవాలి. రెండు బీమా సంస్థల వద్ద రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిమ్ చేసుకోవాలన్నా సరే.. మొదట ఒక సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆస్పత్రి నుంచి అన్ని బిల్లుల కాపీలు, డిశ్చార్జ్ సమ్మరీ, ల్యాబ్ రిపోర్ట్లు తీసుకుని బీమా సంస్థకు సమర్పించాలి. క్లెయిమ్ ఆమోదం అనంతరం, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీతోపాటు, అన్ని డాక్యుమెంట్ల ఫొటో కాపీలతో రెండో సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలుకు కాలపరిమితి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15–30 రోజులు దాటకుండా క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. ఒకరికి ఎన్ని ప్లాన్లు? అసలు ఒకటికి మించి హెల్త్ పాలసీలు ఎందుకు? అనే సందేహం రావచ్చు. ఒక్కొక్కరి అవసరాలే దీన్ని నిర్ణయిస్తాయి. ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ కవరేజీ సాధారణంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచి్చనా లేదంటే ఉద్యోగం కోల్పోయిన సందర్భాల్లో.. తిరిగి ఉపాధి లభించేందుకు కొంత సమయం పట్టొచ్చు. కంపెనీలు కలి్పంచే గ్రూప్ హెల్త్ కవరేజీ.. ఉద్యోగానికి రాజీనామా చేయడంతోనే ముగిసిపోతుంది. అందుకే వ్యక్తిగతంగా మరో ప్లాన్ కలిగి ఉంటే, ఉద్యోగం లేని సమయంలోనూ ఉపయోగపడుతుంది. వైద్య చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో రెండు ప్లాన్లను కలిగి ఉండడం మంచి నిర్ణయమే అవుతుంది. లేదంటే బేస్ ప్లాన్ ఒకటి తీసుకుని, దానిపై మరింత మెరుగైన కవరేజీతో సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మరొక మార్గం.రీయింబర్స్‌మెంట్‌కు కావాల్సిన డాక్యుమెంట్లు డిశ్చార్జ్ సమ్మరీ, నగదు/కార్డు ద్వారా చెల్లింపులకు సంబంధించి రసీదులు, ల్యాబ్ రిపోర్ట్లు, వైద్యులు రాసిచి్చన ప్రిస్కిప్షన్లు, ఎక్స్‌రే ఫిల్మ్‌లు, క్లెయిమ్ సెటిల్మెంట్ సమ్మరీ.ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు? ఏడాదిలో ఎన్ని క్లెయిమ్‌లు అన్న దానితో సంబంధం లేకుండా, గరిష్ట బీమా కవరేజీ పరిధిలో ఎన్ని విడతలైనా పరిహారం పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు క్లెయిమ్‌ల సంఖ్య పరంగా పరిమితులు విధించొచ్చు. కనుక పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్‌ను తప్పకుండా చదివి ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. రెండు రకాల పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్ సాధారణంగా రెండు రకాలు. ఇండెమ్నిటీ ఒక రకం అయితే, ఫిక్స్డ్ బెనిఫిట్‌తో కూడినవి రెండో రకం. ఇండెమ్నిటీ పాలసీలు ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలతోపాటు.. ఎంపిక చేసిన డేకేర్ ప్రొసీజర్స్ (చికిత్స తర్వాత అదే రోజు విడుదలయ్యేవి)కు మాత్రమే కవరేజీ ఇస్తాయి. ఇక క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను ఫిక్స్డ్ బెనిఫిట్ పాలసీలుగా చెబుతారు. ఇందులో కేన్సర్, గుండె జబ్బులు, మూత్ర పిండాల వైఫల్యం, కాలేయ వైఫల్యం తదితర తీవ్ర వ్యాధుల్లో ఏదైనా నిర్ధారణ అయిన వెంటనే నిర్ణీత పరిహారాన్ని బీమా సంస్థలు ఒకే విడత చెల్లించేస్తాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఈ రెండింటి పరంగా గందరగోళం అక్కర్లేదు. ఇండెమ్నిటీ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ రెండూ కలిగిన వారు.. ఏదైనా తీవ్ర వ్యాధి (క్రిటికల్ ఇల్నెస్) బారిన పడినప్పుడు ఇండెమ్నిటీ ప్లాన్ కింద కవరేజీ పొందొచ్చు. అలాగే, వ్యాధి నిర్ధారణ పత్రాలతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కింద క్లెయిమ్ దాఖలు చేసి పూర్తి ప్రయోజనాన్ని అందుకోవచ్చు. దీనివల్ల ఆయా వ్యాధులకు సంబంధించి ఎదురయ్యే భారీ వ్యయాలను తట్టుకోవడం సాధ్యపడుతుంది. టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు ఇక హెల్త్ ఇన్సూరెన్స్‌లో టాపప్, సూపర్ టాపప్ ప్లాన్లు కూడా ఉంటాయి. ఇందులో సూపర్ టాపప్ ఎక్కువ అనుకూలం. ఇవి డిడక్షన్ క్లాజుతో వస్తాయి. ఉదాహరణకు రూ.5 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న వారు, రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ కూడా జోడించుకున్నారని అనుకుందాం. ఆస్పత్రి బిల్లు మొదటి రూ.5 లక్షలు దాటిన తర్వాతే సూపర్ టాపప్ ప్లాన్ కింద కవరేజీ పొందగలరు. రూ.50 లక్షల వరకు బిల్లు ఎంత వచ్చినా సరే.. మొదటి రూ.5 లక్షలకు సూపర్ టాపప్‌లో పరిహారం రాదు. దాన్ని సొంతంగా భరించడం లేదంటే బేస్ ప్లాన్ నుంచి కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా రూ.50 లక్షల బేస్ ఇండెమ్నిటీ ప్లాన్‌తో పోలి్చతే.. రూ.5–10 లక్షల మేర బేస్ ప్లాన్ తీసుకుని, 50 లక్షలకు సూపర్ టాపప్ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం కొంత తగ్గుతుంది. -
తన రంగును మార్చుకునే.. సరస్సును ఎప్పుడైనా చూశారా!
ప్రకృతి అద్భుతాల్లో ఒకటి.. మహర్లూ సరస్సు. దక్షిణ ఇరాన్ లోని షిరాజ్ నగరానికి సమీపంలో దాదాపు 600 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందీ ఉప్పు నీటి సరస్సు. ఓ పక్క తెలుపు, మరో పక్క లేత గులాబీ రంగుతో.. సందర్శకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఎత్తైన ప్రాంతంలో కొలువుదీరిన ఈ కొలను కాలానుగుణంగా తన రంగును మార్చుకుంటుంది.షిరాజ్‌కు ఆగ్నేయంగా 27.0 కిమీల (16.8 మైళ్ళు) వరకూ ప్రవహిస్తుంది. సాధారణంగా వేసవి చివరి నాటికి ఆవిరైపోతుంది. ఆ సమయంలోనే ఇది పింక్ కలర్లోకి మారి.. ప్రకృతి ప్రియుల్ని ఆకర్షిస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా ఇది పింక్ కలర్లోకి మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. నీటి మట్టం మరింత తగ్గగానే ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. ఇందులో పేరుకున్న ఉప్పే.. ఈ సరస్సు మధ్యలో లేదా తీరంలో నిలబడటానికి.. దిమ్మలా, ఒడ్డులా మారుతుంది.ఇలాంటి పింక్ సరస్సులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఉన్నాయి. రష్యాలోని ఆల్టై పర్వత ప్రాంతంలో ఉన్న సైబీరియన్ పింక్ లేక్ కూడా గతంలో వైరల్ అయ్యింది. ఆ సరస్సు మధ్యలోంచి రైలు పట్టాలు వేయడంతో సందర్శకులను అది మరింత ఆకట్టుకుంటోంది. ‘ఆర్టెమియా సాలినా’ అనే ఉప్పు నీటి రొయ్యల జాతి కారణంగానే ఆగస్ట్ సమయంలో.. సైబీరియన్ సరస్సుకి గులాబీ రంగు వస్తుందని నిపుణులు తేల్చారు.ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే! -
రణ్వీర్ దశావతార్
తమ అభిమాన హీరో బొమ్మ గీసి ముచ్చటపడే అభిమానులు మనకు కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అభిమాని పౌమిల్ కత్రి వినూత్న శైలితో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రకరకాల స్కెచ్‌లు ఉన్న పరికరంతో కాన్వాస్‌పై ఒకే సమయంలో వివిధ సినిమాలలోని రణ్వీర్ క్యారెక్టర్లను గీసి నెటిజనులను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ‘మేడ్ 10 స్కెచెస్ ఆఫ్ రణ్‌వీర్‌సింగ్ ఎట్ ఏ సేమ్ టైమ్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసి ముచ్చటపడిన రణ్‌వీర్‌సింగ్ పౌమిల్ను ప్రశంసిస్తూ కామెంట్ పెట్టడం మరో విశేషం. ఇక టాలెంటెడ్ ఆర్టిస్ట్ పౌమిల్ కత్రి విషయానికి వస్తే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన కత్రికి ఇన్‌స్టాగ్రామ్‌లో వందలాదిమంది ఫాల్వర్స్ ఉన్నారు. -
ఆధునిక మానవుని పుట్టుకపై అధ్యయనం..మనది ఒకే మూలం కాదట
ఆధునిక మానవుని మూలాలు ఎక్కడున్నాయి? ఆఫ్రికా అన్నది అందరూ చెప్పే సమాధానం. తొలి మానవులు అక్కడే పుట్టి, అక్కణ్నుంచే ప్రపంచమంతా వ్యాపించారని దశాబ్దాలుగా వింటూ వస్తున్నాం కూడా. అంతవరకూ నిజమే అయినా మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామన్న సిద్ధాంతం మాత్రం తప్పంటోంది ఓ తాజా అధ్యయనం. మన మూలాలు ఆఫ్రికాలోని కనీసం రెండు విభిన్న జాతుల్లో ఉన్నాయని చెబుతోంది. కనుక ఆధునిక మానవుని జన్మస్థలం ఫలానా అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేమన్నది దాని సారాంశం.. మన ఆవిర్భావానికి ఒకే మూలమంటూ లేదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. 10 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికావ్యాప్తంగా ఉనికిలో ఉన్న పలు ఆదిమ మానవ జాతులు హోమోసెపియన్గా పిలిచే ఆధునిక మానవుని పుట్టుకకు కారణమని అంటోంది. ‘‘ఆ కాలంలో ఆఫ్రికాలో నివసించి, క్రమంగా ఆ ఖండమంతటా వ్యాపించి పరస్పరం కలిసిపోయిన కనీసం రెండు ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూలం. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జన్యు డేటాను లోతుగా పరిశోధించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. దీని వివరాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. ‘‘మన ఆవిర్భావానికి కారకుడైన ఆదిమ మానవులు ఒకే జాతికి చెందిన వారని మానవ వికాసంపై దశాబ్దాలుగా జరిగిన పరిశోధనల్లో చాలావరకు చెప్పుకొచ్చాయి. వారు ఆఫ్రికాలో తొలుత చెట్లపై నివసించి, అనంతరం క్రమంగా నేల మీదికి దిగారన్నది వాటి సారాంశం. కానీ ఆఫ్రికావ్యాప్తంగా మానవ ఆవాసాలకు సంబంధించిన శిలాజ, పురాతత్వ రికార్డులు ఈ వాదనతో సరిపోలడం లేదు. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో సంచరించిన ఒకటికి మించిన ఆదిమ జాతులు వేలాది ఏళ్లపాటు పరస్పర వలసలు తదితరాల ద్వారా కలగలిసిపోయి క్రమంగా ఆధునిక మానవుని ఆవిర్భావానికి దారితీశాయన్నది మా పరిశోధనలో తేలింది. హేతుబద్ధంగా ఆలోచించినా ‘ఒకే మూలం’ సిద్ధాంతం కంటే ఇదే సమంజసంగా తోస్తోంది కూడా’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జెనెటిసిస్ట్ డాక్టర్ బ్రెన్నా హెన్ వివరించారు. ఆ ఆధారాలే ఉంటేనా...! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి మూలాలూ కచ్చితంగా 10 లక్షల ఏళ్ల నాటి ఈ రెండు ఆదిమ జాతుల్లోనే ఉన్నట్టు కచ్చితంగా చెప్పగలమని బృందం సభ్యుడైన విస్కాన్సిన్–మాడిసన్ వర్సిటీ పాపులేషన్ జెనెటిసిస్ట్ ఆరన్ రాగ్స్డేల్ అంటున్నారు. ఎలా చూసినా మనందరి జన్మస్థానం ఆఫ్రికా లోని ఒకే ప్రాంతమన్న వాదనకు కాలం చెల్లినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘కాకపోతే 10 లక్షల ఏళ్ల నాటి మానవ శిలాజ తదితర జన్యు ఆధారాలేవీ ఇప్పటిదాకా మనకు దొరకలేదు. లేదంటే ఆధునిక మానవుని (హోమోసెపియన్) ఆవిర్భావం, విస్తరణ తదితరాలపై ఈ పాటికే మరింత స్పష్టత వచ్చేది’’ అన్నారాయన. ఇలా చేశారు... డాక్టర్ హెన్ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశల్లోని ప్రఖ్యాత సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఆఫ్రికాలోని పలు ప్రాంతాలకు చెందిన 290 మంది జన్యు అమరికను వారు లోతుగా విశ్లేషించారు. దాంతోపాటు ఆఫ్రికాలో ఉన్న భిన్న జాతుల వారి డీఎన్ఏను ఇందుకు ఎంచుకున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో సియెరా లియోన్‌లో నివసించే మెండే రైతు జాతి, ఇథియోపియాలో ఆదిమ వేటగాళ్ల నుంచి రూపాంతరం చెందిన గుముజ్ జాతి, అమ్హరాగా పిలిచే అక్కడి రైతులతో పాటు నమా అనే దక్షిణాఫ్రికాలోని వేటగాళ్ల సంతతి నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. వాటిలోని వైవిధ్యాన్ని బట్టి లక్షల ఏళ్ల క్రితం ఆ డీఎన్ఏలు ఎలా ఉండేవో, ఇన్నేళ్ల పరిణామక్రమంలో ఏ విధంగా మారుతూ వచ్చాయో అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా సిమ్యులేషన్ విధానంలో ఆవిష్కరిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా లభించిన అతి పురాతన మానవ శిలాజం (3 లక్షల ఏళ్ల నాటిది) ఆఫ్రికాకు చెందినదే. అంతేగాక అతి పురాతన రాతి పనిముట్లు కూడా అక్కడే దొరికాయి. ప్రధానంగా ఈ రెండింటి ఆధారంగానే ఆఫ్రికానే మన జన్మస్థానమని గత అధ్యయనాల్లో చాలావరకు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికావాసుల డీఎన్ఏను బ్రిటిష్ వారి డీఎన్ఏతోనూ, క్రొయేషియాలో దొరికిన దాదాపు 50 వేల ఏళ్ల నాటి మన పూర్వీకుడైన నియాండర్తల్ మానవుని డీఎన్ఏతోనూ పోల్చి చూశారు. ఆఫ్రికావ్యాప్తంగా ఒకటికి మించిన ఆదిమ జాతులు వేల ఏళ్ల క్రమంలో తమలో తాము కలిసిపోయిన ఫలితంగానే మనం పుట్టుకొచ్చామని తేల్చారు. కనీసం రెండు ప్రధాన ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూల కారకులని డాక్టర్ హెన్ సూత్రీకరించారు. వాటికి స్టెమ్1, స్టెమ్2గా పేరు పెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎంపీ విజయసాయిరెడ్డి బిల్లుపై ముందుకు.. కేంద్రం సానుకూలం!
సాక్షి, ఢిల్లీ: రాజధానుల ఏర్పాటుపై ఆయా రాష్ట్రాలకే అధికారం ఉండాలన్న వైఎస్సార్సీపీ విధానానికి కేంద్రం మద్దతు తెలపనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ దిశగా బీజేపీ అధిష్ఠానం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర అసెంబ్లీకి స్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ మొన్నటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు మెంబరు బిల్లును ప్రవేశపెట్టారు. చదవండి: ఏపీ ప్రభుత్వం తరపున సీజేఐ ఎన్వీ రమణకు విందు రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధంగా తిరుగులేని అధికారం ఉందన్న పార్టీ విధానాన్ని విజయసాయిరెడ్డి పెద్దల సభలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టికల్ 3కు రాజ్యాంగ సవరణ చేసి 3ఏను చేర్చాలని ఆ బిల్లులో ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై పార్లమెంటు వచ్చే శీతాకాల సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది. దీనిపై కేంద్రం కూడా పూర్తి సానుకూలంగా ఉందంటూ జాతీయ మీడియా పేర్కొంది. ప్రైవేట్ బిల్లుకు బదులుగా అధికారపార్టీనే ఆర్టికల్ 3 సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందని జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాదు.. ప్రైవేటు బిల్లును ఉపసంహరించుకోవాలని విజయసాయిరెడ్డికి బీజేపీ అధిష్ఠానం సూచించనున్నట్టు తెలిపింది. ఈ మధ్యకాలంలో జనతాదళ్ యునైటెడ్ లాంటి పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వెళ్లడంతో బీజేపీ బలం రాజ్యసభలో 108కి తగ్గింది. పెద్దల సభలో ప్రతిపక్షాలకు 129 మంది సభ్యులున్నారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే.. అధికారపార్టీకి మరో 79 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. -
విస్మయపరుస్తున్న అపరిచితురాలు
మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తిత్వాలను అపరిచితుడు వంటి సినిమాల్లో చూశాం. కానీ ఇప్పుడు బహుళ వ్యక్తిత్వాలు కలిగిన ఓ జర్మన్ యువతి వైద్య ప్రపంచాన్నే విస్తుపోయేలా చేస్తోంది. ఇరవై ఏళ్ళ వయసులో ప్రమాదంలో దృష్టి కోల్పోయిన ఆమె.. విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉండటంతో... 37 ఏళ్ళ వయసులోనూ ఓ చిన్నవయసు వ్యక్తిలా చూడగలుగుతోంది. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ తో బాధపడుతున్న ఆమెను అప్పట్లో అంధురాలుగానే గుర్తించారు. అయితే ఆమె అంధత్వం ఇప్పుడు మానసికమైనది కాకుండా శరీరానికి సంబంధించినదిగా భావిస్తున్నారు. అకస్మాత్తుగా మారే వ్యక్తిత్వాలు ఆమెకు కంటి చూపును ప్రసాదిస్తున్నాయి. ఇరవై సంవత్సరాల వయసులో ప్రమాదంలో మెదడు భాగం దెబ్బతినడంతో ఆమె దృష్టిని కోల్పోయినట్లు వైద్యులు గుర్తించారు. ఆమె కార్టికల్ బ్లైండ్ నెస్ బారిన పడినట్లు సూచించారు. అయితే ఇప్పుడామె పది విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. చికిత్స సమయంలో ఏదో లోపం జరగడం వల్ల ఈ డిజార్డర్ సంభవించినట్లు చెబుతున్నారు. అందుకే ఆమె యుక్త వయసులోని బాలిక చూడగలిగే సామర్థ్యాన్ని పొందిందని వైద్యులు విశ్వసిస్తున్నారు. చికిత్సా కాలంలో ఆమెకున్న పది వ్యక్తిత్వాల్లోని ఎనిమిదికి సంబంధించిన చూపును తిరిగి ఆమె చేజిక్కించుకుంది. సెకన్లలో మారిపోతున్న ఆమె దృష్టి ఇప్పుడు ఆమె వ్యక్తిత్వం పై ఆధారపడి ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆమెకు సంభవించిన అంధత్వం మెదడు దెబ్బతినడం వల్ల కాదని, శారీరకమైనదిగా భావిస్తున్నారు. జర్మన్ మనస్తత్వవేత్తలు హన్స్ స్ట్రాస్ బర్గర్, బ్రూనో వాల్డ్ వోగల్ నిర్వహించిన ఈఈజీ అధ్యయనాల ద్వారా అమె మెదడులోని దృశ్య సంబంధిత స్పందనలను గమనించారు. పేషెంట్ అంధత్వంతో ఉన్నపుడు మెదడు ఎలాంటి దృశ్యాన్ని స్వీకరించడం లేదని, అయితే విభిన్న వ్యక్తిత్వాలుగా మారుతున్నపుడు ఆమె సాధారణ దృష్టిని కలిగి ఉంటోందని తెలుసుకున్నారు. ఆమె స్పందనలను ఈసీజీ మానిటర్ ద్వారా కనుగొన్నారు. ప్రాధమిక నిర్థారణ సమయంలో ఆమె ఆరోగ్య రికార్డులను పరిశీలించిన వైద్యులు... ఆమెకు ప్రత్యేక అద్దాలు, లైట్లు, లేజర్లు వినియోగించి దృష్టి పరీక్షలు నిర్వహించారు. ఆమె కళ్ళకు ఎటువంటి భౌతిక నష్టం కలుగలేదని, కేవలం మెదడు దెబ్బతినడం వల్లే సమస్య ఉత్పన్నమైందని భావించారు. ఆమెలోని కొన్ని వ్యక్తిత్వాలు చిన్నవయసులో ఆమె నివసించిన ప్రదేశాన్ని బట్టి, ఆయా భాషల్లో మాట్లాడటాన్ని బట్టి తెలుసుకున్నారు. నాలుగు సంవత్సరాల చికిత్స అనంతరం బాలికలా ప్రవర్తించడాన్ని గమనించిన వైద్యులు... ఆమె భావోద్వేగాలను బట్టి, స్పందనలను బట్టి దృష్టి మారుతున్నట్లుగా భావిస్తున్నారు. అంతే కాక ఆమె చూడాలనుకున్న సమయంలో చూడగలదని, వద్దనుకుంటే అంధురాలిగా మారిపోతుంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం వైద్య నిపుణులకు సైతం ఆమె పరిస్థితి ఓ అధ్యయనంగా మారింది.


