ఎంపీ విజయసాయిరెడ్డి బిల్లుపై ముందుకు.. కేంద్రం సానుకూలం!

Vijaya Sai Reddy Private Bill On Multiple Capitals, Center Llikely To Support - Sakshi

రాజధానుల ఏర్పాటుపై రాష్ట్రానికే అధికారం

ఆర్టికల్‌ 3కు రాజ్యాంగ సవరణ చేయాలంటూ బిల్లు

ఆర్టికల్‌ 3ను చేర్చాలంటూ విజయసాయిరెడ్డి ప్రైవేట్‌ బిల్లు

బిల్లుపై కేంద్రం సానుకూలంగా ఉందంటున్న జాతీయ మీడియా

సాక్షి, ఢిల్లీ: రాజధానుల ఏర్పాటుపై ఆయా రాష్ట్రాలకే అధికారం ఉండాలన్న వైఎస్సార్‌సీపీ విధానానికి కేంద్రం మద్దతు తెలపనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ దిశగా బీజేపీ అధిష్ఠానం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర అసెంబ్లీకి స్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ మొన్నటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు మెంబరు బిల్లును ప్రవేశపెట్టారు.
చదవండి: ఏపీ ప్రభుత్వం తరపున సీజేఐ ఎన్వీ రమణకు విందు

రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధంగా తిరుగులేని అధికారం ఉందన్న పార్టీ విధానాన్ని విజయసాయిరెడ్డి పెద్దల సభలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టికల్‌ 3కు రాజ్యాంగ సవరణ చేసి 3ఏను చేర్చాలని ఆ బిల్లులో ఆయన డిమాండ్‌ చేశారు. ఈ బిల్లుపై  పార్లమెంటు వచ్చే శీతాకాల సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది.

దీనిపై కేంద్రం కూడా పూర్తి సానుకూలంగా ఉందంటూ జాతీయ మీడియా పేర్కొంది. ప్రైవేట్‌ బిల్లుకు బదులుగా అధికారపార్టీనే ఆర్టికల్‌ 3 సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందని జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాదు.. ప్రైవేటు బిల్లును ఉపసంహరించుకోవాలని విజయసాయిరెడ్డికి బీజేపీ అధిష్ఠానం సూచించనున్నట్టు తెలిపింది. ఈ మధ్యకాలంలో జనతాదళ్‌ యునైటెడ్‌ లాంటి పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వెళ్లడంతో బీజేపీ బలం రాజ్యసభలో 108కి తగ్గింది. పెద్దల సభలో ప్రతిపక్షాలకు 129 మంది సభ్యులున్నారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే.. అధికారపార్టీకి మరో 79 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top