సూర్యవన్షీ సాహసం | Akshay Kumar Shares His Singham Again First Look Poster Of Jumps From Moving Helicopter Goes Viral - Sakshi
Sakshi News home page

సూర్యవన్షీ సాహసం

Published Mon, Nov 6 2023 2:22 AM

Singham Again: Akshay Kumar shares his FIRST look jumping off helicopter  - Sakshi

బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి కాప్‌ యూనివర్స్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సింగమ్‌ ఎగైన్ ’. ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్ , రణ్‌వీర్‌ సింగ్, అక్షయ్‌ కుమార్, టైగర్‌ ష్రాఫ్, దీపికా పదుకొనె, కరీనా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అక్షయ్‌కుమార్‌ c చేసి, వీర్‌ సూర్యవన్షీ పాత్రలో ఆయన నటిస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్‌.

అలాగే రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ‘సూర్యవన్షీ’    (2021) చిత్రం విడుదలై ఆదివారంతో రెండేళ్లు పూర్తి చేసుకోవడంతో, ‘సింగమ్‌ ఎగైన్ ’ సినిమాలోని అక్షయ్‌ లుక్‌ను విడుదల చేసినట్లుగా రోహిత్‌ శెట్టి పేర్కొన్నారు. ఇందులో అక్షయ్‌ లుక్‌ చూస్తుంటే పోలీసాఫీసర్‌గా మరోసారి ఆయన సహసాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ‘సింగమ్‌ ఎగైన్ ’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement