సీక్రెట్‌గా వీడియో షూట్‌.. కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొణె | Deepika Padukone Gets Angry on Fan Who Secretly Filming Her | Sakshi
Sakshi News home page

Deepika Padukone: పాపను సీక్రెట్‌గా వీడియో షూట్‌.. దీపికా చెప్పినా వినకుండా..

Aug 24 2025 1:42 PM | Updated on Aug 24 2025 1:54 PM

Deepika Padukone Gets Angry on Fan Who Secretly Filming Her

సెలబ్రిటీలు కనిపిస్తే చాలు.. సెల్ఫీలంటూ ఎగబడిపోతుంటారు. వారు హడావుడిలో ఉన్నా, వద్దని చెప్తున్నా వినిపించుకోరు. కొందరైతే స్టార్స్‌కు తెలియకుండా వారిని ఫాలో చేసి సీక్రెట్‌గా ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) విషయంలో ఇప్పుడదే జరిగింది. కూతురు దువాతో కలిసి బయటకు వెళ్లిన దీపికను ఓ అభిమాని ఫాలో అయ్యాడు. 

దీపికా అసహనం
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో వాళ్లను సీక్రెట్‌గా కెమెరాలో చిత్రీకరించాడు. ఇది దీపికా కంట పడటంతో ఆమె ఆగ్రహానికి గురైంది. ఇలా చేయడం తప్పని మందలించింది. వీడియో డిలీట్‌ చేయమని కోరింది. ఇప్పటివరకు దీపికా జంట.. కూతురి ముఖాన్ని ఎక్కడా చూపించలేదు. పాపరాజీ (ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్స్‌) కూడా స్టార్స్‌ విన్నపం మేరకు దువా ఫోటోలను క్లిక్‌ చేయకుండా సహకరించారు.

మందలించినా వినకుండా..
దీపికా-రణ్‌వీర్‌ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే సదరు అభిమాని మాత్రం ఇలా వీడియో తీయడం.. అది వైరల్‌ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పేరెంట్స్‌ అనుమతి లేకుండా దువా ఫేస్‌ను రివీల్‌ చేశాడని ఆగ్రహిస్తున్నారు. ఆమె వద్దని చెప్పినా వినకుండా వీడియో పోస్ట్‌ చేయడం తప్పని మందలించారు. ఆన్‌లైన్‌లో కూతురి ఫోటో ప్రత్యక్షం కావడంపై దీపికా అప్‌సెట్‌ అయినట్లు తెలుస్తోంది.

దువా
కాగా దీపికా, రణ్‌వీర్‌ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి గతేడాది సెప్టెంబర్‌ 8న కూతురు జన్మించింది. ఎన్నో ‍ప్రార్థనల ఫలితంగా పుట్టిన పాపాయికి దువా అని నామకరణం చేశారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. సినిమాల విషయానికి వస్తే.. రణ్‌వీర్‌.. ధురంధర్‌ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్‌ 6న విడుదల కానుంది. అలాగే డాన్‌ 3 సినిమాలోనూ యాక్ట్‌ చేస్తున్నాడు. దీపికా.. అల్లు అర్జున్‌- అట్లీ మూవీలో నటించనుంది.

 

 

చదవండి: సిద్దిపేట మోడల్‌కు షాక్‌.. 16 మందికి అసలైన అగ్నిపరీక్ష!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement