
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Aagnipariksha)లో చిరాకు తెప్పించిన కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు. కొందరిని హోల్డ్‌లో పెట్టారు. మరికొందరిని నేరుగా టాప్ 15లోకి పంపించారు. మరి మూడో ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేద్దాం.. మొదటగా ఆర్మీ జవాన్ వచ్చాడు. అతడికి యాక్టింగే ఎక్కువ ఇష్టమన్నాడు. ఒకవేళ బిగ్‌బాస్ గెలిచి ఆఫర్లు వస్తే ఆర్మీకి రిజైన్ చేస్తానన్నాడు. షో నుంచి ఎలిమినేట్ అయితే ఆర్మీకి వెళ్లిపోతానన్నాడు. అతడికున్న క్లారిటీ జడ్జిలకు నచ్చింది. అలా అని ఇతడిని నేరుగా టాప్ 15కి పంపించలేదు, ఎలిమినేట్ కూడా చేయలేదు. ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారు.
సిద్దిపేట మోడల్‌కు షాక్
సింగర్, డ్యాన్సర్ అంటూ స్టేజీపైకి వచ్చిన షకీం.. స్టేజీపై సరిగా డ్యాన్స్ చేయలేకపోయాడు. అయినా ఇతడికి నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్‌కు పంపించాడు. సిద్దిపేట మోడల్ స్టేజీపై రాగానే అతడి మాట తీరు జడ్జిలకు నచ్చలేదు. నువ్వు ఆల్‌రెడీ సెలబ్రిటీవి అంటూ పంపించేశారు. ఇన్‌ఫ్లుయెన్సర్ అనూష రత్నం తన స్టోరీ చెప్పింది. తండ్రి లేకపోయినా తనే కుటుంబం కోసం నిలబడి అప్పులు తీర్చానని, చెల్లిని విదేశాల్లో చదివించానని పేర్కొంది.
98 మంది ప్రపోజ్
అయితే నామినేషన్స్ చేయమంటే మాత్రం తడబడింది. అప్పటికే తన స్టోరీ విని కరిగిపోయిన జడ్జిలు ముగ్గురూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి ఆమెను టాప్ 15లోకి పంపించారు. తనకు 98 మంది ప్రపోజ్ చేశారంటూ స్టేజీపైకి వచ్చిన శ్రీకృష్ణను, డాక్టర్ నిఖితను.. మరికొందరిని హోల్డ్‌లో పెట్టారు. యూకే నుంచి బిగ్‌బాస్ కోసమే వచ్చానన్న శ్వేతను టాప్ 15లోకి పంపించారు. ఈమె తల్లికి క్యాన్సర్ కాగా.. ఈ ఎపిసోడ్ వచ్చేకంటే ముందే ఆమె కన్నుమూయడం విషాదం! రివ్యూయర్ ఉత్తర ప్రశాంత్, ఖమ్మం టెడ్డీ బేర్ సహా చాలామందిని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసి పంపించేశారు.
19 ఏళ్ల అబ్బాయికి అన్యాయం?
19 ఏళ్ల అమ్మాయి శ్రేయను ఎంకరేజ్ చేసిన జడ్జిలు అదే వయసులో ఉన్న అబ్బాయి జనిత్‌ను మాత్రం ఎలిమినేట్ చేయడం గమనార్హం! ఒక ప్రమాదంలో తల్లికి 80% గాయాలయ్యానని, అయినా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషించిందన్నాడు. తండ్రి చనిపోయినా అన్నీ తనే చూసుకుందన్నాడు. ఒకమ్మాయి విదేశాల్లో చదివించి, మరో అమ్మాయికి పెళ్లి చేసి, అతడిని చదివిస్తోంది అని తల్లి గొప్పదనం చెప్పాడు. అది విని జడ్జిలు లేచి చప్పట్లు కొట్టారు. తాను ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నానన్నాడు. జీవితంపై క్లారిటీ ఉన్న ఇతడిని రిజెక్ట్ చేశారు.
టాప్ 15 కోసం పోటీ
ఫైనల్‌గా ఇప్పటివరకు టాప్ 15లో ఆరుగురిని సెలక్ట్ చేశారు. 16 మందిని హోల్డ్‌లో పెట్టారు. ఈ పదహారు మందికి రకరకాల టాస్కులు పెట్టి వారిలో 9 మందిని టాప్ 15లో చేర్చనున్నారు. మరి ఆ టాస్కులేంటి? ఎవరు సెలక్ట్ అవుతారన్నది రేపటి ఎపిసోడ్ రివ్యూలో చూద్దాం..
చదవండి: శ్రీలీల సక్సెస్ వెనుక జూనియర్ ఎన్టీఆర్.. అప్పుడే డిసైడయ్యా!