ఆగిపోయిన ప్రశాంత్‌ వర్మ సినిమా.. బాలీవుడ్‌ డెబ్యూకు బ్రేక్‌! | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ వర్మ- రణ్‌వీర్‌ ప్రాజెక్ట్‌కు గుడ్‌బై..

Published Thu, May 30 2024 3:58 PM

Ranveer Singh, Prasanth Varma Rakshas Movie Shelved

టాలీవుడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ హనుమాన్‌ సినిమాతో సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టాడు. దీంతో ఆయనతో కలిసి పని చేయాలని బాలీవుడ్‌ స్టార్స్‌ సైతం ఆశపడ్డారు. ఈ క్రమంలో ప్రశాంత్‌ వర్మ.. బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి రాక్షస్‌ అనే టైటిల్‌ కూడా నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. 

ఆగిపోయిన మూవీ
ఇంతలోనే ఈ సినిమా ఆగిపోయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వీరి కాంబినేషన్‌లో ప్రాజెక్టు చేపట్టేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. ఆ ప్రకటనలో ప్రశాంత్‌.. 'రణ్‌వీర్‌ చాలా ఎనర్జిటిక్‌ పర్సన్‌. ఎంతో టాలెంట్‌ ఉన్న ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి పని చేస్తాం అని పేర్కొన్నాడు.

భవిష్యత్తులో..
అటు రణ్‌వీర్‌ సింగ్‌ సైతం ప్రశాంత్‌  వర్మ టాలెంటెడ్‌ డైరెక్టర్‌. మేము కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాం. అయితే ఫ్యూచర్‌లో తప్పకుండా కలిసి పని చేస్తాం అని తెలిపాడు.  ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ జై హనుమాన్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది హనుమాన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.

 

 

చదవండి: కజ్‌రారే సాంగ్‌.. లైవ్‌లో డ్యాన్స్‌ మర్చిపోలేనన్న అమితాబ్‌..

Advertisement
 
Advertisement
 
Advertisement