'రణ్‌వీర్‌లో ఆ లక్షణాలే నచ్చాయి'.. దీపికా పెళ్లి వీడియో వైరల్! | Deepika Padukone and Ranveer Singh 6th marriage anniversary | Sakshi
Sakshi News home page

Deepika Padukone: 'రణ్‌వీర్‌లో ఎవరూ చూడని వ్యక్తిని చూశా'.. పెళ్లి వీడియోలో దీపికా పదుకొణె!

Nov 14 2024 1:01 PM | Updated on Nov 14 2024 1:12 PM

Deepika Padukone and Ranveer Singh 6th marriage anniversary

బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ కపుల్స్‌లో దీపికా పదుకొణె- రణ్‌వీర్‌ సింగ్‌ ఒకరు. ఈ జంటకు ఇటీవలే కూతురు జన్మించింది. వీరి పెళ్లయిన ఆరేళ్లకు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. సెప్టెంబర్ 8న ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో దీపికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే ఈ జంట ఇవాళ తమ ఆరో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2018లో ఇటలీలో జరిగిన గ్రాండ్‌ వెడ్డింగ్‌లో ఈ జంట ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకల్లో బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. కొంకణి, సింధీ సంప్రదాయాల్లో నవంబర్ 14న వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరికి పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఈ వీడియోలో తన భర్త రణ్‌వీర్ సింగ్‌ గురించి దీపికా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోని చాలా మంది చూడని వ్యక్తికి నేను ఆకర్షితురాలినయ్యా. అతనినొక నిశ్శబ్దం. అంతేకాదు తెలివైన, సున్నితమైన వ్యక్తి. అతను ఏడిస్తే నాకు చాలా ఇష్టం. అంతకుమించి మంచి మనసున్న వ్యక్తి. అందుకే నేను ఇష్టపడ్డా' అని పెళ్లి వీడియోలో మాట్లాడింది.

కాగా.. గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా (2013) సెట్‌లో వీరిద్దరు తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ జంట దాదాపు ఆరేళ్ల డేటింగ్ తర్వాత వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ రోజు మ్యారేజ్ డే సందర్భంగా దీపికా పదుకొణెకు స్పెషల్‌గా విషెస్ తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement