యంగ్ హీరోకి వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పిన స్టార్ హీరో | Akshay Kumar Birthday Wishes To Ranveer Singh With Dance Video | Sakshi
Sakshi News home page

Akshay Kumar: బర్త్ డే విషెస్ చెబుతూ తెగ నవ్వించారు!

Jul 6 2024 2:25 PM | Updated on Jul 6 2024 2:47 PM

Akshay Kumar Birthday Wishes To Ranveer Singh With Dance Video

సాధారణంగా పుట్టినరోజు విషెస్ అంటే ట్వీట్ లేదంటే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి విషెస్ చెప్పొచ్చు. కానీ కొందరు మాత్రం డిఫరెంట్‌గా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇలానే ప్రయత్నించాడు. తన తోటీ హీరో అయిన రణ్‌వీర్ సింగ్‌కి క్రేజీ వీడియోతో శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇప్పుడిది వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: 'కల్కి' రికార్డుల పరంపర.. నైజాం, ఓవర్సీస్‌లో తగ్గేదే లే)

బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో వీళ్లిద్దరూ కలిసి సూర్యవంశీ, సింగం-2 సినిమాల్లో కలిసి నటించారు. అలా వీరిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా అక్షయ్ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసి మరీ విషెస్ చెప్పాడు.

గతంలో మూవీ షూటింగ్ టైంలో తీసిన పాత వీడియోలో భాగంగా రణ్‌వీర్, అక్షయ్ క్రేజీ స్టెప్పులేస్తూ కనిపించారు. ఇకపోతే విషెస్ చెబుతూ రణ్‌వీర్‌ని అక్షయ్ పవన్ హౌస్‌తో పోల్చడం విశేషం. నిజం చెప్పాలంటే బాలీవుడ్‪‌లో ఈ ఇద్దరు హీరోలు పవర్ హౌస్ లాంటివాళ్లే. కానీ గత కొన్నాళ్ల నుంచి వీళ్లకు సరైన హిట్ పడట్లేదు. 

(ఇదీ చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్)

Advertisement
 
Advertisement
Advertisement