డైరెక్టర్‌ కూతురి రెండో పెళ్లి.. స్టెప్పులతో అదరగొట్టిన స్టార్స్‌ | Sakshi
Sakshi News home page

శంకర్‌ కూతురి రిసెప్షన్‌.. తారల మాస్‌ స్టెప్పులు చూసేయండి

Published Wed, Apr 17 2024 1:14 PM

Ranveer Singh Dance In Aishwarya Shankar Reception - Sakshi

ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ కూతురు ఐశ్వర్య పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఏప్రిల్‌ 15న జరిగిన ఈ వివాహ వేడుకకు రజనీకాంత్‌, సూర్య, కమల్‌ హాసన్‌ సహా దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన స్టార్స్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం ఎంతో వైభవంగా రిసెప్షన్‌ నిర్వహించగా బాలీవుడ్‌ సెలబ్రిటీలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

ముఖ్యంగా సౌత్‌ డైరెక్టర్‌ అట్లీ- బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ తమ డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లేలా చేశారు. వీరితోపాటు శంకర్‌ రెండో కూతురు, హీరోయిన్‌ అదితి శంకర్‌ కూడా ఎంతో హుషారుగా చిందేయడం విశేషం. ఇక వీరంతా తమిళ హిట్‌ సాంగ్స్‌కు కాలు కదిపారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా ఐశ్వర్య శంకర్‌ గతంలో క్రికెటర్‌ దామోదర్‌ రోహిత్‌ను పెళ్లాడింది. ఇతడు ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు రావడంతో ఐశ్వర్య తన నుంచి విడాకులు తీసుకుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్‌ కార్తికేయన్‌తో నిశ్చితార్థం జరగ్గా రెండు రోజులక్రితమే ఘనంగా వివాహం జరిపించారు.

చదవండి: నువ్వు వర్జినా..? ముందు నీ పెళ్లి గురించి చెప్పమన్న హీరోయిన్‌ తనయుడు

Advertisement
 
Advertisement