దీపికా పదుకొణెకు ప్రెగ్నెన్సీ.. అందుకోసం లండన్‌ వెళ్తున్నారా? | Deepika Padukone To Give Birth To Her Baby In September On This Date, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Deepika Padukone: దీపికా పదుకొణెకు ప్రెగ్నెన్సీ.. లండన్‌ వెళ్లడంపై క్లారిటీ!

Sep 1 2024 1:05 PM | Updated on Sep 1 2024 5:14 PM

Deepika Padukone to give birth to Her baby In September On This Date

బాలీవుడ్ మోస్ట్ పాపులర్ జంటల్లో దీపికా పదుకొణె - రణ్‌వీర్‌ సింగ్ జంట ఒకరు. ఇప్పటికే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించిన ఈ కపుల్‌ త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భంతో ఉందని అభిమానులతో తొలిసారి అధికారికంగా పంచుకున్నారు. సెప్టెంబర్‌లో తమ జీవితంలో బిడ్డను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పటికే ముంబయిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలతో లగ్జరీ విల్లాను నిర్మిస్తున్నారు. బిడ్డ పుట్టాకే ఆ ఇంట్లోకి వెళ్లనున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది.

అయితే దీపికా పదుకొణె సెప్టెంబర్ 28న ముంబయిలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట ప్రసవం కోసం లండన్‌కు వెళ్లనున్నారని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దక్షిణ ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే డెలివరీకి కానున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కల్కితో అభిమానులను అలరించిన దీపికా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్షణాలను ఆస్వాదిస్తోంది. దీంతో ఆమె వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్‌లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఆ తర్వాతే కల్కి పార్ట్-2లో సెట్స్‌లో కనిపించే అవకాశముంది. కాగా.. దీపికా చివరిసారిగా కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న సింగం ఎగైన్‌లో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement