
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధురంధర్ అనే యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే జూలై 6న రణ్‌వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ యాక్షన్ చిత్రం డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో రణ్‌వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమా తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తోన్న డాన్ -3లో నటించనున్నారు.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే తాజాగా మన స్టార్ హీరో ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినీ తారలు ఇలాంటి లగ్జరీ కార్లు కొనడం సాధారణమే అయినప్పటికీ దీని విలువ దాదాపు రూ.4.57 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. సరికొత్త హై ఎండ్ ఈవీని రణ్‌వీర్ సింగ్ తన గ్యారేజీకి మరో కారును తీసుకొచ్చారు. ఈ విలాసవంతమైన కారును తన పుట్టిన రోజు కానుకగా జూలై 6న కొన్నట్లు టాక్ వినిపిస్తోంది. కొత్తకారులో తన సతీమణి దీపికా పదుకొణెతో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు.