వస్తువు కొనుక్కునే ముందు టెస్ట్‌ చేస్తాం.. పెళ్లికి ముందు ఇదీ అంతే! | Koffee With Karan: Twinkle Khanna Supported Deepika Padukone For Her Remark On Casual Dating Comment | Sakshi
Sakshi News home page

Twinkle Khanna: కాబోయే భర్త ఎదుటే పలువురితో డేటింగ్‌.. అందులో తప్పేముందన్న నటి

Published Mon, Nov 20 2023 5:05 PM | Last Updated on Mon, Nov 20 2023 6:00 PM

Koffee With Karan: Twinkle Khanna Supported Deepika Padukone For Her Remark On Casual Dating Comment - Sakshi

ఎవరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు. ఎప్పటికప్పుడు పరిస్థితుల వల్లో, మరే ఇతర కారణాల వల్లో మారుతూ ఉంటారు. ఒకప్పుడు సింగిల్‌గా ఉండాలనుకుంది స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె. జీవితంలో పెళ్లి జోలికే వెళ్లకూడదనుకుంది. కానీ హీరోయిన్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన తర్వాత పలువురితో ప్రేమాయణం సాగించి చివరకు హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడింది. ఇతడే అసలైన జీవిత భాగస్వామి అనిపించడంతో సింగిల్‌గా ఉండాలనుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేసింది. ఆ మధ్య కాఫీ విత్‌ కరణ్‌ షోకి భర్తతో కలిసి హాజరైంది దీపిక.

చివరకు అతడితోనే పెళ్లి
ఈ సందర్భంగా భర్త కంటే ముందు పలువురితోనూ ప్రేమలో పడ్డ విషయాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా రణ్‌వీర్‌ సింగ్‌ పరిచయమయ్యాక కూడా చాలామందిని కలిశాను, కానీ ఎవరూ తనకంత కనెక్ట్‌ అవలేదని, మనసులో ఎక్కడో రణ్‌వీర్‌ సరైన జోడీ అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇతరులతో డేట్‌కు వెళ్లినప్పటికీ చివరకు రణ్‌వీర్‌నే పెళ్లి చేసుకున్నానని చెప్పింది. చాలామంది దీపికా వ్యాఖ్యలను విమర్శించారు.

ఎవరి దగ్గరా మోకరిల్లలేదు
తాజాగా నటి ట్వింకిల్‌ ఖన్నా.. దీపికా వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచింది. 'అంకుల్‌ అండ్‌ ఆంటీస్‌.. దీపిక కాబోయే భర్తతో డేటింగ్‌లో ఉన్నప్పుడు ఏ పురుషుడి చుట్టూ తిరగలేదు. ఎవరి దగ్గరా మోకరిల్లలేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకు ఎందుకంత విమర్శిస్తున్నారు? అంతలా తిడుతున్నారు.. ఈ ట్రోలింగ్‌ ఏ రేంజ్‌కు వెళ్లిందంటే.. బనారస్‌ యూనివర్సిటీలో ఓ అమ్మాయి దీపికగా, కొందరు అబ్బాయిలు ఆమె మాజీ ప్రియులుగా యాక్ట్‌ చేసి నటిపై సెటైర్స్‌ వేస్తున్నారు. 

అది తప్పు కాదు
నిజానికి దీపిక అన్నదాంట్లో తప్పేంటి? మనం ఒక సోఫా కొనేముందు దుకాణానికి వెళ్లి ఏది మృదువుగా ఉంది? ఏది సౌకర్యవంతంగా ఉంది? దాని నాణ్యత ఎలా ఉంది? ఇవన్నీ టెస్ట్‌ చేస్తాం కదా! మరి పెళ్లి విషయంలో ఆ మాత్రం ఆలోచిస్తే తప్పేంటట? మనకు ఎవరు కరెక్ట్‌ అనేది ఆలోచించి సెలక్ట్‌ చేసుకోవడం తప్పేం కాదు' అని చెప్పుకొచ్చింది ట్వింకిల్‌ ఖన్నా.

చదవండి: సినిమా సూపర్‌ హిట్‌.. హీరోయిన్‌ అందంగా లేదట.. డైరెక్టర్‌ రెస్పాన్స్‌ చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement