
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌లో జంట రణ్‌వీర్ సింగ్- దీపికా పదుకొణె ఒకటి. 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. దాదాపు ఆరేళ్ల తర్వాత 2024లో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లలను కనడానికి ఇంత గ్యాప్ తీసుకోవడం తన నిర్ణయమే అంటోంది దీపికా. ఈ విషయంలో రణ్‌వీర్ సింగ్ తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచాడని చెప్పింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ప్రెగ్నెన్సీ విషయంలో రణ్‌వీర్ ఎంత క్లారిటీగా ఉన్నారనే విషయాన్ని చెబుతూ భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది.

‘పెళ్లయిన కొత్తలో ఓ సారి పిల్లలను కనడం గురించి రణ్‌వీర్‌తో మాట్లాడుతూ..ఎప్పుడు ప్లాన్ చేద్దాం అని అడిగాను. దానికి ఆయన సమాధానం ఇస్తూ..‘పిల్లలను కనడం ఇద్దరి నిర్ణయం అయినప్పటికీ.. మోయాల్సింది నువ్వు మాత్రమే. నీ శరీరంలోనే బేబీ పెరుగుతుంది. కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకోవాలి. పిల్లలను కనగలను అని నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్లాన్ చేద్దాం’ అన్నారు. ఆయన మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి’ అని దీపికా చెప్పుకొచ్చిది.
ఇక తన కూతురుకి దువా అనే ఎందుకు పెట్టారో వివరిస్తూ.. ‘బేబీకి పెరు పెట్టే విషయంలో మేం తొందరపడలేదు. బిడ్డ పుట్టిన రెండు నెలల తర్వాత పేరు పెట్టాం. ముందుగా బేబీ క్షేమంగా మా చేతుల్లోకి రావాలనే కోరుకున్నాం.దువా అనే పేరు కూడా అనుకోకుండా పెట్టేశాం. ఓ రోజు రాత్రి సెట్‌లో ఉన్న రణ్‌వీర్‌కి మెసేజ్ చేశాను. బేబీ పేరు గురించి చర్చిస్తూ ‘దువా’ అన్నాను. వెంటనే ఓకే చెప్పేశాడు. అదే పేరును మేం ప్రకటించాం. అరబిక్ భాషలో దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానమే ఈ పాప అని అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టేశాం’అని దీపికా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు బ్రేక్ తీసుకొని పూర్తి సమయం బేబీకి కేటాయించింది. కల్కి 2లో నటించబోతుంది. అలాగే షారుఖ్ ఖాన్ కొత్త సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.