పదిహేడేళ్ల తర్వాత... | Amitabh Bachchan And Shahrukh Khan To Reunite For New A Project After 17 Years, Deets Inside - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan and Shahrukh Khan: పదిహేడేళ్ల తర్వాత...

Aug 28 2023 1:28 AM | Updated on Aug 28 2023 11:19 AM

Amitabh Bachchan and Shahrukh Khan to reunite for new a project after 17 years - Sakshi

బాలీవుడ్‌ సీనియర్‌ డాన్స్‌కు నూతన డాన్‌ రణ్‌వీర్‌ సింగ్‌ అండ్‌ టీమ్‌ నుంచి ఆహ్వానాలు అందనున్నాయని బాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో ‘డాన్‌ 3’ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే బాలీవుడ్‌ వెండితెరపై డాన్‌ పాత్రలు చేసిన అమితాబ్‌ బచ్చన్‌(డాన్‌– 1978), షారుక్‌ ఖాన్‌ (డాన్‌–2006, ‘డాన్‌ 2’–2011)లు ‘డాన్‌ 3’ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. ఇందుకోసం రణ్‌వీర్, ఫర్హాన్‌లు ప్రయత్నాలు మొదలు పెట్టారని టాక్‌. అయితే 2006లో వచ్చిన ‘కభీ అల్విదా నా కహ్‌నా’ తర్వాత అమితా»Œ , షారుక్‌  స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు. మరి..‘డాన్‌ 3’ కోసం దాదాపు 17ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటారా? వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement