రణ్‌వీర్‌ సింగ్‌ గ్యారేజ్‌లో కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్‌ | Ranveer Singh Buys BMW i7 Becomes Second Electric Car In Convoy | Sakshi
Sakshi News home page

రణ్‌వీర్‌ సింగ్‌ గ్యారేజ్‌లో కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్‌

Oct 10 2026 6:36 PM | Updated on Oct 10 2026 6:42 PM

Ranveer Singh Buys BMW i7 Becomes Second Electric Car In Convoy

బాలీవుడ్‌ సూపర్‌స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)  కలల కార్ల జాబితాలోకి మరో సరికొత్త లగ్జరీ కారు వచ్చి చేరింది. ఇటీవల రెండో బిడ్డకు స్వాగతించిన రణ్‌వీర్‌ , దీపికా పడుకోన్‌ దంపతులు ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం BMW విడుదల చేసిన సరికొత్త BMW i7 ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆయన కొనుగోలు చేశారు.

సరికొత్త BMW i7 కారును డెలివరీ తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. రూ. 1.95 కోట్లకు పైగా (ఎక్స్-షోరూమ్) విలువైన ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే బీఎండబ్ల్యూ ఇండియా సంస్థ తమ కొత్త 7-సిరీస్ , ఎలక్ట్రిక్ కార్ల లాంచ్ కోసం రణ్‌వీర్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది.  

 రణ్‌వీర్ సింగ్ షోరూమ్‌కు వెళ్లి తన సరికొత్త BMW i7 కారును డెలివరీ తీసుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   ఇది పవర్‌ఫుల్‌ ఫీచర్లు, అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్ , అత్యాధునిక టెక్నాలజీతో  లాంచ్‌ అయింది

 

కాగా ఇప్పటికే రణ్‌వీర్ సింగ్ గ్యారేజ్‌లో  ఇప్పటికే పలు హై-ఎండ్ లగ్జరీ కార్లు ఉన్నాయి. ముఖ్యంగా GMC హమ్మర్ EV (Hummer EV) ,లంబోర్గిని ఉరస్ (Lamborghini Urus)మెర్సిడెస్-మేబ్యాచ్ GLS 600,రేంజ్ రోవర్ (Range Rover) ,ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్ లాంటివి  రణ్‌వీర్‌ సొంతం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement